HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Sports
  • >India Vs England 2nd Test Preview

India vs England: సమం చేస్తారా.. సమర్పిస్తారా? రెండో టెస్ట్ కు భారత్ రెడీ!

ఇంగ్లాండ్.. రెండో టెస్టు కోసం తమ తుది జట్టును ప్రకటించింది. తొలి టెస్టులో ఆడిన కాంబినేషన్ తోనే బరిలోకి దిగుతోంది. ఇటీవల కౌంటీల్లో ఆడి టెస్టు జట్టులోకి వచ్చిన పేసర్ జోఫ్రా ఆర్చర్‌కు తుది జట్టులో చోటు కల్పించలేదు.

  • Author : Hashtag U Date : 01-07-2025 - 10:57 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Biggest Wins In Test Cricket
Biggest Wins In Test Cricket

India vs England: ఇంగ్లాండ్ టూర్‌లో మరో సమరానికి భారత్ (India vs England) రెడీ అయింది. తొలి మ్యాచ్ ఓటమి నుంచి కోలుకున్న టీమిండియా ఇప్పుడు రెండో టెస్టులో గెలిచి సిరీస్ సమం చేయాలని పట్టుదలగా ఉంది. ఎడ్జ్ బాస్టన్ వేదికగా బుధవారం నుంచి ఈ మ్యాచ్ జరగనుంది. అయితే భారత తుది జట్టుపై ఇంకా క్లారిటీ లేదు.మొదటి టెస్టులో మిడిలార్డర్ వైఫల్యం, బౌలర్ల ఫెయిల్యూర్ తో తుది జట్టులో మార్పులపై కోచ్ గౌతమ్ గంభీర్ ఫోకస్ పెట్టాడు. ఒకటిరెండు మార్పులు జరిగే అవకాశముందని అంచనా వేస్తున్నారు. స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా రెండో టెస్టులో ఆడడంపై సస్పెన్స్ కంటిన్యూ అవుతోంది. వర్క్ లోడ్ ను దృష్టిలో పెట్టుకుంటే బుమ్రాకు రెస్ట్ ఇవ్వొచ్చు. అయితే సిరీస్ లో వెనుకబడకుండా ఉండాలంటే అతన్ని ఆడించాల్సిందే. పైగా గత మూడురోజులుగా బుమ్రా ప్రాక్టీస్ సెషన్ లో శ్రమించాడు. కానీ మ్యాచ్ ఆరంభానికి ముందే బుమ్రాపై తుది నిర్ణయం తీసుకుంటామని టీమ్ మేనేజ్ మెంట్ స్పష్టం చేసింది. ఒకవేళ బుమ్రాకు రెస్ట్ ఇస్తే అర్షదీప్ సింగ్, ఆకాశ్ దీప్ లలో ఒకరికి చోటు దక్కుతుంది.

అలాగే ఎడ్జ్ బాస్టన్ పిచ్ ను దృష్టిలో ఉంచుకుని ఇద్దరు స్పిన్నర్లతో ఆడే ఛాన్సుందని వార్తలు వస్తున్నాయి. అదే జరిగితే కుల్దీప్ లేదా వాషింగ్టన్ సుందర్ లలో ఒకరు తుది జట్టులోకి రావొచ్చు. ఇక శార్థూల్ ఠాకూర్ ను తప్పించి నితీశ్ రెడ్డిని ఆడించాలన్న అభిప్రాయం వినిపిస్తోంది. మొదటి టెస్టులో శార్థూల్ ఠాకూర్ 1, 4 పరుగులు చేసి అవుటవ్వగా.. బౌలింగ్‌లో రెండు ఇన్నింగ్స్‌లలో కలిపి కేవలం రెండు వికెట్లు మాత్రమే తీశాడు.ఒకవేళ నితీష్ కుమార్ రెడ్డి జట్టులోకి వస్తే టీమిండియా మిడిలార్డర్ మరింత బలంగా అయ్యే అవకాశం ఉంది. మిడిలార్డర్‌లో కరుణ్ నాయర్, నితీష్ కుమార్ రెడ్డి, రవీంద్ర జడేజా ఆడనున్నారు. ఈ ముగ్గురిలో ఎవరు నిలదొక్కుకున్నా భారీ స్కోర్ వచ్చే అవకాశం ఉంటుంది.

Also Read: Pawan Kalyan: ప‌వ‌న్ క‌ళ్యాణ్‌పై క్రిమిన‌ల్ కేసు.. న‌మోదైన సెక్ష‌న్లు ఇవే!

మరోవైపు ఇంగ్లాండ్.. రెండో టెస్టు కోసం తమ తుది జట్టును ప్రకటించింది. తొలి టెస్టులో ఆడిన కాంబినేషన్ తోనే బరిలోకి దిగుతోంది. ఇటీవల కౌంటీల్లో ఆడి టెస్టు జట్టులోకి వచ్చిన పేసర్ జోఫ్రా ఆర్చర్‌కు తుది జట్టులో చోటు కల్పించలేదు.ఇక మ్యాచ్ కు ఆతిథ్యమిస్తున్న ఎడ్జ్ బాస్టన్ పిచ్ మొదటి రెండురోజులు పేసర్లకు అనుకూలిస్తుందని అంచనా.. ఈ గ్రౌండ్ లో భారత్ రికార్డులు ఏమాత్రం బాగాలేవు. ఇక్కడ ఒక్క మ్యాచ్ కూడా టీమిండియా గెలవలేదు. ఇప్పటి వరకు ఎడ్జ్‌బాస్టన్ స్టేడియంలో భారత్ 8 మ్యాచ్‌లు ఆడింది. అందులో ఏడు మ్యాచ్‌లు ఓడిపోగా ఒక్క మ్యాచ్ డ్రా అయింది.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • 2nd Test Preview
  • england
  • gambhir
  • India vs England
  • sports news
  • TeamIndia

Related News

MS Dhoni

ఐపీఎల్ 2026.. నేడైనా ధోనీ మైదానంలోకి దిగుతాడా?

ముంబై- చెన్నై మ్యాచ్ సందర్భంగా సీఎస్‌కే బ్యాటింగ్ కోచ్ మైకేల్ హస్సీ ధోనీ రాకపై స్పష్టతనిచ్చారు. ధోనీ కేవలం బ్యాటర్‌గా కాకుండా, వికెట్ కీపర్ బ్యాటర్‌గానే జట్టులోకి వస్తారని ఆయన తెలిపారు.

  • IPL History

    ఐపీఎల్ 2026.. ఒకే రోజు 986 ప‌రుగులు!!

  • Former PCB CEO Wasim Khan Quits ICC

    ICC: ఐసీసీ కీలక పదవి నుంచి వైదొలిగిన పీసీబీ మాజీ సీఈవో వాసిమ్ ఖాన్

  • Hyderabad vs Delhi

    నేడు ర‌స‌వ‌త్త‌ర పోరు.. స‌న్‌రైజ‌ర్స్ విజ‌యాల‌కు ఢిల్లీ బ్రేక్ వేయ‌గ‌ల‌దా?

  • Chris Gayle

    కొత్త జట్టుకు యజమానిగా క్రిస్ గేల్!

Latest News

  • Tollywood : డైరెక్టర్ మెహర్ ఇంట పెళ్లి సందడి..చిరు , కేటీఆర్ హాజరు !!

  • Free Bus : బస్సు ఆపలేదని ఏకంగా డ్రైవర్‌పై దాడి

  • NEET : రేపే NEET అడ్మిట్ కార్డులు విడుదల

  • YCP : సజ్జలకు వైసీపీ బాధ్యతలు?

  • IPL: ధోనీ రికార్డ్ బద్దలుకొట్టిన సంజూ

Trending News

    • ముంబై ఇండియన్స్‌కు కొత్త కెప్టెన్‌?

    • అమెరికా-ఇరాన్ శాంతి చర్చలు విఫలం.. యుద్ధం త‌ప్ప‌దా?

    • కొత్త సిలిండర్ బుకింగ్ రూల్స్.. మే 1 నుండి మారనున్న నిబంధనలు?

    • వైభవ్‌ సూర్యవంశీ ఖాతాలో రికార్డులే రికార్డులు!

    • దాడి త‌ర్వాత మాట్లాడిన ట్రంప్‌.. ఇరాన్‌పై అనుమానాలు?

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd