HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Sports
  • >Ind Vs Aus Three Mistakes Cost Team India Dearly In Melbourne

IND vs AUS: మెల్‌బోర్న్‌లో భారత్‌ ఘోర పరాజయం.. కార‌ణాలివే?

కాన్‌బెర్రా తర్వాత మెల్‌బోర్న్‌లోనూ టీమ్ మేనేజ్‌మెంట్ అర్ష్‌దీప్ సింగ్‌ను ప్లేయింగ్ 11 నుండి తప్పించింది. ఈ నిర్ణయం కూడా భారత జట్టుకు చాలా నష్టం కలిగించింది. బ్యాటింగ్ ఆర్డర్‌లో లోతు కోసం హర్షిత్‌కు తుది జ‌ట్టులో చోటు కల్పించారు.

  • Author : Gopi Date : 31-10-2025 - 9:29 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
IND vs SA
IND vs SA

IND vs AUS: మెల్‌బోర్న్‌లో భారత బ్యాట్స్‌మెన్ల ప్రదర్శన అత్యంత దారుణంగా ఉండటంతో టీమ్ ఇండియా ఓటమి పాలైంది. సిరీస్‌లోని రెండో టీ20 అంతర్జాతీయ మ్యాచ్‌లో భారత జట్టు ఆస్ట్రేలియా (IND vs AUS) చేతిలో 4 వికెట్ల తేడాతో ఓటమిని చవిచూసింది. కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ బ్యాట్ పలకలేదు. అలాగే శుభ్‌మన్ గిల్, సంజు శాంసన్, తిలక్ వర్మ వంటి బ్యాట్స్‌మెన్ కూడా ఘోరంగా విఫలమయ్యారు.

టీమ్ ఇండియా బ్యాటింగ్ ఆర్డర్ ఎంతగా కుప్పకూలిందంటే జట్టు కేవలం 125 పరుగులకే ఆలౌట్ అయ్యింది. ఆస్ట్రేలియా ఈ లక్ష్యాన్ని కేవలం 13.2 ఓవర్లలో అలవోకగా ఛేదించింది. ఈ ఓటమికి కెప్టెన్ సూర్యకుమార్, హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ చేసిన మూడు తప్పులే ప్రధాన కారణమని విమర్శలు వినిపిస్తున్నాయి.

సంజు శాంసన్‌ను ఎందుకు ప్రమోట్ చేశారు?

ఆసియా కప్‌లో ఐదో నంబర్‌లో బ్యాటింగ్ చేసిన సంజు శాంసన్‌ను రెండో టీ20 మ్యాచ్‌లో అకస్మాత్తుగా మూడో నంబర్‌కు ప్రమోట్ చేశారు. సంజు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలేక కేవలం 2 పరుగులకే అవుట్ అయ్యాడు. మూడో నంబర్‌లో ప్రమోషన్ ఇవ్వాల్సి వస్తే అది తిలక్ వర్మకు ఇవ్వాల్సి ఉండేది. తిలక్ ఈ స్థానంలో అవకాశం దక్కినప్పుడల్లా అద్భుతమైన ప్రదర్శన చేశాడు. స్వయంగా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ కూడా గత మ్యాచ్‌లో ఇదే స్థానంలో అద్భుతంగా ఆడాడు. అనవసరంగా చేసిన ఈ ప్రయోగం మెల్‌బోర్న్‌లో భారత జట్టుకు చాలా భారంగా పరిణమించింది.

Also Read: KYV: కైవేవీ అంటే ఏమిటి? ఫాస్టాగ్‌ వినియోగదారులకు NHAI శుభవార్త!

శివమ్ దూబే కంటే హర్షిత్‌ను ఎందుకు ముందు పంపారు?

టీమ్ ఇండియా ఐదో వికెట్‌గా అక్షర్ పటేల్‌ను కోల్పోయినప్పుడు హర్షిత్ రాణా బ్యాటింగ్‌కు రావడం చూసి అందరూ ఆశ్చర్యపోయారు. హర్షిత్‌ను బ్యాటింగ్ ఆర్డర్‌లో శివమ్ దూబే కంటే ముందు పంపాలనే నిర్ణయం ఎవరికీ అర్థం కాలేదు. హర్షిత్ 35 పరుగులు చేసినప్పటికీ అతను ఆ పరుగుల కోసం 33 బంతులు ఆడాడు. హర్షిత్ పెవిలియన్ చేరిన తర్వాత క్రీజులోకి వచ్చిన శివమ్ దూబేకు పెద్ద షాట్లు ఆడటం తప్ప మరో మార్గం లేకపోయింది. దీంతో అతను కేవలం 4 పరుగులు చేసి అవుట్ అయ్యాడు.

అర్ష్‌దీప్ సింగ్‌ను ఆడించకపోవడం

కాన్‌బెర్రా తర్వాత మెల్‌బోర్న్‌లోనూ టీమ్ మేనేజ్‌మెంట్ అర్ష్‌దీప్ సింగ్‌ను ప్లేయింగ్ 11 నుండి తప్పించింది. ఈ నిర్ణయం కూడా భారత జట్టుకు చాలా నష్టం కలిగించింది. బ్యాటింగ్ ఆర్డర్‌లో లోతు కోసం హర్షిత్‌కు తుది జ‌ట్టులో చోటు కల్పించారు. కానీ బౌలింగ్‌లో హర్షిత్ తన 2 ఓవర్లలోనే 27 పరుగులు సమర్పించుకున్నాడు. టీ20 ఫార్మాట్‌లో భారత్ తరఫున అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా అర్ష్‌దీప్ ఉన్నప్పటికీ అతన్ని వరుసగా రెండో మ్యాచ్‌లో కూడా ప్లేయింగ్ 11 నుండి తప్పించడం గమనార్హం.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • gautam gambhir
  • IND vs AUS
  • Melbourne
  • sports news
  • Suryakumar Yadav
  • team india

Related News

Who is Team India's new T20 captain?

T20 Captain: టీమిండియా టీ20 కొత్త కెప్టెన్‌ ఎవరంటే?

భారత టీ20 జట్టు కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్‌ విషయంలో బీసీసీఐ తన సహనాన్ని కోల్పోయినట్లు కనిపిస్తోంది. 2026లో టీ20 ప్రపంచకప్‌ను గెలిపించినప్పటికీ, కెప్టెన్‌గా సూర్యకుమార్‌ను తప్పించి, అతని స్థానంలో శ్రేయస్ అయ్యర్‌కు పగ్గాలు అప్పగించాలని బీసీసీఐ యోచిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. బ్యాట్స్‌మెన్‌గా సూర్యకుమార్ యాదవ్ కొంతకాలంగా తీవ్ర ఫామ్‌ సమస్యలతో ఇబ్బంది పడుతుండటమే ఈ

    Latest News

    • Hanuman Jayanti: హనుమంతుడిని పూజిస్తే అన్ని విజయాలే!

    • Cm Vijay: స్టాలిన్‌ ఇంటికి CM విజయ్‌!

    • Keerthana: సర్టిఫికెట్ మర్చిపోయిన మంత్రి కీర్తన.. ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం వాయిదా..

    • Chandrababu Naidu: కేంద్ర మంత్రి సీఆర్ పాటిల్‌తో కీలక భేటీ : చంద్రబాబు

    • CM Vijay: సీఎంగా విజయ్ నెల జీతం ఎంతో తెలుసా?

    Trending News

      • TVK విజయ్‌ అను నేను..

      • CM VIJAY: టీవీకేకు వీసీకే మద్దతు: ప్రభుత్వ ఏర్పాటుకు లైన్ క్లియర్

      • CM Vijay Thalapathy: ప్రభుత్వ ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్..!

      • Tamil Nadu Politics: విజయ్ను ముప్పుతిప్పలు పెడుతున్న VCK.. డిప్యూటీ సీఎం పదవి ఇస్తేనే

      • Cm Thalapathy Vijay: విజయ్‌కి లైన్ క్లియర్!

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd