IND vs AUS ODI Series 2023: నేడు ఆస్ట్రేలియాతో టీమిండియా తొలి వన్డే.. మొదటి మ్యాచ్ కు రోహిత్ దూరం..!
నేటి నుంచి భారత్-ఆస్ట్రేలియా (IND vs AUS) మూడు వన్డేల సిరీస్ మొదలవుతోంది. ముంబై వాంఖడే స్టేడియంలో మధ్యాహ్నం 1:30 గంటలకు తొలి వన్డే ప్రారంభంకానుంది. హార్దిక్ ప్యాండా తొలిసారి వన్డే కెప్టెన్‌గా బాధ్యతలు చేపడుతున్నాడు.
- By Gopichand Published Date - 06:40 AM, Fri - 17 March 23

నేటి నుంచి భారత్-ఆస్ట్రేలియా (IND vs AUS) మూడు వన్డేల సిరీస్ మొదలవుతోంది. ముంబై వాంఖడే స్టేడియంలో మధ్యాహ్నం 1:30 గంటలకు తొలి వన్డే ప్రారంభంకానుంది. హార్దిక్ ప్యాండా తొలిసారి వన్డే కెప్టెన్‌గా బాధ్యతలు చేపడుతున్నాడు. విశాఖలో ఈ నెల 19న భారత్-ఆస్ట్రేలియా జట్ల మధ్య రెండో వన్డే జరగనుంది.
భారత్-ఆస్ట్రేలియా మధ్య జరిగిన టెస్టు సిరీస్‌లో టీమిండియా 2-1 తేడాతో విజయం సాధించింది. నేటి నుంచి వన్డే సిరీస్ వంతు వచ్చింది. ఈ ఏడాది జరగనున్న ప్రపంచకప్‌కు ముందు ఈ సిరీస్‌ను అత్యంత కీలకంగా పరిగణిస్తున్నారు. ఈ మూడు మ్యాచ్‌ల సిరీస్‌కి సంబంధించి టీమిండియా ముందు అనేక సవాళ్లు ఉన్నాయి. ఆస్ట్రేలియాతో భారత్ 3 మ్యాచ్‌ల వన్డే సిరీస్ ఆడాల్సి ఉంది. తొలి మ్యాచ్ మార్చి 17న ముంబైలో, రెండో మ్యాచ్ మార్చి 19న విశాఖపట్నంలో, మూడో మ్యాచ్ మార్చి 22న చెన్నైలో జరగనుంది.
తొలి మ్యాచ్‌లో కెప్టెన్ రోహిత్ శర్మ అందుబాటులో ఉండడు. కుటుంబ కారణాల వల్ల మొదటి వన్డేకు దూరంగా ఉన్నాడు. ఇలాంటి పరిస్థితుల్లో తొలి మ్యాచ్‌లో హార్దిక్ పాండ్యా కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టనున్నాడు. అయితే రెండో, మూడో వన్డేల్లో రోహిత్ శర్మ పునరాగమనం చేయనున్నాడు. భారత్ మాత్రమే కాకుండా ఆస్ట్రేలియా కూడా కెప్టెన్ మార్చింది. పాట్ కమిన్స్ తన తల్లి మరణించినప్పటి నుండి భారతదేశానికి తిరిగి రాలేదు, ఈ సందర్భంలో స్టీవ్ స్మిత్ విజిటింగ్ టీమ్‌కు కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు.
Also Read: Virat Kohli: విరాట్ కోహ్లీ 110 సెంచరీలు కొట్టేస్తాడు : పాక్ క్రికెటర్ షోయబ్ అక్తర్
సిరీస్ ప్రారంభానికి ముందు శ్రేయాస్ అయ్యర్ గాయపడ్డాడు. అతని స్థానంలో ఇంకా ఎవరినీ భర్తీ చేయలేదు. వన్డేల్లో టీమ్ ఇండియా నంబర్ 1 జట్టుగా ఉండగా, ఆస్ట్రేలియా నంబర్ 2లో ఉంది. ఇరు జట్ల మధ్య కేవలం 2 పాయింట్ల తేడా మాత్రమే ఉంది. ఆస్ట్రేలియా సిరీస్ గెలిస్తే ర్యాంకింగ్ మారవచ్చు. ఇరు జట్ల మధ్య జరిగిన చివరి వన్డే సిరీస్‌ను పరిశీలిస్తే ఇందులో ఆస్ట్రేలియా గెలిచింది. ఈ సిరీస్ ఆస్ట్రేలియాలో జరిగింది, ఇందులో భారత్ 1-2 తేడాతో ఓటమిని చవిచూడాల్సి వచ్చింది.
భారత్, ఆస్ట్రేలియా మధ్య జరిగిన ODI మ్యాచ్‌ల రికార్డును పరిశీలిస్తే ఇప్పటివరకు రెండు జట్ల మధ్య మొత్తం 143 మ్యాచ్‌లు జరిగాయి. వాటిలో 80 ఆస్ట్రేలియా, 53 టీమిండియా గెలిచాయి. భారత్‌లో జరిగిన వన్డే మ్యాచ్‌లను పరిశీలిస్తే ఇరు జట్లు మొత్తం 64 సార్లు ముఖాముఖి తలపడగా, ఇక్కడ ఆస్ట్రేలియా 30, భారత్ 29 వన్డే మ్యాచ్‌లు గెలిచాయి.

Related News

WPL Final: తొలి టైటిల్ చిక్కేదెవరికి? ఢిల్లీ, ముంబై మధ్య ఫైనల్ ఫైట్
మహిళల ఐపీఎల్ తొలి సీజన్ ఫైనల్ కు కౌంట్ డౌన్ మొదలైంది. ఆదివారం ఢిల్లీ క్యాపిటల్స్, ముంబై ఇండియన్స్ మధ్య టైటిల్ పోరు జరగబోతోంది.