MI vs RCB: ఒకే ఫ్రేమ్‌లో 59679
- Author : Praveen Aluthuru
Date : 09-05-2023 - 8:28 IST
Published By : Hashtagu Telugu Desk
MI vs RCB: క్రికెట్ ‘గాడ్’ సచిన్ టెండూల్కర్ విరాట్ కోహ్లీ కలుసుకుంటే ఆ క్లిప్పింగ్ సోషల్ మీడియాని షేక్ చేస్తుంది. ఇద్దరు లెజెండ్స్ కలుసుకున్న ఆ సమయం సగటు క్రికెట్ అభిమానికి పడుగలాంటి వాతావరణాన్ని తలపిస్తుంది. తాజాగా సచిన్, కోహ్లీ ఒకే ఫ్రేమ్ లో కనిపించేసరికి నెటిజన్ల చూపంతా వాళ్ళిద్దరిమీదనే.
సచిన్ టెండూల్కర్ క్రికెట్ ప్రపంచానికి ఒక రోల్ మోడల్. కానీ సచిన్ కోహ్లీకి రోల్ మోడల్. ఇది కోహ్లీ ఎన్నో సందర్భాల్లో చెప్పుకొచ్చాడు. కాగా తాజాగా ఈ ఇద్దరు లెజెండ్స్ కలిశారు. ముంబై ఇండియన్స్ మరియు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మ్యాచ్‌కు ముందు విరాట్ కోహ్లీ మరియు సచిన్ టెండూల్కర్ ప్రాక్టీస్ సెషన్‌లో కలుసుకున్నారు. సమావేశానికి సంబంధించిన క్లిప్‌ను ఐపీఎల్ అధికారిక ట్విట్టర్ హ్యాండిల్‌లో అప్‌లోడ్ చేశారు. ఇద్దరూ ఒకరితో ఒకరు సరదాగా నవ్వుకోవడం వీడియోలో చూడవచ్చు.
A legendary catch-up ahead of a captivating contest 😃👌🏻@sachin_rt 🤝 @imVkohli #TATAIPL | #MIvRCB pic.twitter.com/5UaZZqGxdY
— IndianPremierLeague (@IPL) May 9, 2023
ఈ వీడియోపై నెటిజన్లు చాలా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. విశేషమేమిటంటే ఈ వీడియోకు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అధికారిక ట్విట్టర్ హ్యాండిల్ నుండి కూడా స్పందన వచ్చింది. ‘ఒకే ఫ్రేమ్‌లో 59679 అంతర్జాతీయ పరుగులు, 175 వందల మిలియన్ల జ్ఞాపకాలు’ అని ట్వీట్‌లో పేర్కొన్నారు.
Read More: IPL 2023: రోహిత్ ప్లాప్ షోపై సెహ్వాగ్ ఆసక్తికర కామెంట్స్