HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Sports
  • >My Talent Is Well Known To Rohit Hardik Pandya

Hardik Pandya: నా టాలెంట్ రోహిత్ కు బాగా తెలుసు: హార్దిక్

టీమిండియా స్టార్ ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా రాబోయే వన్డే సిరీస్‌ కోసం సిద్దమవుతున్నాడు. అయితే ఈ సిరీస్ ప్రారంభానికి ముందు హార్దిక్ ఒక ఇంటర్వ్యూలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. రోహిత్ శర్మపై హార్దిక్ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

  • Author : Vamsi Chowdary Korata Date : 06-02-2025 - 2:48 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Hardik Pandya
Hardik Pandya

టీమిండియా స్టార్ ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా రాబోయే వన్డే సిరీస్‌ కోసం సిద్దమవుతున్నాడు. టి20 సిరీస్ లో అద్భుతంగా రాణించిన పాండ్యా వన్డే సిరీస్ లోనూ సత్తా చాటగలడని నిపుణులు భావిస్తున్నారు. అయితే ఈ సిరీస్ ప్రారంభానికి ముందు హార్దిక్ ఒక ఇంటర్వ్యూలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. రోహిత్ శర్మపై హార్దిక్ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. మరోవైపు టి20 వరల్డ్ కప్ లో ఫైనల్ మ్యాచ్ పై హార్దిక్ కీలక వ్యాఖ్యలు చేశాడు.

టి20 ప్రపంచ కప్ ఫైనల్‌ మ్యాచ్ పై హార్దిక్ మాట్లాడుతూ.. నా పొటన్షియాలిటీ రోహిత్ కు బాగా తెలుసనీ హార్దిక్ చెప్పాడు. క్లాసెన్‌ను అవుట్ చేయడానికి ముందు రోహిత్ తో చర్చించినట్లు చెప్పాడు. బంతి వేయడానికి ముందు క్లాసెన్‌కు వైడ్ బాల్ వేస్తానని రోహిత్ తో సంభాషించినట్లు హార్దిక్ అన్నాడు. ఇలా పక్కా ప్రణాళికతోనే క్లాసెన్‌ వికెట్ తీశానని చెప్పాడు. అయితే హార్దిక్ రోహిత్ శర్మపై చేసిన వ్యాఖ్యలు చర్చకు దారి తీశాయి. గతంలో రోహిత్, హార్దిక్ మధ్య విభేదాలున్నట్లు వార్తలు వినిపించాయి. గత సీజన్ ఐపీఎల్ కి ముంది రోహిత్ ను కెప్టెన్ నుంచి తప్పించి ముంబైకి హార్దిక్ ను కెప్టెన్ చేశారు. పైగా మైదానంలో హార్దిక్ రోహిత్ ని బౌండరీ లైన్ వద్ద ఫీల్డింగ్ కి పంపడం అప్పట్లో సంచలనంగా మారింది. కానీ టి20 వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ లో రోహిత్ హార్దిక్ ని కౌగిట్లోకి తీసుకుని ఏడుస్తున్న హార్దిక్ ని ఓదార్చడం అందర్నీ ఎమోషనల్ గా కనెక్ట్ చేసింది. ఇద్దరూ భావోద్వేగానికి గురై ఒకరినొకరు కౌగిలించుకున్నారు. దీంతో ఇద్దరి మధ్య విభేధాలున్నట్లు వస్తున్న వార్తలకి ఫుల్ స్టాప్ పడింది.

2024 ఐసిసి టి20 ప్రపంచ కప్ చివరి మ్యాచ్ భారత్ దక్షిణాఫ్రికా మధ్య జరిగింది. ఆ మ్యాచ్‌లో టీమిండియా 177 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. ఛేదనలో దక్షిణాఫ్రికా ఆరంభంలో అద్భుతంగా రాణించింది. చివరి వరకు మ్యాచ్ ఉత్కంఠగా సాగింది. ఒక దశలో ఆతిథ్య జట్టు 151/5తో విజయానికి చేరువైంది. కానీ హెన్రిచ్ క్లాసెన్ దూకుడుకి హార్దిక్ బ్రేకులు వేసి మ్యాచ్ ని మన చేతుల్లోకి తీసుకొచ్చాడు. ఈ మ్యాచ్‌లో హార్దిక్ పాండ్యా 3 వికెట్లు తీసి దక్షిణాఫ్రికాను కట్టడి చేశాడు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Hardik Pandya
  • Pandya Takes Klassen Wicket
  • rohit sharma
  • T20 world cup
  • team india

Related News

Vaibhav Suryavanshi to make his debut in the second T20 between India and England today!

vaibhav suryavanshi: నేడు భారత్-ఇంగ్లాండ్ రెండో టీ20లో.. వైభవ్ సూర్యవంశీ అరంగేట్రం.!

ఇంగ్లండ్‌తో ఇవాళ జరగనున్న రెండో టీ20 మ్యాచ్‌లో 15 ఏళ్ల యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ టీమిండియా తరఫున అరంగేట్రం చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ‘కొత్త అధ్యాయం’ అనే క్యాప్షన్‌తో అతను ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టిన ఒక స్టోరీ ఈ ఊహాగానాలకు మరింత బలం చేకూర్చింది. యూకే పర్యటనలో భాగంగా ఐర్లాండ్‌తో జరిగిన రెండు టీ20లు, ఇంగ్లండ్‌తో వర్షం కారణంగా రద్దయిన తొలి టీ20లోనూ వైభవ్ బెంచ్‌కే పరి

  • India vs. Sri Lanka Test series schedule...

    IND vs SL: ఇండియా, శ్రీలంక టెస్ట్ సిరీస్ షెడ్యూల్..

Latest News

  • Revanth Reddy: “తాత.. నువ్వు పూరీలు వేస్తేనే తింటాను”

  • Bandi Bhageerath: బండి భగీరథ్‌కు హైకోర్టు బెయిల్ మంజూరు

  • BSNL శాటిలైట్ ఫోన్‌ను విడుదల చేసింది

  • Musi Riverfront: మూసీ పునరుజ్జీవనానికి గ్రీన్ సిగ్నల్.. రూ.7 వేల కోట్లతో ప్రాజెక్టుకు ప్రభుత్వం ఆమోదం

  • Buggana Rajendranath: సీఎం చంద్రబాబు వల్లే వర్షాలు పడడం లేదు మాజీ మంత్రి

Trending News

    • Kissing Day: ఆవేశపూరితమైన ముద్దు నిమిషానికి 6.4 కేలరీల ఖర్చు చేస్తుంది

    • Kalyan Ram : సంక్రాంతి 2027కు సిద్ధమవుతున్న అనిల్ రావిపూడి.. కళ్యాణ్ రామ్ ఫస్ట్ లుక్‌ పోస్టర్ విడుదల !

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd