IPL 2025 New Schedule: ఐపీఎల్ 2025 రీషెడ్యూల్ విడుదల.. 6 స్టేడియాల్లో మిగిలిన మ్యాచ్‌లు!
ఒరిజినల్ షెడ్యూల్ ప్రకారం ప్లేఆఫ్ దశ మే 20 నుంచి ప్రారంభం కావాల్సి ఉంది. ఇప్పుడు కొత్త షెడ్యూల్ ప్రకారం ప్లేఆఫ్ దశ మే 29 నుంచి ప్రారంభమవుతుంది. మొదటి క్వాలిఫయర్ మే 29న జరగనుంది.
- Author : Gopichand
Date : 13-05-2025 - 7:36 IST
Published By : Hashtagu Telugu Desk
IPL 2025 New Schedule: ఐపీఎల్ 2025 కొత్త షెడ్యూల్ (IPL 2025 New Schedule) విడుదలైంది. టోర్నమెంట్‌లో మిగిలిన మ్యాచ్‌ల కోసం 6 మైదానాలను ఎంపిక చేశారు. కొత్త షెడ్యూల్ ప్రకారం ఇంకా 17 మ్యాచ్‌లు మిగిలి ఉన్నాయి. ఫైనల్ మ్యాచ్ కొత్త తేదీ (IPL 2025 Final Date) కూడా వెల్లడైంది. భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) ప్రకటించిన వివరాల ప్రకారం.. మిగిలిన మ్యాచ్‌లు మే 17 నుంచి ప్రారంభమవుతాయి. అయితే ఫైనల్ మ్యాచ్ జూన్ 3న జరగనుంది.
ప్రభుత్వం, భద్రతా సంస్థలు, అన్ని భాగస్వాములతో సంప్రదింపులు జరిపిన తర్వాత BCCI మే 17 నుంచి టోర్నమెంట్‌ను మళ్లీ ప్రారంభించాలని నిర్ణయించింది. కొత్త షెడ్యూల్‌లో 2 రోజులు రెండు మ్యాచ్‌లు ఆడతారు. దీని కోసం ఆదివారం రోజును ఎంపిక చేశారు. టోర్నమెంట్ మళ్లీ ప్రారంభమైనప్పుడు మొదటి మ్యాచ్ బెంగళూరులో కోల్‌కతా నైట్ రైడర్స్- రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య జరగనుంది. మిగిలిన 17 మ్యాచ్‌ల కోసం ఎంపిక చేసిన నగరాలు జైపూర్, బెంగళూరు, లక్నో, ఢిల్లీ, ముంబై, అహ్మదాబాద్.
Also Read: PM Modi: పాకిస్తాన్ భయపడింది.. పాక్‌కు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన ప్రధాని మోదీ!
ప్లేఆఫ్ మ్యాచ్‌లు ఎప్పుడు ప్రారంభమవుతాయి?
ఒరిజినల్ షెడ్యూల్ ప్రకారం ప్లేఆఫ్ దశ మే 20 నుంచి ప్రారంభం కావాల్సి ఉంది. ఇప్పుడు కొత్త షెడ్యూల్ ప్రకారం ప్లేఆఫ్ దశ మే 29 నుంచి ప్రారంభమవుతుంది. మొదటి క్వాలిఫయర్ మే 29న జరగనుంది. ఎలిమినేటర్ మ్యాచ్ మే 30న, రెండవ క్వాలిఫయర్ జూన్ 1న, ఫైనల్ మ్యాచ్ జూన్ 3న జరగనుంది. ప్లేఆఫ్ మ్యాచ్‌ల కోసం వేదికల ప్రకటన తర్వాత జరుగుతుంది.
లీగ్ దశ చివరి మ్యాచ్ మే 27న లక్నోలోని స్టేడియంలో RCB- లక్నో సూపర్ జెయింట్స్ మధ్య జరగనుంది. ఆదివారం మే 18న రెండు మ్యాచ్‌లు జరగనున్నాయి. పగటి సమయంలో రాజస్థాన్ రాయల్స్ vs పంజాబ్ కింగ్స్,, సాయంత్రం మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ vs పంజాబ్ కింగ్స్ తలపడనున్నాయి.
ఒక వారం పాటు ఐపీఎల్ 2025 సస్పెండ్
మే 8న ధర్మశాలలో పంజాబ్ కింగ్స్- ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య మ్యాచ్ జరుగుతుండగా, భద్రతా కారణాలతో దాన్ని రద్దు చేశారు. BCCI కొంత సమయం తర్వాత వెల్లడించిన వివరాల ప్రకారం.. భారత్-పాక్ ఉద్రిక్తతల కారణంగా ఐపీఎల్ 2025ను ఒక వారం పాటు సస్పెండ్ చేస్తున్నట్లు తెలిపింది.