IND vs PAK: ఆసియా కప్‌లో భారత్- పాక్ జట్ల మధ్య రికార్డు ఎలా ఉందంటే?
T20 ఫార్మాట్‌లో కేవలం 3 సార్లు మాత్రమే భారత్-పాకిస్తాన్ తలపడ్డాయి. ఇందులో భారత్ 2 మ్యాచ్‌లలో.. పాకిస్తాన్ 1 మ్యాచ్‌లో విజయం సాధించింది.
- By Gopichand Published Date - 03:19 PM, Tue - 26 August 25

IND vs PAK: సెప్టెంబర్ 9 నుండి ప్రారంభం కానున్న ఆసియా కప్‌లో టీమ్ ఇండియా విజయం సాధించేందుకు ప్రధానంగా బరిలోకి దిగుతోంది. ఈసారి టోర్నమెంట్‌లో భారత్, పాకిస్తాన్, శ్రీలంక, ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్, ఒమన్, హాంకాంగ్, నేపాల్‌తో సహా మొత్తం 8 జట్లు పాల్గొంటున్నాయి. 1984లో తొలిసారిగా జరిగిన ఆసియా కప్ ఆ తర్వాత అనేక సార్లు నిర్వహించబడింది. ఈ టోర్నమెంట్‌లో భారత్, పాకిస్తాన్ (IND vs PAK) జట్లు చాలాసార్లు తలపడ్డాయి. ఆసియా కప్‌లో ఇరు జట్ల మధ్య జరిగిన పోరులో ఎవరిది పైచేయిగా ఉందో తెలుసుకుందాం.
ఆసియా కప్‌లో భారత్ vs పాకిస్తాన్
ఆసియా కప్ చరిత్రలో భారత్, పాకిస్తాన్ జట్లు ఇప్పటివరకు 18 సార్లు తలపడ్డాయి. ఇందులో టీమ్ ఇండియా 10 సార్లు విజయం సాధించగా, పాకిస్తాన్ 6 సార్లు గెలిచింది. రెండు మ్యాచ్‌లకు ఫలితం తేలలేదు. ఆసియా కప్ ODI, T20 అంతర్జాతీయ ఫార్మాట్‌లలో నిర్వహించబడింది.
ODI ఆసియా కప్: ODI ఫార్మాట్‌లో ఇరు జట్ల మధ్య 15 మ్యాచ్‌లు జరిగాయి. ఇందులో భారత్ 8 మ్యాచ్‌లలో గెలుపొందగా.. పాకిస్తాన్ 5 మ్యాచ్‌లలో గెలిచింది. రెండు మ్యాచ్‌లకు ఫలితం రాలేదు.
T20 ఆసియా కప్: T20 ఫార్మాట్‌లో కేవలం 3 సార్లు మాత్రమే భారత్-పాకిస్తాన్ తలపడ్డాయి. ఇందులో భారత్ 2 మ్యాచ్‌లలో.. పాకిస్తాన్ 1 మ్యాచ్‌లో విజయం సాధించింది.
Also Read: Virat Kohli: కోహ్లీ టెస్ట్ రిటైర్మెంట్.. తెర వెనుక జరిగింది ఇదేనా?
మొత్తంగా చూస్తే ఆసియా కప్ చరిత్రలో పాకిస్తాన్ టీమ్‌పై భారత్‌కు మెరుగైన రికార్డు ఉంది. ఇప్పటివరకు కేవలం 6 సార్లు మాత్రమే పాక్ చేతిలో టీమ్ ఇండియా ఓటమి పాలైంది.
ఆసియా కప్ 2025లో భారత్ vs పాకిస్తాన్ మ్యాచ్
ఆసియా కప్ 2025లో భారత్, పాకిస్తాన్ జట్ల మధ్య సెప్టెంబర్ 14న మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ దుబాయ్ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో జరుగుతుంది. భారత జట్టు చాలా బలంగా కనిపిస్తోంది. మరోవైపు పాకిస్తాన్ జట్టులో బాబర్ ఆజం, మహమ్మద్ రిజ్వాన్‌లకు చోటు లభించలేదు. దీంతో ఈ మ్యాచ్‌లో టీమ్ ఇండియా ఫేవరెట్‌గా ఉంది. ఇరు జట్ల T20 అంతర్జాతీయ రికార్డులను పరిశీలిస్తే 13 మ్యాచ్‌లలో 10 సార్లు భారత్ గెలవగా, 3 సార్లు పాకిస్తాన్ విజయం సాధించింది. ఈ ఆసియా కప్‌లో ఏ జట్టు విజయం సాధిస్తుందో చూడాలి.