IPL 2022 : ఐపీఎల్ లో మోస్ట్ సక్సెస్ ఫుల్ కెప్టెన్లు వీళ్ళే
క్రికెట్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2022 సీజన్‌కు ఇంకా కొన్ని రోజుల సమయం మాత్రమే ఉంది.
- By Naresh Kumar Published Date - 04:19 PM, Sat - 19 March 22
క్రికెట్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2022 సీజన్‌కు ఇంకా కొన్ని రోజుల సమయం మాత్రమే ఉంది. ఈసారి పూర్తి సీజన్‌ను భారత్‌లో నిర్వహిస్తున్నారు. కరోనా కారణంగా మ్యాచ్ లు అన్నీ మహారాష్ట్రలో జరగనున్నాయి. ఇప్పటికే అనేక జట్లు ప్రాక్టీస్ కూడా మొదలు పెట్టేశాయి. ఈ క్రమంలోనే తమ ఫేవరెట్ ఆటగాళ్ల ప్రదర్శన చూసేందుకు అభిమానులు ఆసక్తిగా ఉన్నారు. ఈ నేపథ్యంలో ఐపీఎల్ టోర్నీ చరిత్రలో టాప్-5 మోస్ట్ సక్సెస్ఫుల్ కెప్టెన్స్ ఎవరో ఇప్పుడు చూద్దాం.
రోహిత్ శర్మ :
ఐపీఎల్ లో అత్యంత విజయవంతమైన సారథిగా పేరుతెచ్చుకున్న ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ ఆ జట్టుకి 2013, 2015, 2017, 2019, 2020 సీజన్లలో టైటిల్ ను అందించాడు.. ఇప్పటివరకు 116 ఐపీఎల్ మ్యాచులకు కెప్టెన్ గా వ్యవహారించిన రోహిత్ శర్మ తన సారథ్యంలో మొత్తం 70 మ్యాచుల్ని గెలిపించాడు.. ఐపీఎల్ లో హిట్ మ్యాన్ గెలుపు శాతం 60.34గా నమోదైంది..
స్టీవ్ స్మిత్ :
ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్, రాజస్థాన్ రాయల్స్ మాజీ సారథి స్టీవ్ స్మిత్ ఐపీఎల్ లో పుణె వారియర్స్ , రాజస్థాన్ రాయల్స్ జట్లకు కొన్ని సీజన్లకు కెప్టెన్ గా వ్యవహరించాడు. ఐపీఎల్ లో మొత్తం 42 మ్యాచులకు సారథ్యం వహించిన స్టీవ్ స్మిత్ 25 మ్యాచుల్ని గెలిపించాడు.. ఐపీఎల్ లో స్టీవ్ స్మిత్ గెలుపు శాతం 59.52గా నమోదైంది..
సచిన్ టెండూల్కర్ :
ముంబై ఇండియన్స్ మాజీ కెప్టెన్, క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్ ఐపీఎల్లో తన కెప్టెన్సీతో రాణించాడు.. ఐపీఎల్లో మొత్తంగా 51 మ్యాచ్‌లకు కెప్టెన్ గా వ్యవహరించిన సచిన్ టెండూల్కర్ 30 మ్యాచుల్ని గెలిపించాడు ఐపీఎల్ లో సచిన్ గెలుపు శాతం 58.82గా నమోదైంది..
ధోని :
ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో అత్యంత విజయవంతమైన జట్టుగా చెన్నై సూపర్ కింగ్స్‌కు పేరుంది. టీమిండియా మాజీ సారథి, కెప్టెన్ కూల్ ఎంఎస్ ధోని సారథ్యంలో ఈ జట్టు అద్భుత విజయాలు సాధించింది. 2010, 2011, 2018, 2021 సీజన్లలో చాంపియన్‌గా నిలిచింది.
ఈ మెగా టోర్నీలో మొత్తంగా 188 మ్యాచులకు కెప్టెన్ గా వ్యవహరించిన ధోనీ.. 110 మ్యాచుల్ని గెలిపించాడు. ఐపీఎల్ లో ధోని గెలుపు శాతం 58.8గా నమోదైంది..
కామెరూన్ వైట్ :
ఆస్ట్రేలియా మాజీ ఆటగాడు కామెరూన్ వైట్ ఐపీఎల్లో ఆర్సీబీ, దక్కన్ ఛార్జర్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్లకు సారథిగా వ్యవహరించాడు. ఐపీఎల్ లో మొత్తంగా 12 మ్యాచ్‌లకు కెప్టెన్ గా వ్యవహరించిన కామెరూన్ వైట్.. 7 మ్యాచుల్ని గెలిపించాడు. ఐపీఎల్ లో వైట్ గెలుపు శాతం 58.33గా నమోదైంది.
Related News
Sachin Tendulkar: నేడు సచిన్ టెండూల్కర్ బర్త్ డే.. మాస్టర్ బ్లాస్టర్ గురించి ఈ విషయాలు తెలుసా..?
ప్రపంచ క్రికెట్ చరిత్రలో అత్యుత్తమ బ్యాట్స్మెన్లలో ఒకరైన భారత జట్టు మాజీ క్రికెటర్ మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ ఈరోజు తన 51వ పుట్టినరోజు జరుపుకుంటున్నారు.