HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Sports
  • >Mukesh Choudharys Mother Passes Away

సీఎస్కే బౌల‌ర్ ఇంట విషాదం!

ఐపీఎల్ 2026 వేలానికి ముందే సీఎస్కే ముకేష్ చౌదరిని రిటైన్ చేసుకుంది. సన్‌రైజర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఖలీల్ అహ్మద్ స్థానంలో అతనికి అవకాశం లభించింది.

  • Author : Gopi Date : 23-04-2026 - 12:39 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Mukesh Choudhary
Mukesh Choudhary

Mukesh Choudhary: ఐపీఎల్ 2026 ఉత్కంఠగా సాగుతున్న సమయంలో చెన్నై సూపర్ కింగ్స్ ఆటగాడు ముకేష్ చౌదరిని తీరని లోటు వేధిస్తోంది. ముకేష్ తల్లి కన్నుమూశారు. ఈ విషయాన్ని చెన్నై సూపర్ కింగ్స్ ఫ్రాంచైజీ అధికారికంగా ధృవీకరించింది. ముకేష్‌కు మద్దతుగా ఫ్రాంచైజీ సోషల్ మీడియాలో ఒక భావోద్వేగ సందేశాన్ని కూడా పోస్ట్ చేసింది. ముకేష్ తల్లి మరణంతో ముంబై ఇండియన్స్‌తో జరగబోయే కీలక మ్యాచ్‌కు దూరం కానున్నాడు.

సొంతూరికి బయలుదేరిన ముకేష్

ఈ విషాద వార్త తెలిసిన వెంటనే ముకేష్ చౌదరి జట్టును వీడి తన సొంత ఊరు రాజస్థాన్‌లోని భిల్వారాకు బయలుదేరారు. తన తల్లి అంత్యక్రియల్లో పాల్గొనేందుకు ఆయన వెళ్లడంతో ముంబైతో జరిగే మ్యాచ్‌లో అందుబాటులో ఉండడు.

Also Read: డ్రైవింగ్ చేస్తున్నప్పుడు విండ్‌షీల్డ్ పగిలితే ఏం చేయాలి?

సీఎస్కే సంతాపం

ముకేష్ చౌదరి మాతృమూర్తి మరణం పట్ల చెన్నై సూపర్ కింగ్స్ సంతాపం వ్యక్తం చేసింది. “ముకేష్ చౌదరి తల్లి మరణం పట్ల సీఎస్కే కుటుంబం విచారం వ్యక్తం చేస్తోంది. ఈ కష్టకాలంలో మేము ముకేష్, అతని కుటుంబానికి అండగా ఉంటాము. మా ప్రార్థనల్లో వారి కుటుంబానికి స్థానం ఉంటుంది” అని ఫ్రాంచైజీ పేర్కొంది.

ఈ సీజన్ ప్రదర్శన

ముకేష్ చౌదరి ఈ ఐపీఎల్ సీజన్‌లో ఇప్పటివరకు ఒకే ఒక మ్యాచ్ ఆడాడు. సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన ఆ మ్యాచ్‌లో ఆయన అద్భుతంగా రాణించి, 21 పరుగులు ఇచ్చి 2 వికెట్లు పడగొట్టాడు. 2022లో చెన్నై సూపర్ కింగ్స్ తరఫునే ఐపీఎల్‌లోకి ప్రవేశించాడు ముకేష్‌. ఇప్పటివరకు 17 మ్యాచ్‌లు ఆడి 19 వికెట్లు తీశాడు. 28.57 సగటుతో రాణించాడు.

రిటెన్షన్, తదుపరి అవకాశం

ఐపీఎల్ 2026 వేలానికి ముందే సీఎస్కే ముకేష్ చౌదరిని రిటైన్ చేసుకుంది. సన్‌రైజర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఖలీల్ అహ్మద్ స్థానంలో అతనికి అవకాశం లభించింది. ఇప్పుడు ముకేష్ జట్టుకు దూరం కావడంతో ముంబైతో జరగబోయే మ్యాచ్‌లో గుర్జప్‌నీత్ ప్లేయింగ్ 11లోకి వచ్చే అవకాశం ఉంది.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Bhilwara
  • Chennai Super Kings
  • CSK Player Tragedy
  • IPL 2026
  • Mukesh Choudhary
  • Mukesh Choudhary Mother Death

Related News

Krunal Pandya wins the IPL title for the fifth time.

Krunal Pandya: ఐపీఎల్‌లో ఐదోసారి కప్పు కొట్టిన కృనాల్ పాండ్యా

ఐపీఎల్ చరిత్రలో అత్యంత విజయవంతమైన ఆటగాళ్ల జాబితాలో ఆల్ రౌండర్ కృనాల్ పాండ్యా చోటు దక్కించుకున్నాడు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) వరుసగా రెండోసారి ఛాంపియన్ గా నిలవడంతో కృనాల్ తన కెరీర్ లో ఐదో ఐపీఎల్ టైటిల్ ను సొంతం చేసుకున్నాడు. త‌ద్వారా ఐపీఎల్ లో ఐదు లేదా అంతకంటే ఎక్కువ టైటిళ్లు గెలిచిన ఆటగాళ్ల ఎలైట్ క్లబ్ లో చేరాడు. దిగ్గజాల సరసన కృనాల్ ఐపీఎల్ లో అత్యధిక టైటిళ

    Latest News

    • Importance of Marriage: పెళ్లికి ఆ మూడు రుణాలతో సంబంధం తెలుసా?

    • PM Modi: జవహర్‌లాల్ నెహ్రూ రికార్డు బ్రేక్ చేయబోతున్న ప్రధాని మోడీ.

    • DK Shivakumar: కర్ణాటక ముఖ్యమంత్రిగా డీకే శివకుమార్ ప‍్రమాణం

    • CM Chandrababu: తెలంగాణలో పవన్ సభపై స్పందించిన చంద్రబాబు

    • Khushboo: సీఎం విజయ్‌ని కలిసి కూతురి వెడ్డింగ్ కార్డ్ ఇచ్చిన ఖుష్బూ దంపతులు

    Trending News

      • Kalita Majhi: అప్పట్లో ఇంటి పనిమనిషి.. నేడు బెంగాల్‌ మంత్రి

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd