India vs Pakistan : ఇండియా – పాక్ మ్యాచ్.. హాస్పిటల్‌లో చేరుతున్న ఫ్యాన్స్
అహ్మదాబాద్‌లో అక్టోబర్ 15న నరేంద్ర మోదీ క్రికెట్ స్టేడియంలో ఇండియా, పాకిస్తాన్ (India vs Pakistan) తలపడనున్నాయి.
- Author : Praveen Aluthuru
Date : 22-07-2023 - 3:55 IST
Published By : Hashtagu Telugu Desk
India vs Pakistan : వరల్డ్ కప్ దగ్గర పడుతున్నా కొద్దీ ఉత్కంఠ పెరుగుతుంది. వచ్చే ప్రపంచం కప్ లక్ష్యంగా భారత్ సన్నద్ధం అవుతుంది. ప్రతిష్ఠాత్మక టోర్నీలో దాయాదుల పోరును ప్రత్యక్షంగా వీక్షించేందుకు ఫ్యాన్స్ తెగ ఆసక్తి చూపిస్తున్నారు. అహ్మదాబాద్‌లో అక్టోబర్ 15న నరేంద్ర మోదీ క్రికెట్ స్టేడియంలో ఇండియా, పాకిస్తాన్ తలపడనున్నాయి. పాక్ చివరి సారిగా ఇండియా (India) గడ్డపై 2016 టీ20 వరల్డ్ కప్ లో ఆడింది. 2021 టీ20 వరల్డ్ కప్ ఇండియాలో జరగాల్సి ఉంది. కానీ కరోనా కారణంగా ఆ టోర్నీని యూఏఈలో నిర్వహించారు.
చాన్నాళ్ల తరువాత పాక్ భారత్ తో మ్యాచ్ ఆడేందుకు ఇండియా (India) వస్తుండటంతో అహ్మదాబాద్‌లో హోటల్ రూమ్స్‌కి విపరీతమైన డిమాండ్ పెరిగింది. గతంలో 2 నుంచి 3వేలు ఉండే రూమ్ రెంట్ ఇప్పుడు 50 వేల నుంచి లక్షకు చేరింది. దీంతో క్రికెట్ లవర్స్ హోటల్స్ కాకుండా హాస్పిటల్ లో బెడ్స్ బుక్ చేసుకుంటున్నారు. హాస్పిటల్ బెడ్స్ కు ఆ ఒక్క రోజు వసతి కోసం 5వేల నుంచి రూ.30 వేల వరకూ డిమాండ్ చేస్తున్నారు. ఆహారంతోపాటు పూర్తి మెడికల్ చెకప్ లాంటి వసతులు కూడా ఇస్తున్నారు. హోటల్ గదుల్లో వేలకువేలు పోసి రూమ్ తీసుకోవడం కంటే హాస్పటల్ బెడ్స్ బెటర్ గా ఫిలవుతున్నారు. ప్రస్తుతం అహ్మదాబాద్‌లోని ప్రైవేట్ ఆసుపత్రుల్లో బెడ్స్‌కి విపరీతంగా గిరాకీ పెరిగింది.
ఇకపోతే అక్టోబర్ 5 నుంచి నవంబర్ 19 వరకు జరగనున్న మెగా సమరంలో మొత్తం 48 మ్యాచ్ లు జరుగుతాయి. అక్టోబర్ 5న డిపెండింగ్ చాంపియన్ ఇంగ్లండ్, రన్నరప్ న్యూజిలాండ్ మధ్య మొదటి మ్యాచ్ జరుగుతుంది.
Also Read: T-Congress Leaders : టీ కాంగ్రెస్ అభ్యర్థులు వీళ్లే.. లీకైన లిస్ట్