భారత్ ఘనవిజయం.. 10 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించిన టీమిండియా!
అభిషేక్ శర్మ ఈ మ్యాచ్‌లో కేవలం 14 బంతుల్లోనే తన హాఫ్ సెంచరీని పూర్తి చేశాడు. అంతర్జాతీయ టీ20 క్రికెట్లో భారత్ తరపున ఇది రెండో వేగవంతమైన ఫిఫ్టీ.
- Author : Gopichand
Date : 25-01-2026 - 10:03 IST
Published By : Hashtagu Telugu Desk
India vs New Zealand: మూడవ టీ20 మ్యాచ్‌లో భారత్ 8 వికెట్ల తేడాతో న్యూజిలాండ్‌ను చిత్తు చేసింది. టీమ్ ఇండియా తరపున అభిషేక్ శర్మ, సూర్యకుమార్ యాదవ్ ఇద్దరూ మెరుపు వేగంతో అర్ధశతకాలు బాదారు. గౌహతిలో జరిగిన ఈ మ్యాచ్‌లో న్యూజిలాండ్ జట్టు 153 పరుగులు మాత్రమే చేయగలిగింది. దీనికి సమాధానంగా భారత జట్టు కేవలం 60 బంతుల్లోనే (10 ఓవర్లు) లక్ష్యాన్ని ఛేదించి చరిత్ర సృష్టించింది. ఈ విజయంతో ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో టీమ్ ఇండియా 3-0తో తిరుగులేని ఆధిక్యాన్ని సాధించింది.
154 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టీమ్ ఇండియా ఇన్నింగ్స్ మొదటి బంతికే సంజూ శాంసన్ వికెట్‌ను కోల్పోయింది. ఇషాన్ కిషన్ కూడా ధాటిగా ఆడుతూ 13 బంతుల్లో 28 పరుగులు చేశాడు. అయితే అభిషేక్ శర్మ, సూర్యకుమార్ యాదవ్ అస్సలు తగ్గకుండా కివీస్ బౌలర్లపై విరుచుకుపడ్డారు.
Also Read: కేంద్ర బడ్జెట్ 2026.. విద్యా రంగం అంచనాలీవే!
అభిషేక్ శర్మ ఈ మ్యాచ్‌లో కేవలం 14 బంతుల్లోనే తన హాఫ్ సెంచరీని పూర్తి చేశాడు. అంతర్జాతీయ టీ20 క్రికెట్లో భారత్ తరపున ఇది రెండో వేగవంతమైన ఫిఫ్టీ. అభిషేక్ ఈ మ్యాచ్‌లో 20 బంతుల్లో 68 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. తన తుఫాను ఇన్నింగ్స్‌లో ఆయన 7 ఫోర్లు, 5 సిక్సర్లు బాదాడు. మరోవైపు కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ వరుసగా రెండో మ్యాచ్‌లోనూ అర్ధశతకం నమోదు చేశాడు. ఆయన 26 బంతుల్లో 57 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు.
అభిషేక్ శర్మ రెండో వేగవంతమైన అర్ధశతకం
భారత్ తరపున టీ20ల్లో రెండో వేగవంతమైన అర్ధశతకం సాధించిన ఆటగాడిగా అభిషేక్ శర్మ నిలిచాడు. ఈ జాబితాలో 12 బంతుల్లో హాఫ్ సెంచరీ చేసిన యువరాజ్ సింగ్ మొదటి స్థానంలో ఉన్నారు. అంతేకాకుండా భారత్-న్యూజిలాండ్ టీ20 సిరీస్‌లో అత్యధిక సిక్సర్లు బాదిన రికార్డు ఇప్పటివరకు రోహిత్ శర్మ (10 సిక్సర్లు) పేరిట ఉండేది. ఇప్పుడు అభిషేక్ శర్మ 13 సిక్సర్లతో రోహిత్‌ను అధిగమించి అగ్రస్థానానికి చేరుకున్నాడు.
ఈ మ్యాచ్‌లో అభిషేక్ శర్మ 20 బంతుల్లో 68 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. తన ఇన్నింగ్స్‌లో 7 ఫోర్లు, 6 సిక్సర్లు బాదాడు. మొదట బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ 20 ఓవర్లలో 153/9 పరుగులు చేయగా.. భారత్ కేవలం 10 ఓవర్లలోనే 155/2 పరుగులు చేసి ఘన విజయం సాధించింది. అభిషేక్‌తో పాటు సూర్యకుమార్ యాదవ్ కూడా 26 బంతుల్లో 57 పరుగులతో (6 ఫోర్లు, 3 సిక్సర్లు) అజేయంగా నిలిచాడు.