Virat Kohli Trolls Delhi Crowd: ఎవరూ తిని రాలేదా? ఫ్యాన్స్ లో జోష్ నింపిన కోహ్లీ
దాదాపు 13 ఏళ్ళ తర్వాత కోహ్లీ దేశవాళీ క్రికెట్ లోకి రీఎంట్రీ ఇచ్చాడు. జాతీయ జట్టు మ్యాచ్ లు లేనప్పుడు ప్రతీ ప్లేయర్ దేశవాళీ క్రికెట్ ఆడాలని బీసీసీఐ చెప్పడంతో పలువురు స్టార్ క్రికెటర్లతో పాటు విరాట్ కూడా బరిలోకి దిగాడు.
- Author : Naresh Kumar
Date : 31-01-2025 - 8:08 IST
Published By : Hashtagu Telugu Desk
Virat Kohli Trolls Delhi Crowd: అభిమానులను హుషారుపరచడంలో భారత స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ (Virat Kohli Trolls Delhi Crowd) ప్రత్యేకతే వేరు.. కేవలం తన బ్యాటింగ్ తోనే కాదు తన మాటలతోనూ కోహ్లీ వారిలో జోష్ నింపుతుంటాడు. తాజాగా రంజీ మ్యాచ్ ఆడుతున్న కోహ్లీని చూసేందుకు 15వేల మందికి పైగా ఫ్యాన్స్ అరుణ్ జైట్లీ స్టేడియానికి పోటెత్తారు. కోహ్లీ నామస్మరణతో స్టేడియం హోరెత్తిపోయింది. తనపై చూపించిన అభిమానానికి విరాట్ సైతం ముగ్ధుడైపోయాడు. వారికి కృతజ్ఞతలు చెబుతూ జోష్ నింపాడు. ఓవర్ల మధ్యలో ప్రతీ స్టాండ్ వైపు చూస్తూ వారిని ఎంటర్ టైన్ చేస్తూనే ఉన్నాడు. కొన్ని స్టాండ్స్ లో ఫ్యాన్స్ అరవకపోతే వారిని టీజ్ చేశాడు. ఏం తిని రాలేదా అంటూ వారిని సరదాగా రెచ్చగొట్టాడు. దీంతో స్టాండ్స్ లో ప్రేక్షకులు పోటాపోటీగా ఢిల్లీ టీమ్ కు, కోహ్లీకి ఛీర్స్ చెబుతూనే ఉన్నారు. ఒకమాటలో చెప్పాలంటే స్టాండ్స్ మధ్య అరుపుల పోటీ ఉండేలా కోహ్లీ వారిని ఎంకరేజ్ చేశాడు.
దాదాపు 13 ఏళ్ళ తర్వాత కోహ్లీ దేశవాళీ క్రికెట్ లోకి రీఎంట్రీ ఇచ్చాడు. జాతీయ జట్టు మ్యాచ్ లు లేనప్పుడు ప్రతీ ప్లేయర్ దేశవాళీ క్రికెట్ ఆడాలని బీసీసీఐ చెప్పడంతో పలువురు స్టార్ క్రికెటర్లతో పాటు విరాట్ కూడా బరిలోకి దిగాడు. ఢిల్లీ తరపున రంజీ మ్యాచ్ ఆడేందుకు నిర్ణయించుకోవడంతో ఫ్యాన్స్ అతని ఆటను చూసేందుకు స్టేడియానికి పోటెత్తారు. తెల్లవారుఝామున 3 గంటల నుంచే అరుణ్ జైట్లీ స్టేడియం దగ్గర బారులు తీరారు. ఒకదశలో తొక్కిసలాట కూడా చోటు చేసుకుంది. ఫ్యాన్స్ కు ఫ్రీ ఎంట్రీ ఇవ్వడం, కోహ్లీ ఆడుతుండడంతో స్టేడియం హౌస్ ఫుల్ అయిపోయింది. మ్యాచ్ జరుగుతున్నంత సేపూ కోహ్లీ, ఆర్సీబీ అంటూ స్లోగన్స్ వినబడుతూనే ఉన్నాయి. తొలిరోజు రైల్వేస్ బ్యాటింగ్ కావడంతో కోహ్లీ ఫీల్డింగ్ కే పరిమితమయ్యాడు. ఢిల్లీ బౌలర్ల ధాటికి రైల్వేస్ 241 పరుగులకు ఆలౌటవగా.. తొలిరోజు ఆట ముగిసే సమయానికి ఢిల్లీ వికెట్ కోల్పోయి 41 పరుగులు చేసింది.
Also Read: Phone Tapping Case : బీఆర్ఎస్ హయాంలో 18 మంది హైకోర్టు జడ్జీలపై నిఘా
కోహ్లీ వన్ డౌన్ వస్తాడని చాలా మంది అనుకున్నారు. కానీ టెస్టుల్లో విరాట్ నాలుగో స్థానంలో ఆడుతుండడంతో మరో వికెట్ పడితే తప్ప అతను బ్యాటింగ్ కు రాలేడు. దీంతో శుక్రవారం కూడా ఫ్యాన్స్ మరింత ఎక్కువ మంది మ్యాచ్ ను చూసేందుకు వచ్చే అవకాాశాలున్నాయి. అటు తొలిరోజు ఆటలో సెక్యూరిటీ ఇవ్వలేక పోలీసులు చేతులెత్తయడంతో పారా మిలిటరీ బలగాలు రంగంలోకి దిగాల్సి వచ్చింది. ఇక రెండోరోజు మరింత పకడ్బందీగా భద్రత కల్పించాలని ఢిల్లీ క్రికెట్ అసోసియేషన్ భావిస్తోంది. కోహ్లీ పుణ్యామాని రంజీ మ్యాచ్ కు భారీ సంఖ్యలో అభిమానులు హాజరవడం అటు రెండు జట్ల క్రికెటర్లలోనూ ఉత్సాహాన్ని నింపింది.