HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Sports
  • >Ind Vs Pak Asia Cup 2025 Final Guidelines

Asia Cup Final: ఆసియా కప్ 2025 ఫైనల్‌.. దుబాయ్‌లో కట్టుదిట్టమైన భద్రత!

భారత్-పాక్ ఫైనల్‌కు సంబంధించిన ఈ నిబంధనలు, మార్గదర్శకాలు కేవలం దుబాయ్‌కి మాత్రమే వర్తిస్తాయి. భారత్‌లో నియమాల ప్రకారం భారత జట్టు విజయం సాధిస్తే సంబరాలు చేసుకోవచ్చు.

  • Author : Gopichand Date : 28-09-2025 - 4:34 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Asia Cup Final
Asia Cup Final

Asia Cup Final: నేడు ఆసియా కప్ ఫైనల్ (Asia Cup Final) జరగనుంది. దుబాయ్‌లో భారత్, పాకిస్తాన్ మధ్య ఈ టైటిల్ మ్యాచ్ జరగనుంది. ఆసియా కప్ 41 సంవత్సరాల చరిత్రలో మొదటిసారిగా భారత్, పాకిస్తాన్ జట్లు ఫైనల్‌లో తలపడనున్నాయి. భారత కాలమానం ప్రకారం.. ఈ టైటిల్ మ్యాచ్ రాత్రి 8 గంటలకు ప్రారంభమవుతుంది. ఈ మహాపోరు సందర్భంగా దుబాయ్ ఈవెంట్స్ సెక్యూరిటీ కమిటీ చాలా కఠినమైన నియమాలను రూపొందించింది. అలాగే దుబాయ్ పోలీసులు కూడా కట్టుదిట్టమైన మార్గదర్శకాలను జారీ చేశారు.

భద్రతా సంస్థలు ఈ మ్యాచ్‌ను ఎలాంటి అంతరాయం లేకుండా పటిష్టమైన భద్రత మధ్య నిర్వహించాలని పట్టుదలతో ఉన్నాయి. కొన్ని నెలల క్రితం జమ్మూకశ్మీర్‌లో పాకిస్తాన్ ఉగ్రవాదులు 26 మంది అమాయక భారతీయులను హత్య చేయడంతో భారత్ ‘ఆపరేషన్ సింధూర్’ ద్వారా ప్రతీకార దాడులు చేసింది. ఈ నేపథ్యంలో భద్రతా సంస్థలు భారత్-పాక్ ఫైనల్‌ కోసం ఈ కఠిన నిబంధనలను రూపొందించాయి.

Also Read: BCCI: బీసీసీఐలో కీలక మార్పులు.. కొత్త అధ్య‌క్షుడు, సెలెక్ట‌ర్లు వీరే!

స్టేడియంలో నిషేధించిన వస్తువులు

  • ఆతిష్‌బాజీ, టపాసులు, లేజర్ పాయింటర్లు
  • పదునైన ఆయుధాలు, విష పదార్థాలు, రిమోట్ కంట్రోల్ ద్వారా పనిచేసే వస్తువులు
  • పెద్ద గొడుగులు, కెమెరా ట్రైపాడ్‌లు, రిగ్‌లు, సెల్ఫీ స్టిక్‌లు, ఫొటోగ్రఫీ పరికరాలు
  • అనుమతి లేకుండా జెండాలు, బ్యానర్లు, పోస్టర్లు

వీక్షకులకు మార్గదర్శకాలు

  • వీక్షకులు కనీసం 3 గంటల ముందు స్టేడియానికి రావాలి.
  • ఒకసారి లోపలికి వచ్చాక, బయటికి వెళ్లడానికి అనుమతి లేదు.
  • ప్రతి ఒక్క వీక్షకుడు అన్ని ఆదేశాలను తప్పనిసరిగా పాటించాలి.
  • నిషేధించిన వస్తువులను స్టేడియానికి తీసుకురాకూడదు.
  • ఈ నియమాలు కేవలం దుబాయ్‌కే పరిమితం

భారత్-పాక్ ఫైనల్‌కు సంబంధించిన ఈ నిబంధనలు, మార్గదర్శకాలు కేవలం దుబాయ్‌కి మాత్రమే వర్తిస్తాయి. భారత్‌లో నియమాల ప్రకారం భారత జట్టు విజయం సాధిస్తే సంబరాలు చేసుకోవచ్చు. నేటి భారత్-పాకిస్తాన్ ఫైనల్‌లో ఆటగాళ్ల ఉత్సాహం తారాస్థాయిలో ఉంటుంది. అంతకుముందు లీగ్ దశలో, ఆ తర్వాత సూపర్-4లో భారత జట్టు పాకిస్తాన్‌ను చిత్తుగా ఓడించింది. నేడు టీమ్ ఇండియా 9వ సారి ఆసియా కప్ టైటిల్‌ను కైవసం చేసుకోవాలని చూస్తోంది.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • asia cup
  • Asia Cup 2025
  • ASIA CUP FINAL
  • Asia Cup Guidelines
  • India vs Pakistan
  • Suryakumar Yadav

Related News

    Latest News

    • మీకు ఎల‌క్ట్రిక్ కారు ఉందా? అయితే ఈ జాగ్ర‌త్త‌లు పాటించాల్సిందే!

    • మరోసారి వైసీపీకి స్ట్రాంగ్ వార్నింగ్ .. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్

    • ఏపీకి కేంద్రం గుడ్ న్యూస్.. ఆ జిల్లాలకు రూ.60.76 కోట్ల ఖేలో ఇండియా నిధులు మంజూరు..

    • ఇరాన్‌కు బియ్యం ఎగుమతిలో చిక్కులు.. రూ. 2000 కోట్ల సరుకు నిలిపివేత!

    • బడ్జెట్ 2026.. సామాన్యులకు కలిగే ప్ర‌యోజ‌నాలీవే!

    Trending News

      • బ్రిటన్‌లో ‘X’ నిలుపుదల ముప్పు.. వివాదానికి కారణం ఏంటి?

      • మ‌క‌ర సంక్రాంతి ఎప్పుడు? ఆరోజు ఏం చేస్తే మంచిది?!

      • టీమిండియా జ‌ట్టుతో క‌ల‌వ‌ని స్టార్ ఆట‌గాళ్లు.. ఎవ‌రంటే?

      • మీ మొబైల్ నంబర్ చివర సున్నా ఉందా?

      • టీమిండియాకు కొత్త స‌మ‌స్య‌.. స్టార్ ఆట‌గాడికి గాయం!?

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd