Gill : గిల్ ఇలా అయితే కష్టమే… వైఫల్యాల బాట వీడని ఓపెనర్
ప్రస్తుతం టీమిండియా ఓపెనర్ శుభ్ మన్ గిల్ (Subhaman Gill) ఇదే పరిస్ఖితికి చేరువయ్యాడు. గిల్ టెస్టుల్లో పేలవమైన ఫామ్‌ను కొనసాగిస్తున్నాడు.
- Author : Naresh Kumar
Date : 26-01-2024 - 5:24 IST
Published By : Hashtagu Telugu Desk
భారత జట్టులో చోటు దక్కడం ఎంత కష్టమో దానిని నిలబెట్టుకోవడం అంతకంటే కష్టం. వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోకుంటే కష్టమే. పరుగులు చేయకుండా జట్టులో చోటే గల్లంతవుతుంది. ప్రస్తుతం టీమిండియా ఓపెనర్ శుభ్ మన్ గిల్ (Subhaman Gill) ఇదే పరిస్ఖితికి చేరువయ్యాడు. గిల్ (Subhaman Gill) టెస్టుల్లో పేలవమైన ఫామ్‌ను కొనసాగిస్తున్నాడు. ఉప్పల్ వేదికగా ఇంగ్లాండ్‌తో జరుగుతున్న తొలి టెస్టులో 23 పరుగులకే ఔటయ్యాడు. ఏకాగ్రత కోల్పోయి గిల్ (Subhaman Gill) ఆ షాట్ ఆడినట్లు కామెంటేటర్లు వ్యాఖ్యానించారు. అంతకుముందే గిల్‌కు లైఫ్ వచ్చినా దానిని యూజ్ చేసుకోలేకపోయాడు.
We’re now on WhatsApp. Click to Join.
ఈ నేపథ్యంలో గిల్‌పై నెటింట్లో ట్రోల్స్ మొదలయ్యాయి. వచ్చిన అవకాశాలను గిల్ సద్వినియోగం చేసుకోలేకపోయాడని, ఇప్పటికైనా ఇతర ఆటగాళ్లకు అవకాశాలు ఇవ్వాలని పోస్టులు పెడుతున్నారు. ఫామ్‌లో ఉన్న యువ బ్యాటర్లు రజత్ పటిదార్, సర్ఫరాజ్ ఖాన్‌లకు ఛాన్స్ ఇవ్వాలని అంటున్నారు. గత పది ఇన్నింగ్స్‌ల్లో 20 కంటే తక్కువతో గిల్ పరుగులు చేస్తున్నాడని, ఇక గిల్ ప్లేస్ పోయినట్లే అని కామెంట్లు చేస్తున్నారు.
వన్‌డౌన్‌లో అయిదు టెస్టులు ఆడిన గిల్ 23 సగటుతో 166 పరుగులే చేశాడు. అత్యధిక స్కోరు 47 మాత్రమే. గత 10 ఇన్నింగ్స్ లలో ఒక్క హాఫ్ సెంచరీ కూడా చేయలేదు.
ఇదిలా ఉంటే ఇటీవల కోచ్ ద్రావిడ్ కూడా గిల్ కు పరోక్షంగా వార్నింగ్ ఇచ్చాడు. ఫామ్ లోకి రాకుంటే చోటు నిలుపుకోవడం కష్టమేనన్నాడు.
ఎంతో మంది యువకులు ఛాలెంజిగ్ వికెట్లపై సత్తాచాటుతున్నారని చెప్పుకొచ్చాడు. టెస్టు జట్టులో తన స్థానాన్ని కాపాడుకోవాలంటే ఇంగ్లాండ్ సిరీస్‌లో గిల్ తప్పక సత్తాచాటాల్సి ఉంది.
Also Read: Jagga Reddy: కేటీఆర్ కు జగ్గారెడ్డి వార్నింగ్