IND vs SL 3rd T20: చేతులెత్తేసిన టీమిండియా, శ్రీలంక లక్ష్యం 138 పరుగులు
పల్లెకెలె మైదానంలో భారత్-శ్రీలంక మధ్య మూడో టీ20 మ్యాచ్ జరుగుతోంది. టాస్ గెలిచిన శ్రీలంక కెప్టెన్ చరిత్ అసలంక ముందుగా బౌలింగ్ ఎంచుకున్నాడు. తొలుత బ్యాటింగ్‌కు దిగిన టీమిండియా 9 వికెట్లకు 137 పరుగులు చేసింది.
- By Praveen Aluthuru Published Date - 10:08 PM, Tue - 30 July 24

IND vs SL 3rd T20: శ్రీలంక మరియు భారత్ మధ్య చివరి టి20 మ్యాచ్ పల్లెకెలెలో జరుగుతోంది. వర్షం కారణంగా టాస్ ఆలస్యమైంది. శ్రీలంక టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ ఎంచుకుంది. నలుగురు ఆటగాళ్లకు విశ్రాంతినిచ్చారు. వీరిలో రిషబ్ పంత్, హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, అర్ష్‌దీప్ సింగ్ ఉన్నారు.
ఇక క్లిష్ట పిచ్‌పై తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 9 వికెట్లకు 137 పరుగులు చేసింది. భారత్ తరఫున శుభ్‌మన్ గిల్ అత్యధిక ఇన్నింగ్స్‌లో 39 పరుగులు చేశాడు. రియాన్ పరాగ్ 26 పరుగులు, సుందర్ 25 పరుగులు అందించారు. సూర్యకుమార్ యాదవ్ 9 బంతుల్లో 8 పరుగులు చేసి నిష్క్రమించాడు. దీని తర్వాత శివమ్ దూబే కూడా 14 బంతుల్లో 13 పరుగులు చేసి ఔటయ్యాడు. శ్రీలంక తరఫున మహిష్ తీక్షణ 3 వికెట్లు తీశాడు. వనిందు హసరంగ 2 వికెట్లు తీశాడు. అసిత ఫెర్నాండో, రమేష్ మెండిస్, చమిందు విక్రమసింఘే ఒక్కో వికెట్ సాధించారు.
భారత జట్టు: యశస్వి జైస్వాల్, శుభమన్ గిల్, సంజు శాంసన్, సూర్యకుమార్ యాదవ్, రియాన్ పరాగ్, రింకూ సింగ్, శివమ్ దూబే, వాషింగ్టన్ సుందర్, రవి బిష్ణోయ్, మహ్మద్ సిరాజ్, ఖలీల్ అహ్మద్.
శ్రీలంక జట్టు: పాతుమ్ నిస్సాంక, కుసల్ మెండిస్, కమిందు మెండిస్, కుసల్ పెరీరా, చరిత్ అసలంక (కెప్టెన్), చమిందు విక్రమసింఘ, వనిందు హసరంగా, మహేశ్ తీక్షణ, మతిషా పతిరనా, అసిత ఫెర్నాండో, రమేష్ మెండిస్.
Also Read: Raj Tarun -Malvi Press Meet : మీడియా ముందుకు రాజ్ తరుణ్..మాల్వీ మల్హోత్రా