Rishabh Pant: ఐపీఎల్‌లో 7 సంవత్సరాల తర్వాత పంత్ సెంచరీ.. వీడియో వైరల్!
ఇప్పటివరకు LSG తరపున అత్యంత వేగవంతమైన సెంచరీ సాధించిన రికార్డు కేఎల్ రాహుల్ పేరిట ఉంది. అతడు 2023లో ముంబై ఇండియన్స్‌పై 56 బంతుల్లో సెంచరీ పూర్తి చేశాడు.
- By Gopichand Published Date - 09:46 PM, Tue - 27 May 25

Rishabh Pant: రిషబ్ పంత్ (Rishabh Pant) తన IPL కెరీర్‌లో రెండో సెంచరీ సాధించాడు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB)తో జరిగిన మ్యాచ్‌లో అతడు 54 బంతుల్లో సెంచరీ పూర్తి చేశాడు. దీంతో అతడు LSG తరపున IPLలో అత్యంత వేగవంతమైన సెంచరీ సాధించిన ఆటగాడిగా నిలిచాడు. ఇది పంత్ ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో సాధించిన రెండో సెంచరీ. దీని కోసం అతడు 2574 రోజుల పాటు ఎదురుచూడాల్సి వచ్చింది. సెంచరీ పూర్తి చేసే వరకు పంత్ తన ఇన్నింగ్స్‌లో 10 ఫోర్లు, 6 ఆరు సిక్సర్లు కొట్టాడు.
RCBతో మ్యాచ్‌కు ముందు పంత్ 12 ఇన్నింగ్స్‌లో కేవలం 151 పరుగులు మాత్రమే చేశాడు. బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో పంత్ నంబర్-3 స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చాడు. అతడు మిచెల్ మార్ష్‌తో కలిసి 152 పరుగుల అద్భుతమైన భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. ఆ తర్వాత నికోలస్ పూరన్‌తో కలిసి 49 పరుగులు జోడించాడు. పంత్ 61 బంతుల్లో 118 పరుగులతో నాటౌట్‌గా వెనుదిరిగాడు. ఈ ఇన్నింగ్స్‌లో అతడు 11 ఫోర్లు, 8 సిక్సర్లు కొట్టాడు.
Also Read: Yuvraj Singh: గుజరాత్ టైటాన్స్‌లోకి యువరాజ్ సింగ్.. మెంటార్‌గా అవతారం?
COLDEST IPL CENTURY CELEBRATION.
– This is Rishabh Pant special. 😍❤️pic.twitter.com/0RWA1B2BYi
— Mufaddal Vohra (@mufaddal_vohra) May 27, 2025
2574 రోజుల తర్వాత వచ్చిన సెంచరీ
పంత్ IPLలో మొదటి సెంచరీ 2018 మే 10న సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై వచ్చింది. ఆ సంఘటన జరిగి ఇప్పటికి 2574 రోజులు గడిచాయి. దాదాపు 7 సంవత్సరాల నిరీక్షణ తర్వాత పంత్ ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో సెంచరీ సాధించాడు. ఈ సెంచరీ ప్రత్యేకమైనది. ఎందుకంటే RCBతో మ్యాచ్‌కు ముందు IPL 2025లో పంత్ అత్యధిక స్కోరు 63 పరుగులు మాత్రమే. ఈ సీజన్‌లో అతడు ఇప్పటివరకు కేవలం ఒక ఫిఫ్టీ మాత్రమే సాధించాడు.
LSG కోసం అత్యంత వేగవంతమైన సెంచరీ
ఇప్పటివరకు LSG తరపున అత్యంత వేగవంతమైన సెంచరీ సాధించిన రికార్డు కేఎల్ రాహుల్ పేరిట ఉంది. అతడు 2023లో ముంబై ఇండియన్స్‌పై 56 బంతుల్లో సెంచరీ పూర్తి చేశాడు. ఇప్పుడు పంత్ 54 బంతుల్లో సెంచరీ సాధించి ఈ రికార్డును తన పేరిట చేసుకున్నాడు. పంత్ కెప్టెన్సీలోని లక్నో సూపర్ జెయింట్స్ ఇప్పటికే ప్లేఆఫ్ రేసు నుండి బయటపడింది. LSG పంత్‌ను వేలంలో 27 కోట్ల రూపాయలకు కొనుగోలు చేసింది.
- పంత్ – 54 బంతులు
- కేఎల్ రాహుల్ – 56 బంతులు
- మార్కస్ స్టోయినిస్ – 56 బంతులు
- మిచెల్ మార్ష్ – 56 బంతులు
- క్వింటన్ డి కాక్ – 59 బంతులు