MS Dhoni: చెన్నై ఫ్యాన్స్‌కు అదిరిపోయే గుడ్ న్యూస్.. కెప్టెన్‌గా ఎంఎస్ ధోనీ?
ఐపీఎల్ 2025లో చెన్నై సూపర్ కింగ్స్ ఇప్పటివరకు ఐదు మ్యాచ్‌లు ఆడింది. అందులో కేవలం ఒక్క మ్యాచ్‌లోనే గెలిచింది. సీజన్ ప్రారంభంలో చెన్నై ముంబై ఇండియన్స్‌ను ఓడించింది.
- By Gopichand Published Date - 07:50 PM, Thu - 10 April 25

MS Dhoni: ఐపీఎల్ 2025లో మిగిలిన మ్యాచ్‌లలో ఎంఎస్ ధోని (MS Dhoni) మరోసారి చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్‌కే) కెప్టెన్‌గా వ్యవహరించనున్నారు. దీనికి కారణం కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ మోచేయిలో ఫ్రాక్చర్ కారణంగా టోర్నమెంట్ నుండి తప్పుకోవడమే అని తెలుస్తోంది. సీఎస్‌కే హెడ్ కోచ్ స్టీఫన్ ఫ్లెమింగ్ గురువారం (ఏప్రిల్ 10) కోల్‌కతా నైట్ రైడర్స్‌తో జరిగే మ్యాచ్‌కు ఒక రోజు ముందు దీన్ని ధృవీకరించారు.
మ్యాచ్ సమయంలో రుతురాజ్‌కు గాయం
28 ఏళ్ల రుతురాజ్ గైక్వాడ్ మార్చి 30న రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో తుషార్ దేశ్‌పాండే బంతికి మోచేయిలో గాయమైంది. ఆ తర్వాత కూడా అతను ఢిల్లీ క్యాపిటల్స్, పంజాబ్ కింగ్స్‌తో జరిగిన తదుపరి రెండు మ్యాచ్‌లలో పాల్గొన్నాడు. కానీ ఇప్పుడు స్కాన్‌లో అతని మోచేయిలో ఫ్రాక్చర్ ఉన్నట్లు తేలింది. ఈ గాయం చెన్నై సూపర్ కింగ్స్‌కు పెద్ద దెబ్బ. ఈ సీజన్‌లో జట్టు ఇప్పటివరకు 5 మ్యాచ్‌ల్లో 4 మ్యాచ్‌లు ఓడిపోయింది. ఇప్పుడు వారు తమ కెప్టెన్, టాప్ ఆర్డర్‌లో కీలక బ్యాట్స్‌మన్ లేకుండా ఆడాల్సి ఉంటుంది. గత నాలుగు సీజన్‌లలో మూడు సార్లు రుతురాజ్ సీఎస్‌కే తరపున అత్యధిక రన్స్ సాధించిన బ్యాట్స్‌మన్‌గా నిలిచాడని గమనించాలి.
Also Read: Uber Cabs: బంగారు బిస్కెట్ల నుండి పెళ్లి చీరల వరకు.. ఉబర్‌లో మర్చిపోయే వస్తువుల లిస్ట్ ఇదే!
ఇప్పటివరకు ఐదు మ్యాచ్‌లలో నాలుగు ఓడిన చెన్నై
ఐపీఎల్ 2025లో చెన్నై సూపర్ కింగ్స్ ఇప్పటివరకు ఐదు మ్యాచ్‌లు ఆడింది. అందులో కేవలం ఒక్క మ్యాచ్‌లోనే గెలిచింది. సీజన్ ప్రారంభంలో చెన్నై ముంబై ఇండియన్స్‌ను ఓడించింది. కానీ ఆ తర్వాత వరుసగా నాలుగు మ్యాచ్‌లలో ఓటమిని చవిచూసింది. ప్రస్తుతం జట్టు వద్ద కేవలం 2 పాయింట్లు ఉన్నాయి. అది పాయింట్ల టేబుల్‌లో తొమ్మిదో స్థానంలో ఉంది. ఈ పరిస్థితిలో చెన్నై టాప్-4లోకి చేరే అవకాశాలు బలహీనంగా కనిపిస్తున్నాయి. అయినప్పటికీ ఇక్కడ నుండి జట్టు గెలుపు లయను పట్టుకుంటే ప్లేఆఫ్‌లకు చేరడం అసాధ్యం కాదు. కానీ ఈ ప్రయాణం అంత సులభం కాదు.