HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Sports
  • >India Women Create History Clinch Maiden Icc Womens World Cup Title

India Womens WC Winner: చరిత్ర సృష్టించిన భారత మహిళల క్రికెట్ జ‌ట్టు.. తొలిసారి వన్డే ప్రపంచకప్ టైటిల్ కైవసం!

ఈ మ్యాచ్‌లో షెఫాలీ వర్మ తన అద్భుత ఆల్‌రౌండర్ ప్రదర్శన (87 పరుగులు, 2 వికెట్లు)తో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా ఎంపికైంది. ఈ విజయంతో హర్మన్‌ప్రీత్ కౌర్ పేరు కూడా కపిల్ దేవ్, ఎంఎస్ ధోనీ, రోహిత్ శర్మల సరసన నిలిచింది. భారత మహిళల చారిత్రక విజయంతో దేశవ్యాప్తంగా ఆనందోత్సాహ వాతావరణం నెలకొంది.

  • By Dinesh Akula Published Date - 12:21 AM, Mon - 3 November 25
  • daily-hunt
India Womens WC Winner
India Womens WC Winner

India Womens WC Winner: కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ నాయకత్వంలో భారత మహిళల క్రికెట్ జట్టు చరిత్ర సృష్టించింది. టీమిండియా తొలిసారిగా ఐసీసీ మహిళల వన్డే వరల్డ్ కప్ (India Womens WC Winner) టైటిల్‌ను కైవసం చేసుకుంది. ఆదివారం జరిగిన ఫైనల్లో భారత్ 52 పరుగుల తేడాతో దక్షిణాఫ్రికాపై ఘన విజయం సాధించింది. దీనితో 2005, 2017లో చేజారిన కలను మహిళా క్రికెటర్లు సాకారం చేశారు.

భారత్ ఇన్నింగ్స్

ముందుగా బ్యాటింగ్‌కు దిగిన భారత జట్టు 50 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 298 పరుగులు చేసింది. ఓపెనర్లు షెఫాలీ వర్మ (87 పరుగులు), స్మృతి మంధాన (45 పరుగులు) జట్టుకు అద్భుత ఆరంభాన్ని ఇచ్చారు. వీరిద్దరూ తొలి వికెట్‌కు 104 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఆ తరువాత జెమీమా రోడ్రిగ్స్ (24), కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ (20) త్వరగా ఔటైనప్పటికీ ఆల్‌రౌండర్ దీప్తి శర్మ (58), రిచా ఘోష్ (34) స్థిరంగా ఆడి జట్టు స్కోరును 298 పరుగులకు చేర్చారు. సఫారీ బౌలర్ ఆయాబోంగా ఖాకా 3 వికెట్లు తీసింది.

Also Read: Unclaimed Bank Deposits: మీకు బ్యాంక్ అకౌంట్ ఉందా? అయితే ఈ వార్త మీకోస‌మే!

THE MOST AWAITED VIDEO. 😍🇮🇳

– Team India lifting the World Cup Trophy. 🏆
pic.twitter.com/7NE2HapATT

— Mufaddal Vohra (@mufaddal_vohra) November 2, 2025

దక్షిణాఫ్రికా పోరాటం

భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన దక్షిణాఫ్రికా 246 పరుగులకు ఆలౌటైంది. ఓపెనర్లు లారా వోల్వార్డ్ (65), తాజ్మిన్ బ్రిట్స్ (23) మంచి ఆరంభం ఇచ్చారు. కానీ అమాన్‌జోత్ కౌర్ అద్భుత ఫీల్డింగ్‌తో బ్రిట్స్ రనౌట్ అవ్వడం మ్యాచ్‌ను భారత్ వైపు మలుపు తిప్పింది. ఆ తరువాత షెఫాలీ వర్మ తన స్పిన్ మ్యాజిక్‌తో రెండు కీలక వికెట్లు తీసి సౌతాఫ్రికా ఇన్నింగ్స్‌ను కుదిపేసింది. మరోవైపు దీప్తి శర్మ అద్భుత బౌలింగ్‌తో 5 వికెట్లు పడగొట్టింది. భారత బౌలర్ల అద్భుత ప్రదర్శనతో సఫారీలు 246 పరుగులకే ఆలౌటయ్యారు.

ఈ మ్యాచ్‌లో షెఫాలీ వర్మ తన అద్భుత ఆల్‌రౌండర్ ప్రదర్శన (87 పరుగులు, 2 వికెట్లు)తో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా ఎంపికైంది. ఈ విజయంతో హర్మన్‌ప్రీత్ కౌర్ పేరు కూడా కపిల్ దేవ్, ఎంఎస్ ధోనీ, రోహిత్ శర్మల సరసన నిలిచింది. భారత మహిళల చారిత్రక విజయంతో దేశవ్యాప్తంగా ఆనందోత్సాహ వాతావరణం నెలకొంది.


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Deepti Sharma
  • DY Patil Stadium
  • Harmanpreet Kaur
  • ICC World Cup 2025
  • India vs South Africa Final
  • India women world cup
  • indian cricket team
  • Shafali Verma
  • womens' cricket

Related News

Net Worth

Net Worth: భార‌త్‌, సౌతాఫ్రికా జ‌ట్ల కెప్టెన్ల సంపాద‌న ఎంతో తెలుసా?

మీడియా నివేదికల ప్రకారం.. దక్షిణాఫ్రికా మహిళా క్రికెట్ జట్టు కెప్టెన్ లౌరా వోల్వార్డ్ట్ మొత్తం నికర విలువ $2 మిలియన్లుగా ఉంది. అంటే భారత కరెన్సీలో సుమారు రూ. 18 కోట్లు.

  • Jemimah Rodrigues

    Jemimah Rodrigues: జెమిమా రోడ్రిగ్స్‌కు ఉన్న స‌మ‌స్య ఏంటో తెలుసా?

  • Mithali Raj

    Mithali Raj : నాలుగు దశాబ్దాల కల..మిథాలీ రాజ్ చేతిలో వరల్డ్‌కప్!

  • Victory Parade

    Team India : భారత మహిళా జట్టుకు భారీ నజరానా ప్రకటించిన బీసీసీఐ.!

  • India vs South Africa

    India vs South Africa: మ‌హిళ‌ల వ‌న్డే వ‌ర‌ల్డ్ క‌ప్‌ ఫైన‌ల్‌.. సౌతాఫ్రికా టార్గెట్ ఎంతంటే?

Latest News

  • 1.2 Lakh Jobs: లక్ష్యం 120 జీసీసీలు.. 1.2 లక్షల ఉద్యోగాలు: మంత్రి

  • Hinduja Group: ఫలిస్తున్న సీఎం చంద్రబాబు ప్రయత్నాలు.. రాష్ట్రానికి మ‌రో రూ.20 వేల కోట్ల పెట్టుబడులు!

  • 20 Lakh Jobs : రాష్ట్రంలో నిరుద్యోగులకు ’20 లక్షల ఉద్యోగాలు ఇచ్చి తీరుతాం’ – మంత్రి నారా లోకేష్

  • Congress: సీఎం రేవంత్- అజారుద్దీన్‌ల వివాదంపై కాంగ్రెస్ క్లారిటీ!

  • Nepal: నేపాల్‌లో ఘోరం.. ఏడుగురు మృతి!

Trending News

    • Road Accident : ఆర్టీసీ ప్రయాణానికి కూడా రక్షణ కరువేనా…? గాల్లో కలిసిపోతున్న ప్రాణాలు !!

    • Tollywood : చేవెళ్లలో ఘోర రోడ్డు ప్రమాదం.. బాలకృష్ణ, నాగచైతన్య సినిమాల వాయిదా?

    • Laura Wolvaardt : సఫారీ కెప్టెన్ లారా వోల్వార్డ్ ఎమోషనల్.!

    • Unclaimed Bank Deposits: మీకు బ్యాంక్ అకౌంట్ ఉందా? అయితే ఈ వార్త మీకోస‌మే!

    • LVM3-M5 Launch : నింగిలోకి దూసుకెళ్లిన LVM3-M5(బాహుబలి) రాకెట్

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd