HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Sports
  • >India Beat Bangaldesh To Inch Towards Semi Final Berth In T20 Wc

India Beat Bangladesh: టీ ట్వంటీ ప్రపంచకప్ సెమీస్‌కు చేరువైన భారత్

టీ ట్వంటీ ప్రపంచకప్‌ సెమీఫైనల్ రేస్ ఆసక్తికరంగా సాగుతోంది. ఉత్కంఠభరితంగా సాగిన పోరులో భారత్ బంగ్లాదేశ్‌పై విజయం సాధించింది.

  • Author : Naresh Kumar Date : 02-11-2022 - 5:57 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
team india
team india

టీ ట్వంటీ ప్రపంచకప్‌ సెమీఫైనల్ రేస్ ఆసక్తికరంగా సాగుతోంది. ఉత్కంఠభరితంగా సాగిన పోరులో భారత్ బంగ్లాదేశ్‌పై విజయం సాధించింది. వర్షం అంతరాయం కలిగించడంతో మ్యాచ్ మలుపులు తిరుగుతూ సాగింది. బంగ్లా బ్యాటర్లు చివరి వరకూ టెన్షన్ పెట్టినా టీమిండియానే గెలిచింది. ఈ విజయంతో భారత్ సెమీస్‌కు చేరువైంది. మొదట బ్యాటింగ్‌కు దిగిన టీమిండియా భారీస్కోర్ చేసింది. 185 పరుగుల టార్గెట్‌ను బంగ్లాదేశ్ ముందుంచింది. కెప్టెన్ రోహిత్ శర్మ నిరాశపరిచినా… మరో ఓపెనర్ కెఎల్ రాహుల్ ఫామ్‌లోకి వచ్చాడు. కోహ్లీతో కలిసి రెండో వికెట్‌కు 67 పరుగులు జోడించాడు. గత మ్యాచ్‌లలో పూర్తిగా విఫలమైన రాహుల్ బంగ్లాపై మాత్రం దూకుడు ఆడి 32 బంతుల్లోనే 4 సిక్సర్లు, 3 ఫోర్లతో 50 రన్స్ చేశాడు. అటు విరాట్ కోహ్లీ కూడా తన సూపర్ ఫామ్ కొనసాగిస్తూ మరో హాఫ్ సెంచరీ సాధించాడు. సూర్యకుమార్ యాదవ్ 16 బంతుల్లో 30 , కోహ్లీ 44 బంతుల్లోనే 64 పరుగులు చేశాడు.

భారత్ అవకాశాలను దెబ్బతీయడమే లక్ష్యంగా ఆడిన బంగ్లాదేశ్ పవర్ ప్లేలో రెచ్చిపోయింది. ఓపెనర్లు లిట్టన్ దాస్ బౌండరీలతో విరుచుకుపడ్డాడు. వర్షాన్ని దృష్టిలో పెట్టుకుని వ్యూహాత్మకంగా ఆడిన లిట్టన్ దాస్ భారీ షాట్లతో రెచ్చిపోయాడు. అయితే వర్షం కారణంగా మ్యాచ్ నిలిచిపోయే సమయానికి బంగ్లాదేశ్ 7 ఓవర్లలో 66 పరుగులు చేసింది. ఆ సమయానికి బంగ్లా డక్‌వర్త్ లూయీస్ ప్రకారం 17 పరుగులే ఎక్కువ స్కోరే చేసింది. తర్వాత వర్షం తగ్గడం మ్యాచ్ తిరిగి ఆరంభమైంది. బంగ్లాదేశ్ 16 ఓవర్లలో 151 పరుగులుగా టార్గెట్ నిర్ణయించారు. తర్వాత భారత బౌలర్లు బంగ్లా జోరుకు బ్రేక్ వేశారు. అయితే వికెట్లు కోల్పోతున్నా బంగ్లా బ్యాటర్లు చివరి వరకూ పోరాడారు. దీంతో మ్యాచ్ ఉత్కంఠగా సాగింది. చివరి ఓవర్‌ను అర్షదీప్‌సింగ్‌ అద్భుతంగా బౌలింగ్ చేసి జట్టును గెలిపించాడు. ఈ విజయంతో భారత్ పాయింట్ల పట్టికలో టాప్ ప్లేస్‌కు చేరుకుని సెమీస్ బెర్తును దాదాపుగా ఖరారు చేసుకుంది.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • india beat bangladesh
  • T20 world cup
  • virat kohli
  • World Cup 2022

Related News

Vijay Mallya Critics Who Laughed at His RCB Investment

Vijay Mallya: నాడు పెట్టిన పెట్టుబడికి నన్ను చూసి చాలా మంది నవ్వుకున్నారు: విజ‌య్ మాల్యా

Royal Challengers Bangalore  ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) చరిత్రలోనే అత్యంత విలువైన ఫ్రాంచైజీగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) సరికొత్త రికార్డు సృష్టించింది. ఆదిత్య బిర్లా గ్రూప్ నేతృత్వంలోని కన్సార్టియం ఏకంగా 1.78 బిలియన్ డాలర్లకు (సుమారు రూ.16,500 కోట్లు) ఈ ఫ్రాంచైజీని కొనుగోలు చేసింది. ఈ చారిత్రక ఒప్పందంపై ఆర్సీబీ మాజీ అధినేత, పారిశ్రామికవేత్త విజయ్ మాల్యా సోషల్ మీడియా వేదికగా స్

    Latest News

    • Poonam Pandey: పూనమ్ పాండే బేబీ బంప్ ఫొటోలు వైరల్

    • LPG Gas Shortage : తెలంగాణలో ఆటో గ్యాస్ సంక్షోభం.. కేంద్రానికి మంత్రి ఉత్తమ్ లేఖ

    • Sheetlaashtami Temple : శీతలాష్టమి ఆలయంలో విషాదం..తొక్కిసలాట లో 8 మంది భక్తులు మృతి

    • TVK Candidate Aadhav Arjuna : టీవీకే అభ్యర్థి ఆస్తులు చూస్తే మతిపోవాల్సిందే !!

    • Google Map : గూగుల్ మ్యాప్స్ లో ఇంట్రెస్టింగ్ ఫీచర్ అందుబాటులోకి !!

    Trending News

      • Challapalli Police Station: చల్లపల్లి పోలీస్ స్టేషన్‌లో భారీ పేలుడు..

      • వివాహిత స్త్రీ ద‌గ్గ‌ర ఎంత బంగారం ఉండొచ్చు?

      • రూ. 25.20 కోట్లకు కొనుగోలు.. బౌలింగ్‌కు దూరంగా ఆల్‌రౌండ‌ర్‌?!

      • Green S** : పర్యావరణ హిత శృంగారాన్ని కోరుకుంటున్న యువత ..ఏంటి పర్యావరణ హిత శృంగారం ?

      • నేడు సీఎస్కే- ఆర్ఆర్ మ‌ధ్య పోరు.. హెడ్-టు-హెడ్ రికార్డులివే!!

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd