MS Dhoni: 200+ జాబితాలోకి జార్ఖండ్ డైనమైట్..
ధోనీ మరో రికార్డు సాధించాడు. ఐపీఎల్ చరిత్రలో ఒక జట్టు తరఫున అత్యధిక మ్యాచ్ లు ఆడిన ప్లేయర్ గా రికార్డు సృష్టించాడు.
- By Hashtag U Published Date - 10:06 PM, Wed - 4 May 22

ధోనీ మరో రికార్డు సాధించాడు. ఐపీఎల్ చరిత్రలో ఒక జట్టు తరఫున అత్యధిక మ్యాచ్ లు ఆడిన ప్లేయర్ గా రికార్డు సృష్టించాడు. ఇప్పటి వరకు చెన్నై సూపర్ కింగ్స్ జట్టు తరఫున 200 మ్యాచ్ లను ధోనీ ఆడాడు. బుధవారం (మే 4న) రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) , చెన్నై సూపర్ కింగ్స్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ లో ఈ రికార్డు ను ధోనీ నెలకొల్పాడు. వాస్తవానికి ఐపీఎల్ లో ఇప్పటివరకు ధోనీ 230 మ్యాచ్ లను ఆడాడు. అయితే మిగితా 30 మ్యాచ్ లను 2016, 17 సంవత్సరాల్లో “రైజింగ్ పుణె సూపర్ జయింట్స్” జట్టు తరఫున ధోనీ ఆడాడు. ధోని సారథ్యంలో సీఎస్‌కే ఇప్పటికే నాలుగుసార్లు ( 2010, 2011, 2018, 2021 ipl)
చాంపియన్‌గా నిలిచింది. ఇప్పటి వరకు ఐపీఎల్‌లో ఆడిన 199 మ్యాచ్‌లలో ధోని 4312 పరుగులు చేశాడు.
ఆ లిస్టులో ఇంకా ఎవరు..
ఐపీఎల్ లో ఒక జట్టు తరఫున అత్యధిక మ్యాచ్ లు ఆడిన ప్లేయర్స్ జాబితా లో ధోనీ తో పాటు ఆర్సీబీ ప్లేయర్ విరాట్ కోహ్లీ కూడా ఉన్నాడు. ఆర్సీబీ తరఫున కోహ్లీ 218 మ్యాచ్ లు ఆడాడు. చెన్నై సూపర్ కింగ్స్ ప్లేయర్ సురేష్ రైనా 176 మ్యాచ్ లు ఆడగా, అదే జట్టు ఆటగాడు రవీంద్ర జడేజా 142 మ్యాచ్ లు ఆడాడు.