India Beat West Indies: టీమిండియా ఘన విజయం.. 2-1 తేడాతో సిరీస్ కైవసం..!
వెస్టిండీస్‌తో జరిగిన మూడో వన్డేలో భారత్ (India Beat West Indies) ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో హార్దిక్ పాండ్యా నేతృత్వంలోని భారత జట్టు 200 పరుగుల తేడాతో వెస్టిండీస్‌ను ఓడించింది.
- By Gopichand Published Date - 06:23 AM, Wed - 2 August 23

India Beat West Indies: వెస్టిండీస్‌తో జరిగిన మూడో వన్డేలో భారత్ India Beat West Indies) ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో హార్దిక్ పాండ్యా నేతృత్వంలోని భారత జట్టు 200 పరుగుల తేడాతో వెస్టిండీస్‌ను ఓడించింది. తద్వారా మూడు వన్డేల సిరీస్‌ను 2-1 తేడాతో టీమిండియా కైవసం చేసుకుంది. భారత్ 351 పరుగులకు సమాధానంగా వెస్టిండీస్ ఇన్నింగ్స్ 151 పరుగులకే కుప్పకూలింది.
వెస్టిండీస్ తరఫున గూడకేశ్ మోతే 34 బంతుల్లో 39 పరుగుల అత్యధిక ఇన్నింగ్స్‌ను సాధించాడు. కాగా ఏడుగురు వెస్టిండీస్ బ్యాట్స్‌మెన్ రెండంకెల స్కోరును దాటలేకపోయారు. అదే సమయంలో భారత్ తరఫున శార్దూల్ ఠాకూర్ అత్యధికంగా 4 వికెట్లు పడగొట్టాడు. ముఖేష్ కుమార్ 3 వికెట్లు అందుకున్నాడు. కుల్దీప్ యాదవ్ 2 వికెట్లు పడగొట్టాడు. జయదేవ్ ఉనద్కత్ దాదాపు 10 ఏళ్ల తర్వాత భారత్ తరఫున వన్డే ఆడి 1 వికెట్ అందుకున్నాడు.
Also Read: Uppal Stadium: వరల్డ్ కప్ కు ముస్తాబవుతున్న ఉప్పల్ స్టేడియం, 2.5 కోట్లతో ప్రత్యేక వసతులు
తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా
అంతకుముందు టాస్ గెలిచిన వెస్టిండీస్ కెప్టెన్ షాయ్ హోప్ బౌలింగ్ ఎంచుకున్నాడు. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన టీమిండియా నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్లకు 351 పరుగులు చేసింది. భారత ఓపెనర్ శుభ్‌మన్ గిల్ అత్యధిక పరుగులు చేశాడు. శుభ్‌మన్ గిల్ 92 బంతుల్లో 85 పరుగులతో ఇన్నింగ్స్ ఆడాడు. అతని ఇన్నింగ్స్‌లో 11 ఫోర్లు బాదాడు. ఇషాన్ కిషన్ 64 బంతుల్లో 77 పరుగులు చేశాడు. అతని ఇన్నింగ్స్‌లో 8 ఫోర్లు, 3 సిక్సర్లు బాదాడు. దీంతో పాటు కెప్టెన్ హార్దిక్ పాండ్యా 52 బంతుల్లో 4 ఫోర్లు, 5 సిక్సర్ల సాయంతో 70 పరుగులు చేసి నాటౌట్ గా వెనుదిరిగాడు. అదే సమయంలో సంజు శాంసన్ 41 బంతుల్లో 51 పరుగులు చేశాడు.
ముఖ్యంగా ఈ సిరీస్‌లోని తొలి మ్యాచ్‌లో భారత్ 5 వికెట్ల తేడాతో వెస్టిండీస్‌ను ఓడించింది. అయితే రెండో మ్యాచ్‌లో వెస్టిండీస్ అద్భుతంగా పునరాగమనం చేసింది. సిరీస్‌లోని రెండో మ్యాచ్‌లో వెస్టిండీస్ 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. అయితే మూడో, చివరి మ్యాచ్‌లో విజయం సాధించిన భారత జట్టు 2-1తో సిరీస్‌ను కైవసం చేసుకుంది. ఇప్పుడు టీ20 సిరీస్‌లో ఇరు జట్లు ముఖాముఖి తలపడనున్నాయి.