MS Dhoni: పాకిస్తాన్‌లో ఫుడ్ రుచి బాగుంటుంది: ధోనీ
ధోని ఇచ్చిన సలహాను ఓ అభిమాని తిరస్కరించాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ధోనీ తన క్రికెట్ కెరీర్‌లో చాలా సార్లు పాకిస్తాన్‌లో పర్యటించాడు
- Author : Praveen Aluthuru
Date : 30-12-2023 - 10:27 IST
Published By : Hashtagu Telugu Desk
MS Dhoni: ధోని ఇచ్చిన సలహాను ఓ అభిమాని తిరస్కరించాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ధోనీ తన క్రికెట్ కెరీర్‌లో చాలా సార్లు పాకిస్తాన్‌లో పర్యటించాడు.అక్కడి వంటకాలను రుచి చూశాడు. పాకిస్థాన్ ఫుడ్ అంటే ఇస్తామని మాహి చాల సార్లు పలు వేదికలపై చెప్పాడు. అయితే రీసెంట్ గా జరిగిన ఓ ఈవెంట్ లో మహేంద్ర సింగ్ ధోనీ ఒక వ్యక్తితో ..మీరు ఒకసారి తినడానికి పాకిస్తాన్ వెళ్లండి అని చెప్పాడు. ఆ అభిమాని మాత్రం ధోని ఇచ్చిన సలహాని సున్నితంగా తిరస్కరించాడు.
మీరు మంచి ఆహారం సూచించినా.. నేను అక్కడికి వెళ్లను. నాకు ఆహారం ఇష్టం, కానీ నేను అక్కడికి వెళ్లను అని చెప్పాడు. అభిమాని ఆలా చెప్పడంతో ధోని పగలబడి నవ్వడం మనం వీడియోలో చూడొచ్చు. ఈ వీడియోను ఇప్పటి వరకు లక్షలాది మందికి పైగా వీక్షించారు. మరోవైపు ఈ వీడియో చూసిన తర్వాత నెటిజన్స్ కొందరు భిన్నంగా స్పందిస్తున్నారు. ఎవరూ పాకిస్తాన్‌కు వెళ్లాలని అనుకోరు అని ఒకరు పోస్ట్ పెడితే . బ్రదర్ మనం తిన్న తర్వాత తిరిగి ఇండియాకి రావాలి. బాంబు ఎక్కడ పెడతారో ఎవరికి తెలుసు అంటూ ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు.
Also Read: IND vs SA 2nd Test: రెండో టెస్ట్ పై కన్నేసిన ఇరు జట్లు