HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Sports
  • >Ms Dhonis Sensation Gets Trademark In The Name Of Captain Cool

MS DHONI : ఎంఎస్ ధోని సంచలనం..‘కెప్టెన్ కూల్’ పేరిట ట్రేడ్ మార్క్ కైవసం!

MS DHONI : మైదానంలో ఎంతటి ఒత్తిడినైనా చిరునవ్వుతో ఎదుర్కొనే టీమిండియా మాజీ సారథి మహేంద్ర సింగ్ ధోని తన ప్రశాంతమైన ప్రవర్తనతో 'కెప్టెన్ కూల్'గా ప్రపంచవ్యాప్తంగా అభిమానుల మన్ననలు పొందిన విషయం తెలిసిందే.

  • Author : Kavya Krishna Date : 01-07-2025 - 8:46 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Ms Dhoni
Ms Dhoni

MS DHONI : మైదానంలో ఎంతటి ఒత్తిడినైనా చిరునవ్వుతో ఎదుర్కొనే టీమిండియా మాజీ సారథి మహేంద్ర సింగ్ ధోని తన ప్రశాంతమైన ప్రవర్తనతో ‘కెప్టెన్ కూల్’గా ప్రపంచవ్యాప్తంగా అభిమానుల మన్ననలు పొందిన విషయం తెలిసిందే. దశాబ్దాలుగా తనతో ముడిపడిన ఈ ‘కెప్టెన్ కూల్’ అనే ముద్దుపేరును ఇప్పుడు అధికారికంగా సొంతం చేసుకునేందుకు సిద్ధమయ్యారు.తన ఐకానిక్ నిక్‌నేమ్‌పై పూర్తి హక్కుల కోసం ఆయన ట్రేడ్‌మార్క్ కోసం దరఖాస్తు చేశారు. ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుండటంతో అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

ధోనికి చెందిన రితి స్పోర్ట్స్ మేనేజ్‌మెంట్ సంస్థ, 2023 జూన్ 5న ‘కెప్టెన్ కూల్’ పేరు మీద ట్రేడ్‌మార్క్ కోసం దరఖాస్తు చేసింది. క్రీడా శిక్షణ, కోచింగ్ సేవలు, ట్రైనింగ్ సెంటర్ల వంటి వాటికి ఈ పేరును ఉపయోగించుకునేందుకు క్లాస్ 41 కింద ఈ దరఖాస్తును సమర్పించారు. సుదీర్ఘ ప్రక్రియ అనంతరం, ట్రేడ్‌మార్క్ రిజిస్ట్రీ ఈ దరఖాస్తును అంగీకరించి 2025 జూన్ 16న అధికారిక ట్రేడ్‌మార్క్ జర్నల్‌లో ప్రచురించింది.

అయితే, ఈ ప్రక్రియ అంత సులభంగా జరగలేదని తెలుస్తోంది. తొలుత ‘కెప్టెన్ కూల్’ పేరుతో ఇప్పటికే మరో సంస్థకు ట్రేడ్‌మార్క్ ఉందని రిజిస్ట్రీ అభ్యంతరం తెలిపింది. దీనిపై ధోని న్యాయవాదుల బృందం వాదిస్తూ ‘కెప్టెన్ కూల్’ అనే పేరుకు ధోనికి విడదీయరాని సంబంధం ఉందని, ప్రపంచవ్యాప్తంగా ఈ పేరు ధోనికే ప్రత్యేక గుర్తింపు తెచ్చిపెట్టిందని స్పష్టం చేసింది. ఈ పేరు వినగానే అందరికీ ధోనినే గుర్తుకు వస్తారని తమ వాదనలను బలంగా వినిపించింది.

చివరగా ఎంఎస్ ధోని న్యాయవాదుల వాదనలతో ఏకీభవించిన ట్రేడ్‌మార్క్ రిజిస్ట్రీ, వారి అభ్యర్థనను అంగీకరించింది. ఈ ట్రేడ్‌మార్క్ ఆమోదంతో, ‘కెప్టెన్ కూల్’ అనే పేరుపై ధోనికి పూర్తి వాణిజ్య హక్కులు లభిస్తాయి. భవిష్యత్తులో క్రీడా అకాడమీలు లేదా ఇతర వాణిజ్య కార్యకలాపాలకు ఈ బ్రాండ్‌ను ఉపయోగించుకునే అవకాశం ఉంటుంది. ఇది ధోని వ్యక్తిగత బ్రాండ్‌ను మరింత పటిష్టం చేయడంలో కీలక ముందడుగుగా క్రీడా విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే, ఈ పేరు మీదట మిగతా కంపెనీలు, సంస్థలు ఎటువంటి వ్యాపారా కార్యకలాపాలు కొనసాగించాడినికి వీలుపడదు. ఒకవేళ ఎవరైనా సాహసం చేస్తే ట్రేడ్ మార్క్ నిబంధనలు ఉల్లంఘనల కింద ధోని వారిపై కేసు ఫైల్ చేయవచ్చును. కాగా, కెప్టెన్ కూల్ పేరుతో ట్రేడ్ మార్క్‌ను ధోని పొందడంతో ఆయనేదో పెద్దగా ప్లాన్ చేస్తున్నారని సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Captain Cool
  • ms dhoni
  • Registry sanctioned
  • Sensational
  • sports
  • Trademark

Related News

Gautam Gambhir replied to MS Dhoni's

MS Dhoni : కోచ్ సాబ్.. మీ స్మైల్ సూపర్..ఎంఎస్ ధోనీ ఆసక్తికర పోస్ట్

MS Dhoni అహ్మదాబాద్ వేదికగా జరిగిన టీ20 ప్రపంచకప్ 2026 ఫైనల్‌లో న్యూజిలాండ్‌పై భారత్ 96 పరుగుల తేడాతో ఘన విజయం సాధించి విశ్వవిజేతగా నిలిచింది. ఈ చారిత్రక విజయం తర్వాత, భారత క్రికెట్‌లోని ఇద్దరు దిగ్గజాలైన మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ, ప్రస్తుత కోచ్ గౌతమ్ గంభీర్‌ల మధ్య సోషల్ మీడియాలో జరిగిన సంభాషణ అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంటోంది. వారిద్దరి మధ్య ఉన్న పాత విభేదాల ఊహాగానాలకు ఈ సంఘటన

  • MS Dhoni's Reaction To Wife Sakshi

    బుమ్రా క్యాచ్ పట్టడంతో ఎగిరి గంతేసిన సాక్షి..ధోనీ రియాక్షన్ చూస్తే నవ్వులే

  • Shivam Dube

    19 ఏళ్ల క్రితం ధోనీ.. ఇప్పుడు శివ‌మ్ దూబే!

  • MS Dhoni Fined

    ఎంఎస్ ధోనీకి షాక్ ఇచ్చిన పోలీసులు!

Latest News

  • LPG Gas : దేశ ప్రజలకు గుడ్ న్యూస్ తెలిపిన రిలయన్స్ ఇండస్ట్రీస్

  • అల్లు అర్జున్- అట్లీ క్రేజీ కాంబో.. ఏప్రిల్ 8న టైటిల్ ప్రకటన!

  • ఇషాన్ కిష‌న్ పెళ్లి ఎప్పుడో తెలుసా?!

  • ఇండిగోకు భారీ షాక్‌.. సీఈవో ప‌ద‌వికి పీటర్ రాజీనామా!

  • ఇరాన్ మ‌రో సంచ‌ల‌న నిర్ణ‌యం.. చ‌మురు ధ‌ర‌లు పెర‌గ‌నున్నాయా?!

Trending News

    • భార‌త్ ఘ‌న‌విజ‌యం.. బీసీసీఐ ఏం చేసిందంటే?

    • సిలిండ‌ర్ల స‌ర‌ఫ‌రాపై నిషేధం..?

    • ఐపీఎల్ 2026.. తొలి మ్యాచ్ ఈ జ‌ట్ల మ‌ధ్యే?!

    • మందుబాబులకు గుడ్‌న్యూస్.. ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు

    • టీమిండియా నెక్స్ట్ టార్గెట్ ఇదేనా?!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd