KKR Captain Suryakumar: కేకేఆర్ కెప్టెన్‌గా సూర్యకుమార్ యాదవ్..!
సూర్యకుమార్ యాదవ్‌కు కోల్‌కతా నైట్‌రైడర్స్ కెప్టెన్సీ ఆఫర్ ఇచ్చినట్టు తెలిసింది. అనధికారికంగా అతడిని సంప్రదించినట్టు జాతీయ మీడియా పేర్కొంది.
- By Gopichand Published Date - 11:36 PM, Sat - 24 August 24

KKR Captain Suryakumar: ఐపీఎల్ 2024 ఛాంపియన్ జట్టు కోల్‌కతా నైట్ రైడర్స్ అంటే KKR రాబోయే సీజన్‌కు ముందు ఓ పెద్ద నిర్ణయం తీసుకోనుంది. డిఫెండింగ్ ఛాంపియన్ కోల్‌కతా జట్టు తన కెప్టెన్‌పై రాబోయే కొద్ది రోజుల్లో పెద్ద ప్రకటన చేయవచ్చని వార్తలు వస్తున్నాయి. రాబోయే IPL 2025 సీజన్‌లో ఫ్రాంచైజీ కెప్టెన్సీని తీసుకోవడానికి KKR భారత T20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ (KKR Captain Suryakumar)ను సంప్రదించింది. ప్రస్తుతం సూర్య KKR నుండి ఈ అనధికారిక కెప్టెన్సీ ఆఫర్‌ను అందుకున్నాడు. అయితే త్వరలో దీనికి సంబంధించిన వార్తలు బయటకు రావచ్చు.
సూర్యకుమార్ యాదవ్‌కు కోల్‌కతా నైట్‌రైడర్స్ కెప్టెన్సీ ఆఫర్ ఇచ్చినట్టు తెలిసింది. అనధికారికంగా అతడిని సంప్రదించినట్టు జాతీయ మీడియా పేర్కొంది. ‘2025 సీజన్ నుంచే నాయకత్వం వహించాలని ఫ్రాంచైజీ కోరింది. శ్రేయస్ అయ్యర్‌ను ముంబైతో ట్రేడ్ చేసుకోనుంది. ప్రస్తుతం టీమ్ఇండియా టీ20 పగ్గాలు సూర్య వద్దే ఉండటంతో కేకేఆర్ ఈ నిర్ణయం తీసుకుంది’ అని తెలిపింది. ఇదే జరిగితే ముంబయి ఇండియన్స్‌కు ఇది పెద్ద దెబ్బే అవుతోంది.
Also Read: Anurag College : కక్షపూరితంగా తనపై కేసు నమోదు చేసారు – పల్లా రాజేశ్వర్ రెడ్డి
33 ఏళ్ల సూర్య గత కొన్నేళ్లుగా టీ20 క్రికెట్‌లో అత్యుత్తమ బ్యాట్స్‌మెన్‌గా నిలిచాడు. IPLలో ముంబై ఇండియన్స్ తరపున అనేక వరుస సీజన్లలో అద్భుతమైన ఆటతీరును ప్రదర్శించిన తర్వాత అతను టీమ్ ఇండియా టీ20 జట్టులో చోటు సంపాదించాడు. అద్భుతమైన ఆటతీరుతో జట్టుకు కెప్టెన్ అయ్యాడు. క్రికెట్‌లో అత్యంత పొట్టి ఫార్మాట్‌లో ప్రమాదకరమైన బ్యాట్స్‌మెన్‌గా సూర్య నిలిచాడు. ఇలాంటి పరిస్థితుల్లో అతడిని కెప్టెన్‌గా చేసేందుకు పలు ఐపీఎల్ జట్ల మధ్య పోటీ నెలకొంది.
We’re now on WhatsApp. Click to Join.
సూర్యకుమార్ యాదవ్ ఇంతకు ముందు ఐపీఎల్‌లో కోల్‌కతాలో భాగమయ్యాడు. సూర్య 2014- 2017 మధ్య KKR జట్టులో ఉన్నాడు. ఈ కాలంలో అతను 54 మ్యాచ్‌లలో 22.52 సగటు, 131.89 స్ట్రైక్ రేట్‌తో 608 పరుగులు చేశాడు. IPL 2014లో KKR కోసం తన మొదటి సీజన్ ఆడిన సూర్య టైటిల్ గెలుచుకోవడంలో విజయం సాధించాడు. ఆ సీజన్‌లో బెంగళూరులో జరిగిన ఫైనల్‌లో కోల్‌కతా.. పంజాబ్ కింగ్స్ (అప్పటి కింగ్స్ ఎలెవన్ పంజాబ్)ని ఓడించి IPL టైటిల్‌ను గెలుచుకుంది.
IPL 2018లో ముంబై ఇండియన్స్‌లో చేరిన తర్వాత సూర్యకుమార్ బ్యాటింగ్ వేరే స్థాయికి చేరుకుంది. అతను ముంబైతో వరుసగా రెండు సీజన్లలో అంటే 2019, 2020లో ట్రోఫీని గెలుచుకున్న జట్టులో సభ్యుడిగా ఘనతను సాధించాడు. ఐపీఎల్‌లో అతని అద్భుతమైన ప్రదర్శన కారణంగా 2021 సంవత్సరంలో టీమ్ ఇండియాకు అరంగేట్రం చేయగలిగాడు. అప్పటి నుంచి వెనుదిరిగి చూసుకోలేదు. ఈ ఏడాది T20 ప్రపంచకప్ 2024 టైటిల్‌ను గెలుచుకున్న భారత జట్టులో సూర్య సభ్యుడు. ఫైనల్‌లో బౌండరీ లైన్‌లో అద్భుత క్యాచ్ పట్టి జట్టు టైటిల్ గెలవడంలో కీలక పాత్ర పోషించాడు.