IPL 2026: కోల్‌కతా నైట్ రైడర్స్‌లోకి టిమ్ సౌథీ, షేన్ వాట్సన్!
కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టుకు అభిషేక్ నాయర్ కొత్త ప్రధాన కోచ్‌గా వ్యవహరించనున్నారు. ఆయన చంద్రకాంత్ పండిట్ స్థానంలో బాధ్యతలు స్వీకరించారు. ఆస్ట్రేలియా మాజీ ఆల్‌రౌండర్ షేన్ వాట్సన్‌ను సహాయ కోచ్‌గా నియమించినట్లు ఫ్రాంచైజీ గురువారం ప్రకటించింది.
- By Gopichand Published Date - 06:55 PM, Fri - 14 November 25
IPL 2026: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL 2026) 19వ సీజన్‌కు ముందు డిసెంబర్‌లో జరగబోయే మినీ వేలానికి సంబంధించి రేపు (శనివారం) రిటెన్షన్ జాబితాను విడుదల చేయనున్నారు. ఈ నేపథ్యంలో కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR) జట్టు కీలక నిర్ణయాలు తీసుకుంది. గురువారం షేన్ వాట్సన్ నియామకం తర్వాత, శుక్రవారం టిమ్ సౌథీని బౌలింగ్ కోచ్‌గా నియమిస్తున్నట్లు జట్టు ప్రకటించింది.
న్యూ కోచింగ్ సిబ్బంది
కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టుకు అభిషేక్ నాయర్ కొత్త ప్రధాన కోచ్‌గా వ్యవహరించనున్నారు. ఆయన చంద్రకాంత్ పండిట్ స్థానంలో బాధ్యతలు స్వీకరించారు. ఆస్ట్రేలియా మాజీ ఆల్‌రౌండర్ షేన్ వాట్సన్‌ను సహాయ కోచ్‌గా నియమించినట్లు ఫ్రాంచైజీ గురువారం ప్రకటించింది.
ఈ నియామకంపై వాట్సన్ మాట్లాడుతూ.. “కోల్‌కతా నైట్ రైడర్స్ వంటి ప్రతిష్టాత్మక ఫ్రాంచైజీలో భాగం కావడం నాకు చాలా గౌరవంగా ఉంది” అని తెలిపారు. ఇప్పుడు KKR కోసం గతంలో మూడు సంవత్సరాలు ఆడిన మరో విదేశీ కోచ్ టిమ్ సౌథీ జట్టులోకి ప్రవేశించారు.
ఈ కొత్త పాత్రపై సౌథీ మాట్లాడుతూ.. “KKR నాకు ఎప్పుడూ ఇల్లు లాంటిదే. ఈ కొత్త పాత్రలో తిరిగి రావడం నాకు దక్కిన గౌరవం. ఈ ఫ్రాంచైజీ సంస్కృతి అద్భుతంగా ఉంటుంది. అభిమానులు ఎంతో ఉద్వేగంతో ఉంటారు. ఆటగాళ్ల సమూహం చాలా గొప్పది. బౌలర్‌లతో కలిసి పని చేయడానికి IPL 2026లో జట్టు విజయం సాధించడానికి సహాయం చేయడానికి నేను ఆసక్తిగా ఉన్నాను” అని KKR విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు.
Also Read: Bangalore : ఛీ..వైద్యం కోసం వచ్చిన మహిళ ప్రైవేట్ పార్ట్స్ తాకిన డాక్టర్
KKR తరపున 14 మ్యాచ్‌లు ఆడిన టిమ్ సౌథీ
సౌథీ 2021 నుండి 2023 వరకు కోల్‌కతా నైట్ రైడర్స్ తరపున మొత్తం 14 మ్యాచ్‌లు ఆడి, 19 వికెట్లు పడగొట్టాడు. ముఖ్యంగా 2022 సీజన్ అతనికి అద్భుతంగా సాగింది. ఆ సీజన్‌లో అతను 9 మ్యాచ్‌ల్లో 14 వికెట్లు తీశాడు. 36 ఏళ్ల సౌథీ 2011 నుండి IPLలో ఆడుతున్నాడు. అతను గతంలో చెన్నై సూపర్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్, ముంబై ఇండియన్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరపున కూడా ఆడాడు. IPLలో అతను మొత్తం 54 మ్యాచ్‌ల్లో 47 వికెట్లు తీశాడు.
KKR ప్రస్తుతం ఉన్న ఆటగాళ్ల స్క్వాడ్
- రింకూ సింగ్ (రూ. 13 కోట్లు)
- ఆండ్రీ రస్సెల్ (రూ. 12 కోట్లు)
- సునీల్ నరైన్ (రూ. 12 కోట్లు)
- వరుణ్ చక్రవర్తి (రూ. 12 కోట్లు)
- హర్షిత్ రాణా (రూ. 4 కోట్లు)
- రమణ్‌దీప్ సింగ్ (రూ. 4 కోట్లు)
- అంగక్రిష్ రఘువంశీ (రూ. 3 కోట్లు)
- రోవ్‌మాన్ పావెల్ (రూ. 1.50 కోట్లు)
- మనీష్ పాండే (రూ. 75 లక్షలు)
- అజింక్య రహానే (రూ. 1.50 కోట్లు)
- క్వింటన్ డి కాక్ (రూ. 3.60 కోట్లు)
- రహమనుల్లా గుర్బాజ్ (రూ. 2 కోట్లు)
- వెంకటేష్ అయ్యర్ (రూ. 23.75 కోట్లు)
- అనుకుల్ రాయ్ (రూ. 40 కోట్లు)
- మొయిన్ అలీ (రూ. 2 కోట్లు)
- మయాంక్ మార్కండే (రూ. 30 లక్షలు)
- ఎన్రిక్ నోర్ట్జే (రూ. 6.50 కోట్లు)
- వైభవ్ అరోరా (రూ. 1.80 కోట్లు)
- స్పెన్సర్ జాన్సన్ (రూ. 2.80 కోట్లు)
- ఉమ్రాన్ మాలిక్ (రూ. 75 లక్షలు)