Suryakumar Yadav: రోహిత్ శర్మ రికార్డును బ్రేక్ చేసిన సూర్యకుమార్ యాదవ్!
టాస్ ఓడిపోయిన తర్వాత మొదట బ్యాటింగ్ చేసిన టీమ్ ఇండియాకు ఆరంభం అంత బాగా లేదు. అభిషేక్ శర్మ కొన్ని పవర్ ఫుల్ షాట్లు ఆడినప్పటికీ 19 పరుగులు చేసి పెవిలియన్ చేరారు.
- By Gopichand Published Date - 07:28 PM, Wed - 29 October 25
Suryakumar Yadav: ఆస్ట్రేలియా గడ్డపై సూర్యకుమార్ యాదవ్ తన పాత ఫామ్‌లోకి తిరిగి వచ్చారు. కాన్‌బెర్రా మైదానంలో జరుగుతున్న మొదటి T20 అంతర్జాతీయ మ్యాచ్‌లో సూర్య బ్యాట్‌తో అద్భుతంగా ఆడుతున్నారు. వర్షం కారణంగా మ్యాచ్ నిలిచిపోయే సమయానికి సూర్యకుమార్ యాదవ్ 24 బంతుల్లో 39 పరుగులు చేసి క్రీజులో ఉన్నారు. సూర్య తన ఈ ఇన్నింగ్స్‌లో 3 ఫోర్లు, 2 సిక్స్‌లు కొట్టారు. కాన్‌బెర్రాలో తన మెరుపు బ్యాటింగ్‌తో సూర్య ఒక పెద్ద మైలురాయిని చేరుకున్నారు. అతను టీమ్ ఇండియాకు కొత్త సిక్సర్ కింగ్‌గా అవతరించాడు. రోహిత్ శర్మ ఒక పెద్ద రికార్డును బద్దలు కొట్టాడు.
సూర్య కొత్త సిక్సర్ కింగ్
టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్.. నాథన్ ఎల్లిస్ బంతికి సిక్స్ కొట్టడంతో ఈ ఫార్మాట్‌లో తన 150 సిక్స్‌లు పూర్తి చేసుకున్నారు. ఈ మైలురాయిని చేరుకున్న రెండవ భారతీయ బ్యాట్స్‌మెన్‌గా సూర్య నిలిచారు. అంతేకాదు అత్యంత వేగంగా 150 సిక్స్‌లు కొట్టిన బ్యాట్స్‌మెన్ల జాబితాలో సూర్య రెండవ స్థానానికి చేరుకున్నారు. సూర్య ఈ ఘనతను 86 ఇన్నింగ్స్‌లలో సాధించారు. ఈ జాబితాలో సూర్య కంటే ముందు ముహమ్మద్ వసీం మాత్రమే ఉన్నారు. అతను కేవలం 66 ఇన్నింగ్స్‌లలో 150 సిక్స్‌లు కొట్టారు. అయితే భారతదేశం తరఫున అత్యంత వేగంగా 150 సిక్స్‌లు కొట్టిన బ్యాట్స్‌మెన్‌గా సూర్యకుమార్ అవతరించారు. ఈ విషయంలో అతను రోహిత్ శర్మను అధిగమించారు.
Also Read: India vs Australia: వర్షం ఎఫెక్ట్.. భారత్- ఆస్ట్రేలియా తొలి టీ20 రద్దు!
ఫామ్‌లో కనిపించిన సూర్యకుమార్
టాస్ ఓడిపోయిన తర్వాత మొదట బ్యాటింగ్ చేసిన టీమ్ ఇండియాకు ఆరంభం అంత బాగా లేదు. అభిషేక్ శర్మ కొన్ని పవర్ ఫుల్ షాట్లు ఆడినప్పటికీ 19 పరుగులు చేసి పెవిలియన్ చేరారు. దీని తర్వాత కెప్టెన్ సూర్య క్రీజులోకి వచ్చి రాగానే తన షాట్‌లను స్వేచ్ఛగా ఆడారు. సూర్యకు రెండో ఎండ్‌లో శుభ్‌మన్ గిల్ నుండి మంచి సహకారం లభించింది. అభిషేక్ పెవిలియన్ చేరిన తర్వాత గిల్, సూర్య మ్యాచ్ నిలిచిపోయే వరకు రెండవ వికెట్‌కు 62 పరుగులు జోడించారు. కెప్టెన్ సూర్యకుమార్ 39, శుభ్‌మన్ గిల్ 37 పరుగులు చేసి క్రీజులో ఉన్నారు. గిల్ తన 20 బంతుల ఇన్నింగ్స్‌లో 4 ఫోర్లు, ఒక సిక్స్ కొట్టారు.