Sanju Samson: ఓకే ఓవర్‌లో 5 సిక్స్‌లు.. శాంసన్ పేరు మీద అరుదైన రికార్డు
బంగ్లాదేశ్‌తో జరిగిన సిరీస్‌లో తొలి రెండు మ్యాచ్‌ల్లో సంజూ శాంసన్ పెద్దగా రాణించలేదు. రెండో మ్యాచ్‌లో ప్రారంభంలోనే ఔట్ అయిన తర్వాత సంజూ చాలా ట్రోల్ చేయబడ్డాడు.
- By Gopichand Published Date - 11:39 AM, Sun - 13 October 24

Sanju Samson: భారత్-బంగ్లాదేశ్ మధ్య మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో మూడో, చివరి మ్యాచ్ అక్టోబర్ 12న హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో జరిగింది. ఈ మ్యాచ్‌లో సంజూ శాంసన్ తన అద్భుతమైన ఆటతీరుతో ఆకట్టుకున్నాడు. మూడో టీ20 మ్యాచ్‌లో బంగ్లాదేశ్ బౌలర్లను సంజూ (Sanju Samson) ఓ ఆట ఆడుకున్నాడు. ఇది మాత్రమే కాకుండా.. సంజూ ఒకే ఓవర్లో ఐదు వరుస సిక్సర్లు కొట్టాడు. మ్యాచ్ ముగిసిన తర్వాత సంజూ ఐదు సిక్సర్లు కొట్టే రహస్యాన్ని బయటపెట్టి ప్లానింగ్ మొత్తం చెప్పాడు.
సంజూ 5 సిక్సర్లు కొట్టాలని ఎప్పటి నుంచి ప్లాన్ చేస్తున్నాడు?
బంగ్లాదేశ్‌తో జరిగిన సిరీస్‌లో తొలి రెండు మ్యాచ్‌ల్లో సంజూ శాంసన్ పెద్దగా రాణించలేదు. రెండో మ్యాచ్‌లో ప్రారంభంలోనే ఔట్ అయిన తర్వాత సంజూ చాలా ట్రోల్ చేయబడ్డాడు. అయితే తన పేలుడు ఇన్నింగ్స్‌తో సంజు విమర్శకుల నోరు మూయించాడు. మూడో మ్యాచ్‌లో రిషద్ హుస్సేన్ వేసిన ఒక ఓవర్‌లో సంజూ వరుసగా ఐదు సిక్సర్లు బాదాడు. మ్యాచ్ అనంతరం మాట్లాడిన సంజూ.. గత ఏడాది కాలంగా ఒకే ఓవర్లో ఐదు సిక్సర్లు బాదేందుకు ప్రయత్నిస్తున్నానని చెప్పాడు. శాంసన్ ఈ కోరిక బంగ్లాదేశ్ మీద తీరింది.
Also Read: Earthquake: జమ్మూకశ్మీర్‌లో భూకంపం.. రిక్టర్ స్కేల్‌పై 4.3 తీవ్రత నమోదు
6️⃣6️⃣6️⃣6️⃣6️⃣
Sanju Samson, R̶E̶M̶E̶M̶B̶E̶R̶ WE KNOW THE NAME! 🤯#PlayBold #INDvBAN pic.twitter.com/oPOsI60MYL
— Royal Challengers Bengaluru (@RCBTweets) October 12, 2024
సంజూ అద్భుత సెంచరీ చేశాడు
మూడో టీ20 మ్యాచ్‌లో సంజూ శాంసన్ తన టీ20 కెరీర్‌లో తొలి సెంచరీ సాధించాడు. ఈ మ్యాచ్‌లో బ్యాటింగ్ చేసిన అతను కేవలం 47 బంతుల్లో 111 పరుగులు చేశాడు. ఇందులో 11 ఫోర్లు, 8 సిక్సర్లు ఉన్నాయి. ఇది కాకుండా సంజు పేరు మీద ఒక ప్రత్యేక రికార్డు కూడా నమోదైంది. అంతర్జాతీయ టీ20 క్రికెట్‌లో సెంచరీ చేసిన తొలి భారత వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్‌గా సంజూ నిలిచాడు.
భారత్ 3-0తో సిరీస్‌ను కైవసం చేసుకుంది
టెస్టు సిరీస్ తర్వాత టీ20 సిరీస్‌లోనూ బంగ్లాదేశ్‌ను చిత్తు చేసిన టీమిండియా.. సూర్యకుమార్ యాదవ్ సారథ్యంలో టీ20 సిరీస్‌ను భారత్ 3-0తో కైవసం చేసుకుంది. మూడో టీ20లో టీమిండియా 133 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. తన అద్భుతమైన ఆటతీరుతో సంజూ శాంసన్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా ఎంపికయ్యాడు. దీంతో పాటు ప్లేయర్ ఆఫ్ ద సిరీస్‌గా హార్దిక్ పాండ్యా ఎంపికయ్యాడు.