బంగ్లాదేశ్ క్రికెటర్లకు భారీ దెబ్బ.. భారతీయ కంపెనీ కీలక నిర్ణయం!
బంగ్లాదేశ్ ఆటగాళ్లకు SGతో కోట్లాది రూపాయల విలువైన డీల్స్ ఉండేవి. ఇప్పుడు భారత్‌తో ఘర్షణ వైఖరి కారణంగా ఆటగాళ్లు తమ క్రీడా సామాగ్రి (బ్యాట్లు, ప్యాడ్లు, గ్లోవ్స్ మొదలైనవి) కోసం ఇబ్బంది పడాల్సి వస్తుంది.
- Author : Gopichand
Date : 09-01-2026 - 9:14 IST
Published By : Hashtagu Telugu Desk
Bangladesh Sponsorship: బంగ్లాదేశ్ క్రికెట్‌కు కష్టాలు మొదలయ్యాయి. బీసీసీఐ, భారత్‌తో పెట్టుకున్న వైరం ఇప్పుడు ఆ జట్టుపై తీవ్ర ప్రభావం చూపుతోంది. టీ20 వరల్డ్ కప్ 2026ను భారత్‌లో ఆడబోమని బంగ్లాదేశ్ చేసిన డిమాండ్‌ను ఐసీసీ ఇప్పటికే తోసిపుచ్చింది. భద్రతా కారణాలపై వివరణ ఇవ్వాలని కోరింది. ఈ వివాదం కొనసాగుతుండగానే ఒక ప్రముఖ భారతీయ కంపెనీ బంగ్లాదేశ్ క్రికెటర్లకు షాక్ ఇస్తూ కీలక నిర్ణయం తీసుకుంది.
భారత్‌తో వివాదం కారణంగా బంగ్లాదేశ్ క్రికెటర్లు ఆర్థికంగా, వృత్తిపరంగా భారీ నష్టాన్ని మూటగట్టుకుంటున్నారు. ముస్తాఫిజుర్ రెహమాన్‌ను ఐపీఎల్ నుండి తప్పించిన తర్వాత బంగ్లాదేశ్ ప్రభుత్వం ఐపీఎల్‌ను నిషేధించింది. అలాగే టీ20 వరల్డ్ కప్ ఆడేందుకు భారత్ రావడానికి నిరాకరించింది. దీనికి నిరసనగా భారతీయ యాంకర్ రిద్ధిమా పాఠక్ ఇప్పటికే బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్‌లో పనిచేయడానికి నిరాకరించారు.
Also Read: స్టాఫ్ సెలక్షన్ కమిషన్.. తాత్కాలిక పరీక్షల క్యాలెండర్ విడుదల!
Indian cricket manufacturing brand SG set to end sponsorship deals with Bangladesh Cricket players. pic.twitter.com/ol4BKltry7
— Himanshu Pareek (@Sports_Himanshu) January 9, 2026
SG స్పాన్సర్‌షిప్ రద్దు
తాజాగా క్రీడా సామాగ్రి తయారీలో ప్రపంచ ప్రసిద్ధి గాంచిన భారతీయ కంపెనీ సాన్‌స్పరెల్స్ గ్రీన్లాండ్స్ బంగ్లాదేశ్ క్రికెటర్లతో తమ ఒప్పందాలను రద్దు చేసుకోవాలని నిర్ణయించుకుంది. బంగ్లాదేశ్ కెప్టెన్ లిటన్ దాస్‌తో సహా పలువురు స్టార్ ఆటగాళ్లకు ఈ కంపెనీ స్పాన్సర్‌గా ఉండేది. దీనిపై ఇంకా అధికారికంగా ప్రకటన వెలువడనప్పటికీ సంబంధిత ఆటగాళ్లకు సమాచారం అందినట్లు తెలుస్తోంది.
కోట్లలో నష్టం
బంగ్లాదేశ్ ఆటగాళ్లకు SGతో కోట్లాది రూపాయల విలువైన డీల్స్ ఉండేవి. ఇప్పుడు భారత్‌తో ఘర్షణ వైఖరి కారణంగా ఆటగాళ్లు తమ క్రీడా సామాగ్రి (బ్యాట్లు, ప్యాడ్లు, గ్లోవ్స్ మొదలైనవి) కోసం ఇబ్బంది పడాల్సి వస్తుంది. SG కేవలం భారత్‌లోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన బ్రాండ్. టీ20 వరల్డ్ కప్ 2026 ప్రారంభానికి కేవలం ఒక నెల సమయం మాత్రమే ఉండటంతో ఇంత తక్కువ సమయంలో అంతర్జాతీయ స్థాయి కొత్త స్పాన్సర్లను వెతకడం బంగ్లాదేశ్ టీమ్‌కు దాదాపు అసాధ్యం.