IND-W Beat SA-W: ప్రపంచకప్ గెలిచిన భారత్.. మరోసారి ఆకట్టుకున్న తెలుగమ్మాయి!
83 పరుగులు లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ జట్టు వికెట్ నష్టానికి 84 పరుగులు చేసింది. గొంగడి త్రిష మరోసారి అద్భుతంగా రాణించి జట్టుకు విజయాన్ని అందించింది.
- By Gopichand Published Date - 02:39 PM, Sun - 2 February 25

IND-W Beat SA-W: అండర్-19 మహిళల టీ20 ప్రపంచకప్‌లో భాగంగా కౌలాలంపూర్‌లోని ప్రతిష్టాత్మకమైన బ్యుమాస్ ఓవల్ మైదానంలో భారత్-దక్షిణాఫ్రికా (IND-W Beat SA-W) మధ్య ఫైనల్ మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో భారత్ జట్టు 9 వికెట్లతో తేడాతో జయభేరి మోగించింది. ఈ మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా కెప్టెన్ కైలా రీనెకే టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ తీసుకుంది. అయితే బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా జట్టు కేవలం 82 పరుగులకే కుప్పకూలింది. భారత్ బౌలింగ్‌లో గొంగడి త్రిష 3 వికెట్లు, వైష్ణవి శర్మ, శుక్లా, పరునికా సిసోడియా రెండేసి వికెట్లు తీసి సౌతాఫ్రికాను కట్డడి చేయడంలో విజయం సాధించారు.
𝗖. 𝗛. 𝗔. 𝗠. 𝗣. 𝗜. 𝗢. 𝗡. 𝗦! 🏆#TeamIndia 🇮🇳 are the ICC U19 Women’s T20 World Cup 2025 Champions 👏 👏
Scorecard ▶️ https://t.co/hkhiLzuLwj #SAvIND | #U19WorldCup pic.twitter.com/MuOEENNjx8
— BCCI Women (@BCCIWomen) February 2, 2025
83 పరుగులు లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ జట్టు వికెట్ నష్టానికి 84 పరుగులు చేసింది. గొంగడి త్రిష మరోసారి అద్భుతంగా రాణించి జట్టుకు విజయాన్ని అందించింది. దీంతో భారత్ జట్టు విశ్వవిజేతగా నిలిచింది. త్రిష అజేయంగా 44 పరుగులు చేయగా.. సానికా చాల్కే అజేయంగా 26 పరుగులు చేసింది. దీంతో భారత్ జట్టు అండర్-19 ఛాంపియన్‌గా అవతరించింది.
Also Read: Maha Kumbh 2025 Security: మహా కుంభమేళాలో తొక్కిసలాట తర్వాత మొదటి ‘అమృత స్నాన్’ వద్ద భారీ మార్పులు!
వరుసగా రెండోసారి కైవసం
అండర్-19 మహిళల టీ20 ప్రపంచకప్‌ను వరుసగా రెండోసారి కైవసం చేసుకుని ఆదివారం భారత జట్టు చరిత్ర సృష్టించారు. ఫైనల్‌లో జట్టు ఏకపక్షంగా తొమ్మిది వికెట్ల తేడాతో దక్షిణాఫ్రికాను ఓడించింది. ఈ మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా కెప్టెన్ కైలా రీనెకే టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ ఎంచుకోగా.. ఆ జట్టు కేవలం 82 పరుగులకే కుప్పకూలింది. ఈ లక్ష్యాన్ని భారత్ కేవలం ఒక వికెట్ కోల్పోయి సాధించింది. ఆఖరి మ్యాచ్‌లో గొంగడి త్రిష టీమ్‌ఇండియాకు బంతి, బ్యాట్‌తో మంచి ప్రదర్శన కనబరిచింది. ఆమె మొదట బౌలింగ్‌లో అద్భుత ప్రదర్శన చేసి మూడు వికెట్లు తీసింది. బ్యాట్‌తో 44 పరుగులతో పేలుడు ఇన్నింగ్స్ ఆడి జట్టుకు విజయాన్ని అందించింది.
కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రశంసలు
మహిళల U-19 ప్రపంచకప్ టైటిల్ గెలుచుకున్న భారత జట్టును కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ప్రశంసించారు. అండర్-19 మహిళల ప్రపంచకప్ గెలుచుకున్న భారత జట్టుకు అభినందనలు తెలిపారు. ఈ విజయం 140 కోట్ల మంది భారతీయులకు గర్వకారణం, క్రికెట్‌ను భవిష్యత్తుగా ఎంచుకున్న యువతకు స్ఫూర్తిదాయకమని కొనియాడారు. ఈ గొప్ప విజయంలో కీలకంగా వ్యవహరించిన ఆల్‌రౌండర్ తెలుగమ్మాయి గొంగడి త్రిషకు హృదయపూర్వక అభినందనలు అన్నారు.