Jagga Reddy: కేటీఆర్ కు జగ్గారెడ్డి వార్నింగ్
- Author : Balu J
Date : 26-01-2024 - 5:10 IST
Published By : Hashtagu Telugu Desk
Jagga Reddy: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ముఖ్యమంత్రి రేవంత్, కాంగ్రెస్ నేతలపై విరుచుకుపడిన విషయం తెలిసిందే. ‘‘రేవంత్ రెడ్డి అహంకారం, వేకిలి వ్యవహారం చూస్తుంటే వాళ్లు ఇంకా ప్రతిపక్షంలో ఉన్నామనుకుంటున్నారు. మీకు చేతనైతే ఇచ్చిన 420 అమలుపరచండి. ప్రజలకు ఇచ్చిన హామీలను అమలుపరచండి. రాజకీయాల్లో ఇలాంటి కుసంస్కారం ఉన్న వ్యక్తులు ఉన్నప్పుడు ఇలాంటి విమర్శలు తప్పవు. ప్రజల దృష్టిని మరలచే ప్రయత్నాలు ఎన్ని చేసిన ఇంచిన ప్రతి హామీని అమలు చేసేదాకా వెంటాడుతాం. కాంగ్రెస్ నాయకుల బట్టలు విప్పి ప్రజల ముందు నిలబెడతామని’’ అని కామెంట్స్ చేసిన విషయం తెలిసిందే.
కాంగ్రెస్ సీనియర్ లీడర్ జగ్గారెడ్డి కేటీఆర్ కు కౌంటర్ ఇచ్చారు.ఇచ్చిన హామీలను అమలు చేయకపోతే.. కాంగ్రెస్ నాయకుల బట్టలు విప్పి ప్రజల ముందు నిలబెడతామని కెటిఆర్ చేసిన వ్యాఖ్యలపై జగ్గారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ నాయకుల బట్టలు విప్పే దమ్ము కెటిఆర్ ఉందా.. మేం తొడగొడితే కెటిఆర్ గుండె ఆగుతది అంటూ జగ్గారెడ్డి ఫైర్ అయ్యారు. గడిచిన తొమ్మిదేళ్లలో కెసిఆర్ చేయలేని పనులను.. నెలరోజుల్లోనే కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేశారని చెప్పారు. 100 రోజుల్లో ఆరు గ్యారంటీలను అమలు చేస్తామని జగ్గారెడ్డి అన్నారు.