HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Sports
  • >Indias Breakthrough Before Tea Break In Guwahati Test

Jasprit Bumrah : గువాహటి టెస్టులో టీ బ్రేక్‌కి ముందు భారత్‌కి బ్రేక్ త్రూ!

  • Author : Vamsi Chowdary Korata Date : 22-11-2025 - 12:08 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Jasprit Bumrah
Jasprit Bumrah

భారత్ – దక్షిణాఫ్రికా రెండో టెస్టులో టీమిండియాకు ఎట్టకేలకు వికెట్ దక్కింది. బ్యాటర్లకు అనుకూలించిన పిచ్‌పై సౌతాఫ్రికా ఓపెనర్లు నిలకడగా ఆడారు. బుమ్రా అద్భుత బంతితో మర్కరమ్‌ను అవుట్ చేయడతో టీమిండియాకు బ్రేక్ త్రూ లభించింది. టీ బ్రేక్ సమయానికి సౌతాఫ్రికా 82/1తో ఉంది. గువాహటిలో తొలిసారి జరుగుతున్న ఈ టెస్టులో వాతావరణం కారణంగా మ్యాచ్ ముందుగానే ప్రారంభమైంది. తొలుత టీ బ్రేక్ ఇవ్వనుండగా, ఆ తర్వాత లంచ్ బ్రేక్ ఉంటుంది.

భారత్ – దక్షిణాఫ్రికా మధ్య జరుగుతున్న రెండో టెస్టులో టీమిండియాకు ఎట్టకేలకు వికెట్ దక్కింది. గువాహటి వేదికగా జరుగుతున్న ఈ టెస్టులో టాస్ గెలిచిన సౌతాఫ్రికా జట్టు బ్యాటింగ్ ఎంచుకుంది. బ్యాటర్లకు అనుకూలంగా ఉండే విధంగా పిచ్ తయారు చేయడంతో వికెట్లు తీయడంలో బౌలర్లు శ్రమించాల్సి వస్తోంది. బుమ్రా, సిరాజ్ మెరుపు బంతులు వేసినా.. కుల్దీప్, వాషింగ్టన్ స్పిన్ తంత్రం ఉపయోగించినా వికెట్లు దొరకడం చాలా కష్టమైంది. టీ బ్రేక్‌కి ముందు ఎట్టకేలకు టీమిండియాకు బ్రేక్ త్రూ లభించింది.

గువాహటి స్టేడియం మొదటి సారిగా టెస్టు క్రికెట్‌కు అర్హత సాధించింది. ఈశాన్య ప్రాంతంలో వాతావరణ పరిస్థితులు దృష్టిలో ఉంచుకుని మ్యాచ్‌ని ఒక అరగంట ముందుగానే ప్రారంభించారు. టాస్ గెలిచిన టెంబా బవుమా వరుసగా రెండో టెస్టులో కూడా బ్యాటింగ్‌కే మొగ్గు చూపాడు. పిచ్ అన్నిరకాల పరిస్థితులకు అనుకూలించడంతో సౌతాఫ్రికా బ్యాటర్లు కూడా నిలకడగా రాణించారు.

టీమిండియా పేసర్ జస్ప్రీత్ బుమ్రా ఆరంభంలో వేసిన ఓ అద్భుత బంతిని ఎదుర్కొనే క్రమంలో మర్కరమ్ స్లిప్‌లో క్యాచ్ ఇచ్చాడు. అయితే, ఆ క్యాచ్ అందుకోవడంలో కేఎల్ రాహుల్ విఫలమయ్యాడు. దాంతో మర్కరమ్‌కి నాలుగు పరుగుల వద్ద తొలి లైఫ్ లభించింది. ఆ తర్వాత ఓపెనర్లు మర్కరమ్, ర్యాన్ రికెల్టన్ మరో తప్పు చేయకుండా ఇన్నింగ్స్‌ని బలంగా నిర్మించారు.

అయితే టీ బ్రేక్ ఇంకొంత సమయం ఉందనగా కెప్టెన్ రిషభ్ పంత్ బంతిని స్పెషలిస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా చేతికి అందించాడు. బుమ్రా తన స్వింగ్‌తో అద్భుతంగా డెలివరీ చేయగా బంతి బ్యాట్‌కి తగిలి ఆపై వికెట్లను తాకింది. దాంతో 27వ ఓవర్‌లో భారత్‌కు బ్రే త్రూ లభించింది. 81 బంతులు ఆడిన ఎయిడెన్ మర్కరమ్ 5 ఫోర్లతో 38 పరుగులు చేసి అవుటయ్యాడు. ఈ టెస్టులో తొలి రోజు టీ బ్రేక్ సమయానికి సౌతాఫ్రికా 82 పరుగులకు ఒక వికెట్ కోల్పోయింది. క్రీజులో ర్యాన్ రికెల్టన్ 35 పరుగులతో కొనసాగుతున్నాడు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Guwahati Test
  • ind vs sa
  • Jasprit Bumrah
  • TeamIndia

Related News

MS Dhoni's Reaction To Wife Sakshi

బుమ్రా క్యాచ్ పట్టడంతో ఎగిరి గంతేసిన సాక్షి..ధోనీ రియాక్షన్ చూస్తే నవ్వులే

MS Dhoni’s Reaction To Wife Sakshi  టీ20 ప్రపంచకప్ సెమీ ఫైనల్‌లో మైదానంలో ఆటగాళ్లు ఎంత టెన్షన్ పడ్డారో, గ్యాలరీలోనూ అంతే ఉత్కంఠ నెలకొంది. అయితే, ఈ ఉత్కంఠ మధ్య జరిగిన ఓ సరదా సంఘటన ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ తన భార్య సాక్షి అత్యుత్సాహాన్ని తనదైన ‘కూల్’ స్టైల్‌లో కంట్రోల్ చేసిన తీరు అందరినీ ఆకట్టుకుంటోంది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో క్ల

  • Suryakumar Yadav, Gautam Gambhir

    ఇంగ్లండ్‌తో సెమీఫైన పై గంభీర్-సూర్య మైండ్ గేమ్..

  • Sunil Gavaskar

    సెమీస్ ముందు ఇండియాకు గ‌వాస్క‌ర్ వార్నింగ్

  • Mohammad Amir

    టీమిండియాపై మళ్లీ నోరుపారేసుకున్న ఆమిర్!

Latest News

  • ఐసీసీ టీ20 వరల్డ్ కప్ 2026.. ప్రైజ్ మ‌నీ ఎంతో తెలుసా?

  • అమెరికా కంట్లో నలుసుగా మారిన ఐఆర్‌జీసీ కొత్త క‌మాండ‌ర్‌?!

  • ఇంధ‌న స‌ర‌ఫ‌రాపై కేంద్రం కీల‌క ప్ర‌క‌ట‌న‌!

  • మధ్యప్రాచ్యంలో టెన్ష‌న్‌.. ఆకాశాన్నంటుతున్న విమాన ధరలు!

  • ఐపీఎల్ 2026 కోసం రెడీ అవుతున్న‌ రోహిత్ శర్మ.. నెట్ ప్రాక్టీస్ వీడియో వైరల్!

Trending News

    • ఫైనల్‌లో భారత్ vs న్యూజిలాండ్.. ఐసీసీ కీల‌క ట్వీట్‌!

    • టీ20 ప్రపంచకప్ ఫైనల్.. న్యూజిలాండ్‌పై భార‌త్‌దే పైచేయి?!

    • ఏ కారు కొంటే మంచిది?!

    • ఇరాన్‌కు సాయం చేస్తున్న ర‌ష్యా?!

    • మార్చి 31లోపు ఈ ప‌నులు పూర్తి చేయాల్సిందే!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd