MS Dhoni: పెంపుడు కుక్కల సమక్షంలో కేక్ కట్ చేసిన మాహీ
టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ జూలై 7న 42వ పుట్టిన రోజు జరుపుకున్నారు. కేవలం కుటుంబ సభ్యుల సమక్షంలో ఆయన తన పుట్టిన రోజు వేడుకలను చేసుకున్నారు.
- Author : Praveen Aluthuru
Date : 08-07-2023 - 5:57 IST
Published By : Hashtagu Telugu Desk
MS Dhoni: టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ జూలై 7న 42వ పుట్టిన రోజు జరుపుకున్నారు. కేవలం కుటుంబ సభ్యుల సమక్షంలో ఆయన తన పుట్టిన రోజు వేడుకలను చేసుకున్నారు. అయితే ధోనీ పుట్టిన రోజుకు సంబంధించి ఓ వీడియో నెటిజన్స్ ని కట్టిపడేస్తుంది. ఆ వీడియో ధోనీ అఫీషియల్ ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేశారు.
ధోని తన ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకున్న వీడియోలో తన పెంపుడు కుక్కలతో కేక్ కట్ చేస్తున్నాడు. వీడియోలో చూపించిన విధంగా కేక్ పీసెస్ ని తన పెంపుడు కుక్కలకు విసరడం గమనించవచ్చు. నాలుగు కుక్కలు ఒక్కొక్కటి వరుసగా నిల్చుని ధోనీ కేక్ కోసం ఆతృతగా వేచి చూస్తూ ఉంటాయి. ధోనీ కేక్ కట్ చేసి ఒక్కో పీస్ ని కుక్కలకు విసురుతూ తాను తింటాడు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ గా మారింది.
ఐపీఎల్ 2023 సీజన్లో ధోనీ సారధ్యంలో చెన్నై సూపర్ కింగ్స్ ఐదవసారి కప్ గెలుచుకుంది. ఎడమ కాలు మోకాలి నొప్పితో బాధపడుతూనే ధోనీ జట్టును టైటిల్ విజేతగా నిలిపాడు. అనంతరం మాహీ ముంబైలో మోకాలికి శస్త్రచికిత్స చేయించుకున్నాడు. ప్రస్తుతం ధోని విశ్రాంతి తీసుకుంటున్నాడు.
Read More: Lions couple Disturbed : సింహాల జంట సంభోగానికి భంగం.. బాలుడిపై ఎటాక్