HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy

  • Telugu News
  • >Sports
  • >Key Adjustment That Rohit Sharma Should Make In 2nd Test Against England

IND vs ENG 2nd Test: రెండో టెస్టులో రోహితే కీలకం

సొంత గడ్డపై హైదరాబాద్ వేదికగా తొలి టెస్ట్ ముగిసింది. తొలి ఇన్నింగ్‌లో 436 పరుగులు చేసి, భారీ ఆధిక్యతను సాధించినా రెండో ఇన్నింగ్‌లో బ్యాటర్ల తడబాటుకు గురయ్యారు.

  • By Praveen Aluthuru Published Date - 03:11 PM, Wed - 31 January 24
  • daily-hunt
IND vs ENG 2nd Test
IND vs ENG 2nd Test

IND vs ENG 2nd Test: సొంత గడ్డపై హైదరాబాద్ వేదికగా తొలి టెస్ట్ ముగిసింది. తొలి ఇన్నింగ్‌లో 436 పరుగులు చేసి, భారీ ఆధిక్యతను సాధించినా రెండో ఇన్నింగ్‌లో బ్యాటర్ల తడబాటుకు గురయ్యారు. కేవలం 230 పరుగులను ఛేదించేందుకు టీమిండియా బ్యాటర్లు విఫలమయ్యారు. ఫలితంగా 202 వద్దే ఆలౌట్ అయింది. పైగా ఓలీ పోప్ అద్భుత ఇన్నింగ్స్ భారత్ ను భారీ దెబ్బ కొట్టింది. దీంతో భారత్ పై ఇంగ్లండ్ 28 పరుగుల తేడాతో గెలిచి సిరీస్‌లో 1-0 ఆధిక్యంలో నిలిచింది.

రెండో టెస్ట్ ఫిబ్రవరి 2న విశాఖపట్నంలో జరగనుంది. విశాఖపట్నం వేదికగా జరిగే రెండో టెస్టులో రోహిత్ సేన కచ్చితంగా గెలుస్తుందన్న ధీమా వ్యక్తమవుతోంది. ఎందుకంటే వైజాగ్‌లో టీమిండియా ఇప్పటి వరకు టెస్టు మ్యాచ్‌ ఓడిపోలేదు. విశాఖపట్నంలో టీమిండియా ఇప్పటి వరకు రెండు మ్యాచ్‌లు ఆడింది. 2016లో ఇంగ్లండ్‌ తో జరిగిన తొలి టెస్ట్ మ్యాచ్ లో 246 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో కింగ్ కోహ్లీ , పుజారా చెలెరిగిపోయారు. ఈ స్టార్ బ్యాటర్స్ సెంచరీలతో చెలరేగడంతో భారత్ విజయం నల్లేరు మీద నడకలా సాగింది. అయితే ఇప్పుడు వైజాగ్ లో రెండో టెస్టుకు ఈ ఇద్దరు ఆడకపోవడం రోహిత్‌ సేనకు ఎదురుదెబ్బ లాంటిదే. ఇక 2019లో దక్షిణాఫ్రికాతో భారత్ ఇక్కడ రెండో మ్యాచ్ ఆడింది. ఈ సారి టీమిండియా 203 భారీ పరుగుల తేడాతో విజయం సాధించింది. సో వైజాగ్ లో విన్నింగ్ ఫ్రీక్ ని కొనసాగించాలని రోహిత్‌ సేన వ్యూహాలు రచిస్తోంది. అందులో భాగంగా ఇప్పటికే రోహిత్ సేన వైజాగ్ లో అడుగుపెట్టింది.

ఉప్పల్ వేదికగా జరిగిన తొలి టెస్టులో టీమిండియా ఇద్దరు పేసర్లు, ముగ్గురు స్పిన్నర్ల కాంబినేషన్‌తో బరిలోకి దిగింది. బుమ్రా బాగానే బౌలింగ్ చేసినప్పటికీ, మరో పేసర్ సిరాజ్ మాత్రం తేలిపోయాడు. ఏ మాత్రం ప్రభావం చూపలేకపోయిన సిరాజ్ 11 ఓవర్లు బౌలింగ్ చేసి ఒక వికెట్ కూడా తీయలేకపోయాడు. ఇక విశాఖ టెస్టును గెలిపించాల్సిన భారం బ్యాటింగ్ లో కెప్టెన్ రోహిత్, బౌలింగ్ లో అశ్విన్, బుమ్రా పైనే ఉంది. రోహిత్ భారీ ఇన్నింగ్స్ ఆడితే మిగతా బ్యాట్స్ మెన్లలో విశ్వాసం పెరుగుతుంది. యువ శుభ్ మన్ గిల్ ఫామ్ గొప్పగా లేదు. రజత్ పటీదార్ లేదా సర్ఫరాజ్ ఇద్దరూ కొత్తవారే. ఇక భారీ ఆశలు పెట్టుకున్న శ్రేయస్ అయ్యర్ ఇటీవల నిరాశపరుస్తున్నాడు. గత కొన్ని ఇన్నింగ్స్ లలో అయ్యర్ హాఫ్ సెంచరీ కూడా చేయలేదు. దీంతో రోహిత్ చెలరేగాల్సిన అవసరం ఉంది.

Also Read: AP Special Status : ప్రత్యేక హోదా కోసం పోరాటం చేయాలనీ ప్రజలకు పిలుపునిచ్చిన జేడీ


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • 2nd test
  • england
  • IND vs ENG
  • india
  • rohit sharma

Related News

Trump Is Dead

Trump Tariffs : టారిప్స్ పై ఆందోళన అవసరం లేదు – పీయూష్

Trump Tariffs : భవిష్యత్తులో ఇరు దేశాల మధ్య సత్సంబంధాలు కొనసాగుతాయని, వాణిజ్య ఒప్పందం కుదురుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఇది ఇరు దేశాల ఆర్థిక వ్యవస్థలకు మేలు చేస్తుందని ఆయన నొక్కి చెప్పారు

  • Cricketers Retired

    Cricketers Retired: 2025లో ఇప్ప‌టివ‌రకు 19 మంది స్టార్ క్రికెట‌ర్లు రిటైర్మెంట్‌!

  • Fitness Test

    Fitness Test: కేఎల్ రాహుల్ సహా కొంతమంది ఆటగాళ్ల ఫిట్‌నెస్‌పై సస్పెన్స్?!

  • Once again, India's humanitarian approach...an early warning to Pakistan

    Sutlej River : మరోసారి భారత్‌ మానవతా దృక్పథం..పాకిస్థాన్‌కు ముందస్తు హెచ్చరిక

  • Peter Navarro

    Peter Navarro: ట్రంప్ సలహాదారు భార‌త్‌పై కీల‌క వ్యాఖ్య‌లు.. ఎవరీ పీట‌ర్ కెంట్‌?

Latest News

  • Alert : 13న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు!

  • GST 2.0 : GST 2.0తో ప్రభుత్వానికి ఎంత నష్టమంటే?

  • Kavitha Vs Harish : నాపై చేసిన ఆరోపణలను వారి విజ్ఞతకే వదిలేస్తున్నా..కవిత కు ఇన్ డైరెక్ట్ కౌంటర్ ఇచ్చిన హరీశ్

  • Afghanistan Earthquake : ప్రాణాలు పోతుంటే విపరీత ఆచారం అవసరమా?

  • Gym Germs: వామ్మో.. జిమ్ పరికరాలపై ప్రమాదకరమైన బ్యాక్టీరియా!

Trending News

    • Yograj Singh: ధోనితో సహా చాలా మంది ఆటగాళ్లు వెన్నుపోటు పొడిచారు: యువ‌రాజ్ తండ్రి

    • Sara Tendulkar: సచిన్ కుమార్తె సారా టెండూల్కర్‌కు నిజంగానే ఎంగేజ్‌మెంట్ జ‌రిగిందా?

    • IPL Tickets: క్రికెట్ అభిమానులకు తీపి, చేదు వార్త.. ఐపీఎల్‌పై జీఎస్టీ పెంపు, టికెట్లపై తగ్గింపు!

    • New GST: జీఎస్టీలో కీల‌క మార్పులు.. రూ. 48,000 కోట్లు న‌ష్టం?!

    • GST Slashed: హెయిర్‌కట్, ఫేషియల్ చేయించుకునేవారికి గుడ్ న్యూస్‌.. ఎందుకంటే?

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd