Hardik Pandya: పాక్‌తో మ్యాచ్‌లో హార్దిక్ పాండ్యా సరికొత్త రికార్డు!
యూఏఈపై జరిగిన మొదటి మ్యాచ్‌లో కుల్దీప్ యాదవ్, శివమ్ దూబే అద్భుతమైన బౌలింగ్ ప్రదర్శనతో యూఏఈని కేవలం 57 పరుగులకే ఆలౌట్ చేశారు. తర్వాత 58 పరుగుల లక్ష్యాన్ని భారత్ కేవలం 27 బంతుల్లోనే సునాయాసంగా ఛేదించింది.
- By Gopichand Published Date - 09:56 PM, Sun - 14 September 25

Hardik Pandya: దుబాయ్‌లో జరుగుతున్న ఆసియా కప్ 2025లో భారత్, పాకిస్తాన్ మధ్య ఉత్కంఠభరితమైన మ్యాచ్ ఆరంభమైంది. టాస్ గెలిచిన పాకిస్తాన్ కెప్టెన్ సల్మాన్ అగా మొదట బ్యాటింగ్ చేయాలని నిర్ణయించుకున్నాడు. అయితే టీమ్ ఇండియా బౌలర్లు మ్యాచ్‌లో అద్భుతమైన ఆరంభం ఇచ్చారు. మ్యాచ్ తొలి బంతికే పాకిస్తాన్ యువ బ్యాట్స్‌మెన్ సామ్ అయూబ్‌ను హార్దిక్ పాండ్యా డకౌట్ చేశాడు. అయూబ్ కొట్టిన షాట్ నేరుగా జస్ప్రీత్ బుమ్రా చేతిలోకి వెళ్లడంతో పెవిలియన్ చేరాడు. దీంతో హార్దిక్ పాండ్యా (Hardik Pandya) ఒక అరుదైన రికార్డును సొంతం చేసుకున్నాడు.
హార్దిక్ పాండ్యా రికార్డు
టీ20 అంతర్జాతీయ మ్యాచ్‌లో తొలి బంతికే వికెట్ తీసిన రెండో భారత బౌలర్‌గా హార్దిక్ పాండ్యా నిలిచాడు. ఇతని కంటే ముందు ఈ ఘనతను అర్షదీప్ సింగ్ సాధించాడు. అర్షదీప్ 2024లో అమెరికాపై జరిగిన మ్యాచ్‌లో మొదటి బంతికే వికెట్ తీశాడు. హార్దిక్ తర్వాత రెండో ఓవర్‌లో జస్ప్రీత్ బుమ్రా కూడా అద్భుత ప్రదర్శన చేశాడు. బుమ్రా బౌలింగ్‌లో మహ్మద్ హారిస్ కేవలం 3 పరుగులు చేసి హార్దిక్ పాండ్యా చేతికి చిక్కాడు.
Also Read: Hero Splendor Plus: జీఎస్టీ తగ్గింపు.. రూ. 83 వేల బైక్ ఇప్పుడు రూ. 75 వేలకే!
Hardik pandya dismissed Ghante ka Prince in 1st ball pic.twitter.com/z6ibmBl5Zq
— S.Bhai33 (@HPstanno1) September 14, 2025
ప్లేయింగ్ 11లో మార్పులు లేవు
పాకిస్తాన్‌తో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో భారత జట్టు తమ ప్లేయింగ్ 11లో ఎలాంటి మార్పులు చేయలేదు. భారత్ ముగ్గురు స్పిన్నర్లతోనే బరిలోకి దిగింది. టీ20 అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ అర్షదీప్ సింగ్‌కు ఈ మ్యాచ్‌లో చోటు దక్కలేదు. టోర్నమెంట్‌లో మొదటి మ్యాచ్‌లో టీమ్ ఇండియా యూఏఈని 9 వికెట్ల తేడాతో ఓడించింది.
గత మ్యాచ్‌లో భారత్ ఘన విజయం
యూఏఈపై జరిగిన మొదటి మ్యాచ్‌లో కుల్దీప్ యాదవ్, శివమ్ దూబే అద్భుతమైన బౌలింగ్ ప్రదర్శనతో యూఏఈని కేవలం 57 పరుగులకే ఆలౌట్ చేశారు. తర్వాత 58 పరుగుల లక్ష్యాన్ని భారత్ కేవలం 27 బంతుల్లోనే సునాయాసంగా ఛేదించింది. ఆ మ్యాచ్‌లో అభిషేక్ శర్మ 16 బంతుల్లో 30 పరుగులు చేయగా, శుభ్‌మన్ గిల్ 9 బంతుల్లో 20 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచారు.