Virat Kohli: వరల్డ్ క్రికెట్ లో కోహ్లీ కింగ్ కోహ్లీ మరో రికార్డ్.!
ప్రపంచ క్రికెట్ లో రికార్డులకు కేరాఫ్ అడ్రస్ గా మారిపోయిన విరాట్ కోహ్లీ చరిత్ర సృష్టించాడు.
- Author : Gopichand
Date : 02-11-2022 - 2:25 IST
Published By : Hashtagu Telugu Desk
ప్రపంచ క్రికెట్ లో రికార్డులకు కేరాఫ్ అడ్రస్ గా మారిపోయిన విరాట్ కోహ్లీ చరిత్ర సృష్టించాడు. టీ ట్వంటీ ప్రపంచకప్ చరిత్రలో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్ గా రికార్డులకెక్కాడు. బంగ్లాదేశ్ తో జరిగిన మ్యాచ్ లో 16 పరుగులు చేయడం ద్వారా కోహ్లీ ఈ ఘనత సాధించాడు. తద్వారా లంక మాజీ ప్లేయర్ జయవర్థనే పేరిట ఉన్న రికార్డును కోహ్లీ బ్రేక్ చేశాడు.
జయవర్దెనే.. టీ20 ప్రపంచకప్ లో 31 మ్యాచ్ లలో 31 ఇన్నింగ్స్) 1,016 పరుగులు చేశాడు. కోహ్లీ 23 ఇన్నింగ్స్ లలో జయవర్థనే రికార్డును అధిగమించాడు. ఈ ప్రతిష్టాత్మక టోర్నీలలో కోహ్లీ సగటు 89.90 గా ఉండగా, జయవర్దెనే సగటు 39.07గానే ఉంది. 31 ఇన్నింగ్స్ లలో కోహ్లీ.. 12 హాఫ్ సెంచరీలు చేశాడు. జయవర్దెనే 6 హాఫ్ సెంచరీలు ఒక సెంచరీ చేశాడు. కోహ్లీ సెంచరీ చేయకున్నా అత్యధిక స్కోరు 87 గా ఉంది. ఈ జాబితాలో టాప్-5లో భారత సారథి రోహిత్ శర్మ కూడా ఉన్నాడు. కోహ్లీ తర్వాత విండీస్ వీరుడు క్రిస్ గేల్.. 33 మ్యాచ్ లలో 31 ఇన్నింగ్స్ లో బ్యాటింగ్ చేసి 965 పరుగులు చేశాడు. గేల్.. 2 సెంచరీలు, 7 హాఫ్ సెంచరీలు బాదాడు.