HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Automobile
  • >After Gst Reduction Hero Splendor Plus Has Become So Cheap Know What Is The New Price

Hero Splendor Plus: జీఎస్టీ త‌గ్గింపు.. రూ. 83 వేల బైక్ ఇప్పుడు రూ. 75 వేల‌కే!

స్ప్లెండర్ ప్లస్ ఎక్స్‌టెక్ డిస్క్ వేరియంట్లో ఇప్పుడు 240mm ఫ్రంట్ డిస్క్ బ్రేక్ అమర్చారు. ఇది భద్రతను మరియు బ్రేకింగ్ పనితీరును మెరుగుపరుస్తుంది. దీంతో పాటు ఇందులో పలు ఆధునిక ఫీచర్లు ఉన్నాయి.

  • By Gopichand Published Date - 08:58 PM, Sun - 14 September 25
  • daily-hunt
Hero Splendor Plus
Hero Splendor Plus

Hero Splendor Plus: రెండు చక్రాల వాహనాలపై (350cc వరకు) జీఎస్టీని 28% నుండి 18%కి తగ్గించారు. దీని వల్ల వినియోగదారులకు నేరుగా లబ్ధి చేకూరింది. ప్రముఖ ద్విచక్ర వాహనాల సంస్థ హీరో మోటోకార్ప్ కూడా తమ ప్రసిద్ధ బైక్ స్ప్లెండర్ ప్లస్ ఎక్స్‌టెక్ డిస్క్ బ్రేక్ వేరియంట్ (Hero Splendor Plus) ధరను తగ్గించింది. ఢిల్లీలో ఈ బైక్ ఎక్స్-షోరూమ్ ధర రూ. 83,461 ఉండగా, జీఎస్టీలో 10% కోతతో దాదాపు రూ. 7,900 తగ్గుతుంది. అంటే ఇప్పుడు దీని కొత్త ధర రూ. 75,561 కానుంది. అయితే ఆన్-రోడ్ ధరలు RTO, బీమా ఛార్జీలను బట్టి వివిధ నగరాల్లో మారుతూ ఉంటాయి.

ఇంజిన్- పనితీరు

హీరో స్ప్లెండర్ ప్లస్ ఎక్స్‌టెక్ డిస్క్‌లో 97.2cc, ఎయిర్-కూల్డ్, 4-స్ట్రోక్, సింగిల్-సిలిండర్ ఇంజిన్ అమర్చారు. ఇది BS6 ఫేజ్ 2B ప్రమాణాలకు అనుగుణంగా ఉంటుంది. ఈ ఇంజిన్ 8.02 PS శక్తిని, 10 Nm టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. ఇది 4-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్‌తో వస్తుంది. పట్టణ, గ్రామీణ ప్రాంతాలలో ఈ బైక్ మంచి పనితీరును కనబరుస్తుంది. దీని గరిష్ట వేగం గంటకు 87 కి.మీ.

Also Read: Engineers Day: ఇంజనీర్స్ డే శుభాకాంక్ష‌లు తెలిపిన సీఎం రేవంత్ రెడ్డి!

మైలేజ్

హీరో కంపెనీ చెప్పిన దాని ప్రకారం.. స్ప్లెండర్ ప్లస్ ఎక్స్‌టెక్ డిస్క్ వేరియంట్ లీటర్‌కు 73 కి.మీ మైలేజ్ ఇస్తుంది. దీనిలో 9.8 లీటర్ల ఇంధన ట్యాంక్ ఉంది. దీని వల్ల ఒక ఫుల్ ట్యాంక్‌తో 600-650 కి.మీ వరకు ప్రయాణించవచ్చు. అంతేకాకుండా ఇందులో హీరో i3S (Idle Stop-Start) టెక్నాలజీ ఉంది. ఇది ట్రాఫిక్‌లో ఇంధనాన్ని ఆదా చేయడంలో సహాయపడుతుంది.

ఆధునిక ఫీచర్లు

స్ప్లెండర్ ప్లస్ ఎక్స్‌టెక్ డిస్క్ వేరియంట్లో ఇప్పుడు 240mm ఫ్రంట్ డిస్క్ బ్రేక్ అమర్చారు. ఇది భద్రతను మరియు బ్రేకింగ్ పనితీరును మెరుగుపరుస్తుంది. దీంతో పాటు ఇందులో పలు ఆధునిక ఫీచర్లు ఉన్నాయి. డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్.. ఇది రియల్-టైమ్ మైలేజ్, స్పీడోమీటర్, ట్రిప్ మీటర్, లో-ఫ్యూయల్ ఇండికేటర్ వంటి సమాచారాన్ని అందిస్తుంది. బ్లూటూత్ కనెక్టివిటీ.. ఇది మొబైల్‌ను బైక్‌తో అనుసంధానం చేస్తుంది. జీఎస్టీ తగ్గింపు కారణంగా ఇప్పుడు హీరో స్ప్లెండర్ ప్లస్ ఎక్స్‌టెక్ డిస్క్ మరింత సరసమైనదిగా మారింది. దీని అద్భుతమైన మైలేజ్, నమ్మదగిన ఇంజిన్, ఆధునిక ఫీచర్లు దీనిని మధ్యతరగతి కుటుంబాలకు, రోజువారీ ప్రయాణికులకు ఒక మంచి ఎంపికగా నిలిచాయి.


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • auto news
  • Automobiles
  • GST Cut
  • GST reduction
  • Hero Splendor Mileage
  • Hero Splendor Plus

Related News

Fiat To Mercedes Benz

Fiat To Mercedes Benz: రూ. 18 వేల కారుతో కెరీర్ ప్రారంభించిన‌ బాలీవుడ్ హీ-మ్యాన్‌!

ఆయన కార్ల సేకరణ కేవలం విలాసవంతమైన ప్రదర్శన కాదు. ఆయన జీవితంలోని జ్ఞాపకాలకు, కష్టానికి, సాధారణ ప్రారంభానికి సాక్ష్యం.

  • RC Transfer Process

    RC Transfer Process: వాహనం అమ్మిన తర్వాత ఆర్సీ బదిలీ.. పూర్తి ప్రక్రియ ఇదే!!

  • RC Transfer Process

    Car Buying Guide: కుటుంబం కోసం సరైన కారును ఎలా ఎంచుకోవాలో తెలుసా?!

  • Car Dents

    Car Dents: మీ కారుకు స్క్రాచ్‌లు, డెంట్‌లు ప‌డ్డాయా? అయితే ఇలా చేయండి!

  • Airless Tyres

    Airless Tyres: త్వ‌ర‌లో ఎయిర్‌లెస్ టైర్లు.. ఇవి ఎలా ప‌నిచేస్తాయంటే?!

Latest News

  • Spirit : స్పిరిట్ లో విలన్ గా కొరియన్ నటుడు

  • AKhanda 2: ఫైట్లన్నీ స్వయంగా చేశారు.. బాలయ్య పై ఫైట్ మాస్టర్ రామ్ లక్ష్మణ్ సంచలనం!

  • Andhra Pradesh Government : వారంతా రూ.10 వేలు చెల్లించాల్సిన అవసరం లేదు.. పూర్తిగా ఉచితం.!

  • TGSRTCలో భారీగా కండక్టర్ ఉద్యోగ ఖాళీలు…నియామకాలకు రెడీ

  • Volcano : బద్దలైన అగ్నిపర్వతం.. భారత్ పై ఎఫెక్ట్

Trending News

    • Bank: రేపు ఈ రాష్ట్రాల్లో బ్యాంకులు మూసి ఉంటాయా?

    • Punjabi Cremation: ధర్మేంద్రకు తుది వీడ్కోలు.. సిక్కు సంప్రదాయంలో అంత్యక్రియలు ఎలా నిర్వహిస్తారంటే?

    • Karun Nair: కరుణ్ నాయర్ కీల‌క వ్యాఖ్యలు.. టీమిండియా పైనేనా?

    • Skanda Shashthi 2025: స్కంద షష్ఠి వ్రతం గురించి మీకు తెలుసా? ముహూర్తం, పూజా విధానం ఇదే!

    • Pelli Muhurtham : నవంబర్‌ 26 నుంచి పెళ్లిళ్లు, శుభకార్యాలకు బ్రేక్‌! ఇక ఫిబ్రవరి 2026 లోనే పెళ్లి ముహూర్తాలు.

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd