HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Sports
  • >India To Announce World Cup 2023 Squad Today

World Cup India Squad: నేడు భారత ప్రపంచకప్‌ జట్టు ప్రకటన..?

భారత్‌లో జరగనున్న ఐసీసీ వన్డే ప్రపంచకప్ కోసం క్రికెట్ ప్రేమికులంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ మెగా ఈవెంట్ కోసం 15 మంది సభ్యులతో కూడిన భారత ప్రాథమిక జట్టు (World Cup India Squad)ను సెప్టెంబర్ 5న ప్రకటించనున్నారు.

  • Author : Gopi Date : 05-09-2023 - 9:41 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
India Squad
TEAMINDIA

World Cup India Squad: భారత్‌లో జరగనున్న ఐసీసీ వన్డే ప్రపంచకప్ కోసం క్రికెట్ ప్రేమికులంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ మెగా ఈవెంట్ కోసం 15 మంది సభ్యులతో కూడిన భారత ప్రాథమిక జట్టు (World Cup India Squad)ను సెప్టెంబర్ 5న ప్రకటించనున్నారు. ఆసియా కప్ 2023 కోసం జట్టును ప్రకటించిన సమయంలో ఈ 18 మంది ఆటగాళ్లలో 15 మందిని ఎంపిక చేస్తామని చీఫ్ సెలక్టర్ స్పష్టం చేశారు.

ది ఇండియన్ ఎక్స్‌ప్రెస్ కథనం ప్రకారం.. టీమ్ ఇండియా అధికారిక ప్రకటనకు ముందే సీనియర్ సెలక్షన్ కమిటీ 15 మంది ఆటగాళ్ల పేర్లను ఖరారు చేసింది. ప్రపంచకప్ జట్టు నుంచి తొలగించబడిన ముగ్గురు ఆటగాళ్లలో సంజు శాంసన్, తిలక్ వర్మ, ప్రసిద్ధ్ కృష్ణ ఉన్నారు. ఈ ముగ్గురు ఆటగాళ్లు ఆసియా కప్ 2023 కోసం టీమ్ ఇండియాలో భాగం అయ్యారు.

ఆస్ట్రేలియాతో సహా కొన్ని ప్రధాన దేశాలు 2023 వన్డే ప్రపంచ కప్ కోసం తమ 15 మంది సభ్యుల జట్టును ఇప్పటికే ప్రకటించాయి. అదే సమయంలో అందరి చూపు ఇప్పుడు ఆతిథ్య దేశం భారత్‌పైనే ఉంది. దీని తర్వాత అన్ని జట్లకు సెప్టెంబర్ 27 వరకు ఎటువంటి ఆమోదం లేకుండా తమ జట్టులో మార్పులు చేయడానికి అవకాశం లభిస్తుంది. అయితే దీని తర్వాత జట్టులో ఏదైనా మార్పు కోసం ఈవెంట్ టెక్నికల్ కమిటీ నుండి అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది.

Also Read: Rohit Sharma Record: ఆసియా కప్‌లో రోహిత్ అరుదైన రికార్డు.. ఒకే ఇన్నింగ్స్‌లో అత్యధిక సిక్సర్లు కొట్టిన భారత ఆటగాడిగా రోహిత్ శర్మ..!

ఈ ఆటగాళ్లకు జట్టులో చోటు..?

వన్డే ప్రపంచకప్‌కు 15 మంది సభ్యులతో కూడిన భారత్ అంచనా జట్టు గురించి మాట్లాడినట్లయితే.. కెప్టెన్ రోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, సూర్యకుమార్ యాదవ్‌లను బ్యాట్స్‌మెన్‌గా చేర్చవచ్చు. లోకేశ్ రాహుల్, ఇషాన్ కిషన్ ఇద్దరు వికెట్ కీపర్లుగా జట్టులోకి రావడం ఖాయం. దీని తర్వాత ఆల్ రౌండర్ ఆటగాళ్లలో రవీంద్ర జడేజా, హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్ లను చూడవచ్చు. ఫాస్ట్ బౌలింగ్ బాధ్యత జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్, శార్దూల్ ఠాకూర్ భుజాలపై ఉంటుంది. కుల్దీప్ యాదవ్ స్పిన్‌లో స్థానం పొందడం ఖాయం.

ODI ప్రపంచ కప్ 2023 కోసం భారత జట్టు

రోహిత్ శర్మ (కెప్టెన్), శుభమన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, సూర్యకుమార్ యాదవ్, కేఎల్ రాహుల్ (వికెట్ కీపర్), ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా (వైస్ కెప్టెన్), రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, మహ్మద్ సిరాజ్, శార్దూల్ ఠాకూర్, మహ్మద్ షమీ, జస్ప్రీత్ బుమ్రా.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • ICC World Cup 2023
  • rohit sharma
  • team india
  • virat kohli
  • world cup 2023
  • World Cup India Squad

Related News

Vaibhav Suryavanshi to make his debut in the second T20 between India and England today!

vaibhav suryavanshi: నేడు భారత్-ఇంగ్లాండ్ రెండో టీ20లో.. వైభవ్ సూర్యవంశీ అరంగేట్రం.!

ఇంగ్లండ్‌తో ఇవాళ జరగనున్న రెండో టీ20 మ్యాచ్‌లో 15 ఏళ్ల యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ టీమిండియా తరఫున అరంగేట్రం చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ‘కొత్త అధ్యాయం’ అనే క్యాప్షన్‌తో అతను ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టిన ఒక స్టోరీ ఈ ఊహాగానాలకు మరింత బలం చేకూర్చింది. యూకే పర్యటనలో భాగంగా ఐర్లాండ్‌తో జరిగిన రెండు టీ20లు, ఇంగ్లండ్‌తో వర్షం కారణంగా రద్దయిన తొలి టీ20లోనూ వైభవ్ బెంచ్‌కే పరి

  • India vs. Sri Lanka Test series schedule...

    IND vs SL: ఇండియా, శ్రీలంక టెస్ట్ సిరీస్ షెడ్యూల్..

  • Indian women's team announced for Asian Games

    Asian Games 2026: ఏషియన్ గేమ్స్‌కు భారత మహిళల జట్టు ప్రకటన

Latest News

  • Tambulam: తాంబూలం ఎందుకు ఇస్తారు? ఏ సందర్భాల్లో ఇస్తారు? వాటి ప్రత్యేకత ఏంటి?

  • CM Revanth: టూరిజం రంగంలో భారీ మార్పులు.. సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు

  • Skipping Dinner: రాత్రి భోజనం చేయలేదా? ఈ అనారోగ్య సమస్యలు తప్పవు.. జాగ్రత్త!!

  • Ravan: మరో కేసులో యూట్యూబర్‌ రావణ్‌ మళ్లీ అరెస్టు

  • Stress Management Tips: స్ట్రెస్ మేనేజ్‌మెంట్ కోసం.. నిద్రలేమిని అరికట్టే 7 టిప్స్

Trending News

    • Kissing Day: ఆవేశపూరితమైన ముద్దు నిమిషానికి 6.4 కేలరీల ఖర్చు చేస్తుంది

    • Kalyan Ram : సంక్రాంతి 2027కు సిద్ధమవుతున్న అనిల్ రావిపూడి.. కళ్యాణ్ రామ్ ఫస్ట్ లుక్‌ పోస్టర్ విడుదల !

    • ఇరాక్‌లో భారీ అవినీతి తిమింగలం! ఆ ఎంపీ ఇంట్లో బంగారు లోదుస్తులు లభ్యం..

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd