KKR Cruise Past MI: సత్తా చాటిన కేకేఆర్…ఒత్తిడిలోనూ అదగొట్టిన టీం..!!
IPL 2022లో ఇవాళ జరిగిన మ్యాచ్ లో కోల్ కత్తా నైట్ రైడర్స్ అదరగొట్టింది. ప్లే ఆఫ్స్ రేసులో ఉండాలంటే ఈ మ్యాచ్ తప్పక గెలవాల్సిందే.
- By Hashtag U Published Date - 11:41 PM, Mon - 9 May 22

IPL 2022లో ఇవాళ జరిగిన మ్యాచ్ లో కోల్ కత్తా నైట్ రైడర్స్ అదరగొట్టింది. ప్లే ఆఫ్స్ రేసులో ఉండాలంటే ఈ మ్యాచ్ తప్పక గెలవాల్సిందే. దీంతో చెలరేగి తమ సత్తా చాటారు KKR టీం. డీవై పాటిల్ వేదికగా సోమవారం జరిగిన మ్యాచ్ లో ముంబై ఇండియన్స్ పై 52 పరుగులు తేడాతో శ్రేయస్ అయ్యర్ కేప్టెన్సీలో KKR విజయం సాధించింది. 166 పరుగులు విజయ లక్ష్యంతో బ్యాటింగ్ కు దిగిన ముంబై జట్టు 17.3 ఓవర్లలో 113 పరుగులకు ఆలౌట్ అయ్యింది.
చాన్నాళ్ల తర్వాత తుది జట్టులోకి వచ్చి ప్యాట్ కమన్స్ 3 వికెట్లు తీశారు. ఆండ్రీ రస్సెల్ 2 వికెట్లతో చక్కగా సహకరించాడు. ముంబై జట్టు తరపును ఇషాన్ కిషన్ 43 బంతుల్లో 51 పరుగులు చేశాడు. ఇందులో 5 ఫోర్లు, 1 సిక్స్ ఉంది. ఇషాన్ కిషన్ మినహా మిగిలివారంతా విఫలమయ్యారు. ఈ విజయంతో KKR లీగ్ లో ఐదో విజయాన్ని అందుకుంది. 12 మ్యాచుల్లో 10 పాయింట్లు సాధించిన KKR లీట్ టేబుల్లో 7 వ స్థానికి చేరుకుంది.
That's that from Match 56.@KKRiders take this home comfortably with a 52-run win over #MumbaiIndians
Scorecard – https://t.co/eXsU8yDmge #MIvKKR #TATAIPL pic.twitter.com/3gu0ZsHYH6
— IndianPremierLeague (@IPL) May 9, 2022