India vs Australia: నేటి నుండి భారత్- ఆస్ట్రేలియా జట్ల మధ్య నాలుగో టెస్ట్.. టాస్ వేయనున్న ప్రధాని మోదీ..!
బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భాగంగా నేడు భారత్- ఆస్ట్రేలియా (India vs Australia) జట్ల మధ్య నాలుగో టెస్టు జరగనుంది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో భారత్-ఆస్ట్రేలియా మధ్య టెస్టు సిరీస్‌లో చివరిదైన నాలుగో మ్యాచ్ నేడు జరగనుంది.
- By Gopichand Published Date - 07:12 AM, Thu - 9 March 23

బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భాగంగా నేడు భారత్- ఆస్ట్రేలియా (India vs Australia) జట్ల మధ్య నాలుగో టెస్టు జరగనుంది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో భారత్-ఆస్ట్రేలియా మధ్య టెస్టు సిరీస్‌లో చివరిదైన నాలుగో మ్యాచ్ నేడు జరగనుంది. ఈ మ్యాచ్‌లో విజయం సాధించడం భారత్‌కు చాలా ముఖ్యం. ఈ మ్యాచ్‌లో గెలిస్తే భారత్ 3-1తో సిరీస్ కైవసం చేసుకోవచ్చు. అలాగే.. ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌లో ఫైనల్‌కు చేరుకుంటుంది. ఈ మ్యాచ్‌లో ఓడిపోతే భారత జట్టు ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌లో ఫైనల్ ఆడేందుకు అదృష్టంపై ఆధారపడి ఉంటుంది.
నాలుగు మ్యాచ్‌ల సిరీస్‌లో తొలి రెండు మ్యాచ్‌లను భారత్ సులువుగా గెలుచుకుంది. అదే సమయంలో మూడో మ్యాచ్‌లో ఓటమి చవిచూడాల్సి వచ్చింది. 4 టెస్టుల సిరీస్ లో భాగంగా ఇప్పటికే 2-1 తేడాతో ఆధిక్యంలో ఉన్న టీమిండియా, ఈ టెస్టు గెలిచి సిరీస్ సొంతం చేసుకోవాలని భావిస్తోంది. అహ్మదాబాద్ వేదికగా ఉదయం 9.30 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది.
Also Read: Sophia Dunkley: ఒకే ఓవర్లో 4,6,6,4,4..ఫాస్టెస్ట్ ఫిఫ్టీ.. వుమెన్స్ ఐపీఎల్‌లో సోఫియా విధ్వంసం
గత మ్యాచ్‌లో భారత బ్యాట్స్‌మెన్ పేలవ ప్రదర్శన కనిపించింది. తొలి ఇన్నింగ్స్‌లో టీమిండియా 109 పరుగులు మాత్రమే చేయగలిగింది. తర్వాతి ఇన్నింగ్స్‌లోనూ ఇదే పరిస్థితి నెలకొంది. రోహిత్ శర్మ నేతృత్వంలోని టీమిండియా 163 పరుగులకు ఆలౌటైంది. ఇలాంటి పరిస్థితుల్లో నాలుగో టెస్టు భారత్‌కు చాలా కీలకం.
స్టీవ్ స్మిత్ సారథ్యంలోని ఇండోర్‌లో ఆస్ట్రేలియా 9 వికెట్ల తేడాతో భారత్‌పై విజయం సాధించింది. ఆస్ట్రేలియా జట్టు తదుపరి గేమ్‌లోనూ అదే ప్రదర్శనను పునరావృతం చేసేందుకు ప్రయత్నిస్తుంది. అహ్మదాబాద్ టెస్టులో గెలిచి సిరీస్‌ను సమం చేసేందుకు ఆస్ట్రేలియా ప్రయత్నిస్తుంది. ప్రస్తుతం సిరీస్‌లో భారత్ 2-1తో ముందంజలో ఉంది. పాట్ కమిన్స్ తన తల్లి అనారోగ్య కారణాలతో ఆస్ట్రేలియాలోనే ఉన్నందున స్మిత్ నాలుగో టెస్టులో ఆస్ట్రేలియాకు నాయకత్వం వహించనున్నాడు.
మ్యాచ్ వీక్షించనున్న భారత్-ఆస్ట్రేలియా ప్రధానులు
నేటి నుంచి ప్రారంభమయ్యే ఈ మ్యాచ్‌ని చూడటానికి భారత ప్రధాని నరేంద్ర మోదీ, ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోనీ అల్బనీస్ కూడా రానున్నారు. అందుకే వారికి కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. భారత్, ఆస్ట్రేలియా ప్రధాన మంత్రుల భద్రత కోసం 3000 మందికి పైగా పోలీసులను మోహరించారు. ఈ సందర్భంగా పలువురు పోలీసులు కూడా సివిల్ డ్రెస్‌లో మైదానంలోకి రానున్నారు. ఈ భద్రతా వ్యవస్థలో పలువురు మహిళా పోలీసులను కూడా విధుల్లోకి తీసుకున్నారు. భారతదేశం, ఆస్ట్రేలియా ప్రధాన మంత్రుల భద్రత కోసం పరిపాలన కూడా స్నిఫర్ డాగ్‌లను మోహరించింది. అలాగే, ఈ మ్యాచ్‌లో మోదీ టాస్ వేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. మోదీ కాసేపు కామెంటరీ కూడా చెబుతారని సమాచారం. మ్యాచ్‌కు ముందు ప్రధానులు ఇద్దరు బంగారు పూత పూసిన గోల్ఫ్ కారులో స్టేడియంలో తిరుగుతారని సమాచారం.

Related News

Cheetah Sasha : కునో నేషనల్ పార్క్‌లో నమీబియా ఆడ చిరుత సాషా మృతి
భారత్ లో చిరుతలకు(Cheetah Sasha) పునరావాసం కల్పించాలన్న ప్రతిష్టాత్మక ప్రాజెక్టుకు పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. నమీబియాకు చెందిన సాశా ఆడ చిరుత (Cheetah Sasha)కునో నేషనల్ పార్క్ లో తన ఎన్ క్లోజర్ లో చనిపోయింది. నమీబియా నుంచి మొదట్లో మధ్యప్రదేశ్‌కు వచ్చిన 8 చిరుతల్లో చిరుత సాషా ఒకటి. జనవరి 24న సాషా ఆరోగ్యం అకస్మాత్తుగా క్షీణించింది. చిరుత డీహైడ్రేషన్, కిడ్నీ సమస్యతో బాధపడుతోంది. వైద్య బృందం