HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Sports
  • >Major Accident Hits Gujarat Titans Team

GT : గుజ‌రాత్ టైటాన్స్ టీమ్‌కు త‌ప్పిన పెనుప్ర‌మాదం

  • Author : Prasad Date : 01-06-2026 - 8:38 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
GT
GT

ఐసీఎల్ ఫైన‌ల్‌లో ఓట‌మితో నిరాశ చెందిన గుజరాత్ టైటాన్స్ జ‌ట్టుకు పెను ప్ర‌మాదం తప్పింది. స్టేడియం నుంచి హోటల్‌కు తిరిగి వెళ్తుండగా గుజరాత్ టైటాన్స్ జట్టు ప్రయాణిస్తున్న బ‌స్సులో షార్ట్ సర్క్యూట్ కారణంగా మంట‌లు చెల‌రేగాయి. దీంతో జ‌ట్టు స‌భ్యులు ఆందోళ‌న చెందారు. అప్ర‌మ‌త్త‌మైన బ‌స్సు డ్రైవ‌ర్ ఆటగాళ్లను, సిబ్బంది అందరినీ సురక్షితంగా బయటకు తరలించారు. ఈ ఘ‌ట‌న‌లో ఎవ‌రికిఎలాంటి గాయాలు కాలేదు. వారిని తిరిగి టీమ్ హోటల్‌కు తీసుకెళ్లడానికి ప్రత్యామ్నాయ బస్సును ఏర్పాటు చేసే వరకు జట్టు స‌భ్యులు రోడ్డుపైనే వేచి ఉన్నారు.

ఐపీఎల్ ఫైనల్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు చేతిలో ఐదు వికెట్ల తేడాతో ఓడిపోయిన గుజరాత్ టైటాన్స్‌కు, నిరాశతో ఉండ‌గా ఈ బస్సు ప్రమాదం మ‌రింత ఆందోళ‌న క‌లిగించింది. మే 29న రాజస్థాన్ రాయల్స్‌తో క్వాలిఫయర్ 2 పోరు కోసం ధర్మశాల నుండి ముల్లన్‌పూర్‌కు ప్రయాణించిన తర్వాత.. ప్రతికూల వాతావరణం కారణంగా జట్టు ప్రయాణ అంతరాయాలను ఎదుర్కొంది. మే 30న అహ్మదాబాద్‌కు వారు ఉద‌యం వెళ్లాల్సి ఉండ‌గా.. ప్రయాణం ఆలస్యం కావడంతో, ఆ జట్టు శనివారం సాయంత్రానికి చేరుకుంది. ఫైనల్‌లో గుజరాత్ పేలవ ప్రదర్శనకు బిజీ షెడ్యూల్, ప్రయాణ అలసట కారణమయ్యాయా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అయితే వంద శాతం కార‌ణం అదికాద‌ని విశ్లేష‌కులు భావిస్తున్నారు


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • bus accident
  • Gujarath titans
  • IPL
  • IPL 2026
  • rcb

Related News

    Latest News

    • YOGA : ఆర్టీసీ హౌస్‌లో ఘనంగా అంతర్జాతీయ యోగా దినోత్సవం

    • Rains : వారం రోజుల పాటు తెలంగాణ‌లో భారీ వ‌ర్షాలు.. ఎల్లో అలెర్ట్ జారీ

    • Jnaneswari: చిన్నారి జ్ఞానేశ్వరి మిస్సింగ్ కేసులో ఎన్నో కొత్త మలుపు.?

    • Wedding : జర్మనీలో మొదలైన ప్రేమ.. పల్నాడులో పెళ్లి పీటలు

    • Happy Fathers Day: నాన్నకు ప్రేమతో…

    Trending News

      • Kodali Nani: కొడాలి నానిపై ప్రాసిక్యూషన్‌కు ప్రభుత్వ గ్రీన్ సిగ్నల్

      • లక్షల ఉద్యోగం వదిలి హైదరాబాద్‌లో ఊబర్ జాబ్.. ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన ఇన్స్పిరేషనల్ స్టోరీ

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd