World Test Championship: WTC పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి చేరిన టీమిండియా..!
కేప్ టౌన్ టెస్టులో భారత జట్టు దక్షిణాఫ్రికాపై 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ విజయంతో 2023-25 ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ (World Test Championship)లో భారత జట్టు పాయింట్లలో మొదటి స్థానానికి చేరింది.
- By Gopichand Published Date - 10:21 AM, Fri - 5 January 24
World Test Championship: కేప్ టౌన్ టెస్టులో భారత జట్టు దక్షిణాఫ్రికాపై 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ విజయంతో 2023-25 ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ (World Test Championship)లో భారత జట్టు పాయింట్లలో మొదటి స్థానానికి చేరింది. ఆతిథ్య సౌతాఫ్రికాను ఓడించి రోహిత్ శర్మ సారథ్యంలోని టీమిండియా పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి చేరుకుంది. ఓటమి పాలైన సౌతాఫ్రికా రెండో స్థానానికి పడిపోయింది.
ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ 2023-25 సైకిల్‌లో భారత జట్టు ఇప్పటివరకు నాలుగు టెస్టులు ఆడింది. అందులో రెండు మ్యాచ్ లు గెలిచింది. ఒకదానిలో ఓడిపోయారు. ఒకటి డ్రాగా ముగిసింది. 4లో 2 గెలిచిన తర్వాత టీమిండియా విన్నింగ్ శాతం 54.16గా ఉంది. అదే సమయంలో రెండో టెస్టులో ఓడిన దక్షిణాఫ్రికా విజయ శాతం 50కి చేరుకుంది. కొత్త టెస్ట్ ఛాంపియన్‌షిప్ సైకిల్‌లో దక్షిణాఫ్రికా ఇప్పటివరకు రెండు టెస్టులు ఆడింది. ఒకటి గెలిచింది. ఒక ఓటమిని సాధించింది. న్యూజిలాండ్ 50 శాతం విజయంతో పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో ఉంది. న్యూజిలాండ్ కూడా 2 మ్యాచ్‌లు ఆడింది. అందులో 1 ఓడిపోయి, 1 గెలిచింది. ఆ తర్వాత బంగ్లాదేశ్ పట్టికలో ఐదో స్థానంలో ఉంది. 2 టెస్టులు ఆడిన తర్వాత బంగ్లాదేశ్ విజయ శాతం కూడా 50%గా ఉంది.
Also Read: Shortest Test: కేవలం 642 బంతుల్లోనే.. టెస్ట్ క్రికెట్ చరిత్రలో ఇదే మొదటిసారి..!
పాకిస్థాన్ పరిస్థితి ఇదీ
పాయింట్ల పట్టికలో పాకిస్థాన్ జట్టు ఆరో స్థానంలో కొనసాగుతోంది. ప్రస్తుతం పాక్ జట్టు ఆస్ట్రేలియా పర్యటనలో ఉంది. అక్కడ మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో మొదటి రెండు మ్యాచ్‌లను కోల్పోయింది. 4 టెస్టులు ఆడిన పాకిస్థాన్ విజయ శాతం 45.83గా ఉంది.
We’re now on WhatsApp. Click to Join.
దక్షిణాఫ్రికాను భారత్ ఘోరంగా చిత్తు చేసింది
ఫాస్ట్ బౌలర్లు జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్ అద్భుతాలు చేసిన రెండో టెస్టులో భారత జట్టు ఆతిథ్య దక్షిణాఫ్రికాను 7 వికెట్ల తేడాతో ఓడించింది. ఆఫ్రికా తొలి ఇన్నింగ్స్‌లో సిరాజ్ 6 వికెట్లు తీయగా, రెండో ఇన్నింగ్స్‌లో బుమ్రా 6 వికెట్లు తీశాడు. రెండు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా తొలి మ్యాచ్‌లో టీమిండియా ఇన్నింగ్స్ 32 పరుగుల తేడాతో ఓడిపోయింది. దీని తర్వాత రెండో మ్యాచ్‌లో రోహిత్ సేన పునరాగమనం చేసి దక్షిణాఫ్రికాను ఓడించింది.