Virat Kohli: కోహ్లీని ఇబ్బందిని పెట్టిన నలుగురు బౌలర్లు వీళ్లే!
విరాట్ కోహ్లీ ఐపీఎల్ 2025లో అద్భుతంగా రాణిస్తున్నాడు. ఈ దిగ్గజ ఆటగాడు ఈ సీజన్‌లో ఆర్‌సీబీ కోసం ఒకదాని తర్వాత ఒకటి అద్భుతమైన ఇన్నింగ్స్‌లు ఆడాడు.
- By Gopichand Published Date - 06:57 PM, Sat - 3 May 25

Virat Kohli: విరాట్ కోహ్లీ (Virat Kohli) టీమిండియా స్టార్ బ్యాటర్. అతను కొన్ని సంవత్సరాలుగా మూడు ఫార్మాట్‌లలోనూ అద్భుతంగా రాణిస్తున్నాడు. అయితే గతేడాది జరిగిన టీ20 వరల్డ్ కప్ తర్వాత విరాట్ కోహ్లీ టీ20 ఫార్మాట్‌కు గుడ్ బై చెప్పిన విషయం తెలిసిందే. అయితే ప్రతి బ్యాట్స్‌మెన్ తన కెరీర్‌లో ఏదో ఒక బౌలర్‌ను ఎదుర్కోవడంలో కొంత ఇబ్బంది పడతాడు. విరాట్ కోహ్లీ కూడా దీనికి అతీతుడు కాదు. ఫార్మాట్‌ను (టెస్టు, వన్డే, టీ20) బట్టి.. నలుగురు బౌలర్లు తనను ఇబ్బంది పెట్టారని విరాట్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో తెలిపాడు. ఈ బౌలర్లను విరాట్ ఎల్లప్పుడూ జాగ్రత్తగా ఆడానని కూడా చెప్పాడు. ఐపీఎల్ 2025 సందర్భంగా కోహ్లీ స్వయంగా ఈ బౌలర్ల పేర్లను వెల్లడించాడు.
విరాట్ కోహ్లీ.. టెస్ట్ క్రికెట్‌లో ఇంగ్లండ్ మాజీ దిగ్గజ బౌలర్ జేమ్స్ ఆండర్సన్ తనను చాలా ఇబ్బంది పెట్టాడని ఒప్పుకున్నాడు. టెస్ట్ క్రికెట్‌లో ఆండర్సన్ విరాట్ కోహ్లీకి అత్యంత కష్టతరమైన బౌలర్‌గా నిలిచాడు. ఆ తర్వాత టీ20లో వెస్టిండీస్ మిస్టరీ స్పిన్నర్ సునీల్ నరైన్ తనను చాలా ఇబ్బంది పెట్టాడని విరాట్ తెలిపాడు. నరైన్‌ను ఎదుర్కోవడంలో విరాట్‌కు ఎల్లప్పుడూ సమస్యలు ఎదురువుతూనే ఉంటాయి. వన్డేల్లో శ్రీలంక దిగ్గజ బౌలర్ లసిత్ మలింగా, ఇంగ్లండ్ లెగ్ స్పిన్నర్ ఆదిల్ రషీద్‌లు కోహ్లీని బాగా ఇబ్బంది పెట్టారు. ఈ నలుగురు బౌలర్లను విరాట్ ఎల్లప్పుడూ జాగ్రత్తగా ఆడినట్లు తెలిపాడు.
Virat Kohli picks the toughest bowlers to face:
Test cricket – Jimmy Anderson.
ODIs – Malinga (Adil Rashid toughest spinner).
T20s – Sunil Narine.pic.twitter.com/xOC1h17xLD— Mufaddal Vohra (@mufaddal_vohra) May 3, 2025
ఐపీఎల్ 2025లో విరాట్ ప్రదర్శన ఎలా ఉంది?
విరాట్ కోహ్లీ ఐపీఎల్ 2025లో అద్భుతంగా రాణిస్తున్నాడు. ఈ దిగ్గజ ఆటగాడు ఈ సీజన్‌లో ఆర్‌సీబీ కోసం ఒకదాని తర్వాత ఒకటి అద్భుతమైన ఇన్నింగ్స్‌లు ఆడాడు. అతను 10 మ్యాచ్‌లలో 443 పరుగులు చేశాడు. కోహ్లీ 63.29 సగటుతో పరుగులు సాధించాడు. కోహ్లీ ఈ అద్భుతమైన బ్యాటింగ్‌తో ఆర్‌సీబీ ప్రదర్శన కూడా మెరుగ్గా ఉంది. ఈ జట్టు 10 మ్యాచ్‌లలో 7 మ్యాచ్‌లు గెలిచి, 14 పాయింట్లతో పాయింట్ల టేబుల్‌లో మూడో స్థానంలో ఉంది. ప్లేఆఫ్‌కు వెళ్లడానికి మిగిలిన 4 మ్యాచ్‌లలో కేవలం 1 మ్యాచ్ గెలవాల్సి ఉంది. నేడు ఆర్సీబీ జట్టు చెన్నై సూపర్ కింగ్స్‌తో తలపడనుంది.