HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Sports
  • >Kkr Strengths And Weakness

KKR: కేకేఆర్ నాలుగోసారి టైటిల్ గెల‌వ‌గ‌ల‌దా? జ‌ట్టు బ‌లం ఇదే!

ఐపీఎల్ 2024లో అద్భుత ప్రదర్శన చేసిన వెంకటేష్ అయ్యర్ కోసం కోల్‌కతా రూ.23.75 కోట్లు వెచ్చించింది. కానీ అతనికి కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించలేదు.

  • Author : Gopichand Date : 13-03-2025 - 7:08 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
KKR
KKR

KKR: ఐపీఎల్ 2025 ప్రారంభానికి ఇంకా 10 రోజుల కంటే తక్కువ సమయం ఉంది. అన్ని టీమ్‌లు పూర్తి అంకితభావంతో తమ సన్నాహాలు ప్రారంభించాయి. డిఫెండింగ్ ఛాంపియన్ కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR) కూడా తీవ్రంగా శ్రమిస్తోంది. గతసారి జట్టుకు ట్రోఫీని అందించిన కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్, మిచెల్ స్టార్క్, ఫిల్ సాల్ట్ ఈ సీజన్‌లో కేకేఆర్‌లో భాగం కావడం లేదు. అయినప్పటికీ జట్టు బలంగా కనిపిస్తుంది.

ఐపీఎల్ 2024లో అద్భుత ప్రదర్శన చేసిన వెంకటేష్ అయ్యర్ కోసం కోల్‌కతా రూ.23.75 కోట్లు వెచ్చించింది. కానీ అతనికి కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించలేదు. బదులుగా ఈ పనిని అజిక్య రహానేకు అప్పగించారు. ర‌హానేకు కెప్టెన్సీ అనుభవం ఎక్కువ.

Also Read: Nara Lokesh : గుంజీలు తీసిన హెడ్‌మాస్టర్ ను ప్రశంసించిన లోకేష్..ఎందుకంటే..!

KKR బలం ఇదే

కోల్‌కతా నైట్ రైడర్స్ బలమైన జట్టు కావ‌డానికి ముఖ్య కార‌ణం ఆ జ‌ట్టు బ్యాటింగ్, స్పిన్ విభాగం. ఇందులో కేకేఆర్‌కు చాలా అనుభవం ఉంది. క్వింటన్ డి కాక్, రహ్మానుల్లా గుర్బాజ్, ఆండ్రీ రస్సెల్, రింకూ సింగ్, వెంకటేష్ అయ్యర్ వంటి దూకుడుగా ఆడే బ్యాట్స్‌మెన్లు జట్టులో ఉన్నారు. వీళ్ల‌లో ఏ ఒక్క‌రూ రాణించిన ఆ జ‌ట్టుకు విజ‌యం సులువుగా మారిపోతుంది.

స్పిన్ బౌలింగ్‌లో సునీల్ న‌రైన్‌, వరుణ్ చక్రవర్తి, మయాంక్ మార్కండే ఉన్నారు. ఇందులో వరుణ్, సునీల్‌లు బ్యాట్స్‌మెన్‌ను ఇబ్బందిపెట్ట‌గ‌ల స్పిన్న‌ర్లు. గత సీజన్‌లో చక్రవర్తి 21 వికెట్లు, న‌రైన్ 17 వికెట్లు తీశారు. దీంతో కేకేఆర్ మూడోసారి ఐపీఎల్ ట్రోఫీని గెలుచుకోగలిగింది.

ఫాస్ట్ బౌలింగ్ బ‌ల‌హీనం

IPL 2025లో కోల్‌కతా నైట్ రైడర్స్ అతిపెద్ద బలహీనత ఏమిటంటే వారి ఫాస్ట్ బౌలర్‌లకు పెద్దగా అనుభవం లేదు. స్పెన్సర్ జాన్సన్, ఉమ్రాన్ మాలిక్, వైభవ్ అరోరా, హర్షిత్ రాణా లాంటి యువ బౌలర్లు ఉన్నారు. ఎన్రిక్ నార్ట్జేకి కూడా అదే అనుభవం ఉంది. అయితే గత రెండు ఐపీఎల్ సీజన్‌లలో అతని ప్రదర్శన ప్రత్యేకంగా ఏమీ లేదు. ఇది KKRకు బలహీనంగా మార‌వ‌చ్చు.

 

 


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • IPL 2025
  • IPL News
  • KKR
  • KKR Strengths
  • KKR Weakness
  • Rahane
  • Venkatesh Iyer

Related News

Rishabh Pant

ఐపీఎల్ 2026.. ఫిట్‌గా స్టార్ ప్లేయ‌ర్!

రిషభ్ పంత్ కెరీర్ తరచుగా గాయాల బారిన పడుతూనే ఉంది. అద్భుతమైన బ్యాటింగ్ ప్రతిభ ఉన్నప్పటికీ గత కొన్నేళ్లుగా అతను పలుమార్లు గాయపడ్డాడు.

  • Gautam Gambhir

    టీమ్ ఇండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్‌కు ఐపీఎల్ నుంచి బంపర్ ఆఫర్!

Latest News

  • Prabhas -Prashanth Varma Project : ప్రభాస్-ప్రశాంత్ వర్మ సినిమాపై క్లారిటీ

  • LIC : ‘ఎంఎఫ్ టెక్నాలజీ ఫండ్’ ను ఆవిష్కరించిన ఎల్ఐసి

  • Yellamma : ‘ఎల్లమ్మ’ మ్యూజిక్ అదిరిపోతుంది – DSP

  • పశు వికాస్ దినోత్సవం : గ్రామీణ కుటుంబాల జీవితాల్లో వెలుగులు నింపిన SMFG ఇండియా క్రెడిట్

  • రంజాన్ మాసంలో 5 కిలోల బరువు తగ్గడం ఎలా?

Trending News

    • టీ20 వరల్డ్ కప్ 2028కు 12 జట్లు క్వాలిఫై.. లిస్ట్ ఇదే!

    • టీ20 క్రికెట్‌లో అత్యంత విజయవంతమైన కెప్టెన్‌గా సూర్యకుమార్ యాదవ్!

    • 122 ఏళ్ల తర్వాత తెరుచుకోనున్న ఒడిశాలోని కోణార్క్ సూర్య దేవాలయం లో గర్భగుడి

    • విజయ్-రష్మిక వివాహం.. రాజకీయ, సినీ ప్రముఖుల రాక!

    • టీ20 వరల్డ్ కప్ 2026.. అహ్మదాబాద్‌లో భారత్ vs దక్షిణాఫ్రికా!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd