HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Sports
  • >India Sweep Series After Dramatic Double Super Over

IND vs AFG 3rd T20I: టై…మళ్లీ టై…ఇండియా విన్ పోరాడి ఓడిన ఆఫ్గనిస్తాన్…

కొత్త ఏడాదిలో టీమిండియా తొలి సీరీస్ ను ఖాతాలో వేసుకుంది. ఉత్కంఠ భరితంగా సాగిన చివరి టీ ట్వంటీలో ఆఫ్గనిస్తాన్ పై రెండో సూపర్ ఓవర్ లో గెలుపొందింది. తద్వారా మూడు మ్యాచ్ ల సీరీస్ ను స్వీప్ చేసింది.

  • Author : Praveen Aluthuru Date : 17-01-2024 - 11:31 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
IND vs AFG
IND vs AFG

IND vs AFG 3rd T20I: కొత్త ఏడాదిలో టీమిండియా తొలి సీరీస్ ను ఖాతాలో వేసుకుంది. ఉత్కంఠ భరితంగా సాగిన చివరి టీ ట్వంటీలో ఆఫ్గనిస్తాన్ పై రెండో సూపర్ ఓవర్ లో గెలుపొందింది. తద్వారా మూడు మ్యాచ్ ల సీరీస్ ను స్వీప్ చేసింది. బెంగుళూరు చిన్నస్వామి స్టేడియం వేదికగా జరిగిన ఈ మ్యాచ్ లో పరుగుల వరద పారింది. మొదట బ్యాటింగ్ చేసిన టీమిండియా 22 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. జైస్వాల్ , కోహ్లీ , సంజూ, దూబే నిరాశ పరిచారు. ఈ దశలో రోహిత్-రింకూ విధ్వంసకర బ్యాటింగ్‌తో ఆదుకున్నారు. ఐదో వికెట్‌కు అజేయంగా 190 పరుగుల రికార్డ్ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. వీరిద్దరూ చిన్నస్వామి స్టేడియంలో సిక్సర్ల వర్షం కురిపించారు.

41 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న రోహిత్.. ఆకాశమే హద్దుగా చెలరేగాడు. వరుస బౌండరీలతో అఫ్గాన్ బౌలర్లపై విరుచుకుపడ్డాడు. అజ్మతుల్లా వేసిన 19వ ఓవర్‌లో 6, 4, 4 బాది 64 బంతుల్లో సెంచరీ పూర్తి చేసుకున్నాడు. టీ ట్వంటీల్లో రోహిత్ శర్మకు ఇది ఐదో సెంచరీ. దీంతో భారత్ 20 ఓవర్లలో 4 వికెట్లకు 212 పరుగులు చేసింది. 69 బంతుల్లో 11 ఫోర్లు, 8 సిక్సర్లతో 121 చేయగా..రింకూ సింగ్ కూడా హాఫ్ సెంచరీ చేశాడు. 39 బంతుల్లో 2 ఫోర్లు, 6 సిక్స్‌లతో 69 రన్స్ చేసి నాటౌట్ గా నిలిచాడు.

ఛేజింగ్ కు అనుకూలించే బెంగుళూరు పిచ్ పై ఆఫ్గనిస్తాన్ కూడా ధాటిగా ఆడింది. వికెట్లు పడుతున్నా ఆ జట్టు బ్యాటర్లు భారీ షాట్లతో దుమ్మురేపారు. టాపార్డర్ లో ముగ్గురు హాఫ్ సెంచరీలు చేయగా…మధ్యలో పుంజుకున్న భారత్ బౌలర్లు వరుస వికెట్లు తీసి కట్టడి చేశారు. అయితే గుల్బాడిన్ మెరుపు హాఫ్ సెంచరీ భారత్ విజయాన్ని అడ్డుకుంది. చివరి ఓవర్ లో విజయం కోసం 19 రన్స్ చేయాల్సి ఉండగా…ముకేష్ కుమార్ ఒత్తిడి లోనయ్యాడు. ఫలితంగా ఆఫ్గనిస్తాన్ 18 రన్స్ తో మ్యాచ్ ని టై చేసింది.

ఫలితం కోసం సూపర్ ఓవర్ నిర్వహించగా…మొదట బ్యాటింగ్ కు దిగిన ఆఫ్గనిస్తాన్ 16 పరుగులు చేసింది. తర్వాత కెప్టెన్ రోహిత్ శర్మ సిక్సర్లతో విరుచుకుపడినా చివరి బంతికి ఒక పరుగే రావడంతో సూపర్ ఓవర్ కూడా టైగా ముగిసింది. రెండో సూపర్ ఓవర్ లో భారత్ గెలిచింది. ఈ విజయంతో మూడు మ్యాచ్ ల సీరీస్ ను 3-0 తో స్వీప్ చేసింది.

Also Read: Rythu Bandhu: రైతులకు గుడ్ న్యూస్.. నెలాఖరులోగా రైతు బంధు


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • 3rd T20I
  • Afghanistan
  • IND vs AFG
  • india
  • super over

Related News

Gas Effect 4yres

War Effect : మరో నాలుగేళ్లు గ్యాస్ , పెట్రోల్ కష్టాలు తప్పవా ?

ఇరాన్-అమెరికా మధ్య యుద్ధం ముగిసినా, దాని తాలూకు ఆర్థిక గాయాలు మానడానికి మరో రెండు నుండి నాలుగేళ్ల సమయం పడుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు

    Latest News

    • Rupee vs Dollar: స్వల్పంగా బలపడిన రూపాయి

    • Condom Shortage: యుద్ధం ఎఫెక్ట్.. భారీగా పెరగనున్న కండోమ్ ధరలు

    • New Pensions : కొత్త పెన్షన్ల పై తీపి కబురు అందించిన తెలంగాణ సర్కార్

    • Stock Market Crash: భారీ నష్టాల్లో స్టాక్ మార్కెట్

    • Mee-Seva Charges Hike : సామాన్యులపై పెను భారం వేసిన తెలంగాణ ప్రభుత్వం

    Trending News

      • అల‌ర్ట్‌.. నేటి నుంచి కీల‌క మార్పులు!

      • శ్రేయస్ అయ్యర్‌పై బీసీసీఐ జరిమానా.. గ‌తేడాది కూడా ఇదే త‌ప్పు!

      • Pemmasani Chandrasekhar: 29 వేల మంది రైతులకు జరిగిన అన్యాయం ఇది.. కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్

      • Capital Amaravati: ఏపీకి గుడ్ న్యూస్.. లోక్‌సభలో అమరావతి బిల్లు ఆమోదం.

      • AP Capital: అమరావతి రైతుల కన్నీళ్లకు పునాది.. కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd