Anurag College : కక్షపూరితంగా తనపై కేసు నమోదు చేసారు – పల్లా రాజేశ్వర్ రెడ్డి
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలోని వెంకటాపురంలో ఉన్న పల్లా రాజేశ్వర్ రెడ్డికి చెందిన అనురాగ్ యూనివర్సిటీ బఫర్ జోన్ లో నిర్మించారని పోచారం పీఎస్ లో ఇరిగేషన్ డిపార్ట్ మెంట్ ఎగ్జిక్యూటీవి ఇంజినీర్ పరమేశ్వర్ ఫిర్యాదు చేశారు
- By Sudheer Published Date - 10:33 PM, Sat - 24 August 24

తెలంగాణ లో కాంగ్రెస్ పార్టీ దూకుడు చూపిస్తుంది. ఓ పక్క రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో తీసుకెళ్తూనే..మరోపక్క భూ అక్రమాలకు పాల్పడిన వారిని వదిలిపెట్టడం లేదు. సమాజంలో ఎంత పెద్ద వారైనా సరే చట్టం ముందు సమానమే అన్నట్లు హైడ్రా కు ఫుల్ అధికారం ఇచ్చింది. దీంతో హైడ్రా అధికారులు తగ్గేదేలే అన్నట్లు వ్యవహరిస్తున్నారు. చెరువులు , ప్రభుత్వ స్థలాలు కబ్జా చేసి నిర్మాణాలు చేపట్టిన వారికీ నోటీసులు ఇస్తూ కూల్చివేస్తున్నారు. ఈరోజు మాదాపూర్ లో నాగార్జునకు చెందిన N convention సెంటర్ ను కూల్చేశారు. అదే విధంగా బిఆర్ఎస్ నేతలకు సైతం నోటీసులు జారీ చేస్తూ వస్తున్నారు.
We’re now on WhatsApp. Click to Join.
బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి (Palla Rajeshwar Reddy)కి షాక్ ఇచ్చారు. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలోని వెంకటాపురంలో ఉన్న పల్లా రాజేశ్వర్ రెడ్డికి చెందిన అనురాగ్ యూనివర్సిటీ (Anurag College) బఫర్ జోన్ లో నిర్మించారని పోచారం పీఎస్ లో ఇరిగేషన్ డిపార్ట్ మెంట్ ఎగ్జిక్యూటీవి ఇంజినీర్ పరమేశ్వర్ ఫిర్యాదు చేశారు. బఫర్ జోన్ లో యూనివర్సిటీ నిర్మించారని చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో కోరారు. దీంతో పల్లా రాజేశ్వర్ రెడ్డిపై కేసు నమోదు చేసారు.
దీనిపై పల్లా స్పందించారు. తన పట్ల, తన విద్యాసంస్థల పట్ల ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. తాము అన్ని అనుమతులతోనే నిర్మాణాలు జరిపామన్నారు. పాతికేళ్లలో ఎప్పుడూ అనుమతులు లేకుండా నిర్మించలేదన్నారు. తన విద్యా సంస్థలకు ఏఐసీటీఈ, జేఎన్టీయూ అనుమతులు ఉన్నాయన్నారు.
Read Also : HYDRA : మీరే అనుమతి ఇచ్చి..మీరే కూల్చేస్తే ఎలా..? – కిషన్ రెడ్డి