Mumbai Indians: ముంబై ఇండియన్స్ ఘన విజయం.. ప్లేఆఫ్స్‌కు అర్హత..!
మహిళల ప్రీమియర్ లీగ్ 12వ మ్యాచ్ ముంబై ఇండియన్స్ (Mumbai Indians), గుజరాత్ జెయింట్స్ (Gujarat Giants) మధ్య జరిగింది. ఈ మ్యాచ్‌లో ముంబై మరోసారి గుజరాత్ జెయింట్స్‌ను ఓడించి టోర్నీలో వరుసగా ఐదో విజయాన్ని నమోదు చేసింది.
- By Gopichand Published Date - 06:42 AM, Wed - 15 March 23

మహిళల ప్రీమియర్ లీగ్ 12వ మ్యాచ్ ముంబై ఇండియన్స్ (Mumbai Indians), గుజరాత్ జెయింట్స్ (Gujarat Giants) మధ్య జరిగింది. ఈ మ్యాచ్‌లో ముంబై మరోసారి గుజరాత్ జెయింట్స్‌ను ఓడించి టోర్నీలో వరుసగా ఐదో విజయాన్ని నమోదు చేసింది. ఈ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ 55 పరుగుల తేడాతో గుజరాత్ జెయింట్స్‌ను ఓడించింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 162 పరుగులు చేసింది. అనంతరం గుజరాత్ జెయింట్స్ 20 ఓవర్లలో 9 వికెట్లకు 107 పరుగులు మాత్రమే చేయగలిగింది. ముంబై ఇండియన్స్ జట్టుకు ఇది వరుసగా ఐదో విజయం. 10 పాయింట్లతో ఈ జట్టు ప్లేఆఫ్‌కు అర్హత సాధించిన తొలి జట్టుగా నిలిచింది. ఇది కాకుండా, ఈ టోర్నమెంట్‌లో ఇప్పటివరకు 200 కంటే తక్కువ మొత్తంలో డిఫెన్స్ చేసిన మొదటి జట్టుగా కూడా ముంబై జట్టు నిలిచింది.
ఈ మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన ,ముంబై జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లకు 162 పరుగులు చేసింది. అనంతరం లక్ష్యఛేదనకు దిగిన గుజరాత్ జెయింట్స్ 20 ఓవర్లలో 9 వికెట్లకు 107 పరుగులు మాత్రమే చేసి ఓటమిపాలైంది. ముంబయి బౌలర్లలో నాట్ షివర్ 3, హేలీ మాథ్యూస్ 3, అమేలియా కెర్ 2, ఇస్సీ వాంగ్ 1 వికెట్ తీసి గుజరాత్ ను దెబ్బకొట్టారు. ముంబై కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ 30 బంతుల్లో 51 పరుగులు చేసి తన జట్టు స్కోరును 162కు తీసుకెళ్లింది. ముంబై ఈ ఇన్నింగ్స్‌లో, యస్తిక భాటియా 37 బంతుల్లో 44 పరుగులు, నాట్ షివర్ 31 బంతుల్లో 36 పరుగులు చేశారు.

Related News

Delhi Capitals: మహిళల ప్రీమియర్ లీగ్ లో ఫైనల్లోకి దూసుకెళ్లిన ఢిల్లీ క్యాపిటల్స్
మహిళల ప్రీమియర్ లీగ్ 20వ మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ (Delhi Capitals) ఐదు వికెట్ల తేడాతో యూపీ వారియర్స్‌పై విజయం సాధించింది. ఈ విజయంతో ఢిల్లీ జట్టు ఫైనల్‌కు చేరుకుంది.