IND vs AFG T20s: భారత్ వర్సెస్ ఆఫ్ఘనిస్థాన్ మ్యాచ్ వేదికలో మార్పు లేదు
జనవరి 11 నుంచి భారత్, ఆఫ్ఘనిస్థాన్ మధ్య 3 మ్యాచ్‌ల టీ20 సిరీస్ జరగనుంది. ఈ సిరీస్‌కు సంబంధించిన షెడ్యూల్ ఇప్పటికే విడుదలైంది, తొలి టీ20 మొహాలీలో జరగనుండగా,
- Author : Praveen Aluthuru
Date : 28-12-2023 - 8:18 IST
Published By : Hashtagu Telugu Desk
IND vs AFG T20s: జనవరి 11 నుంచి భారత్, ఆఫ్ఘనిస్థాన్ మధ్య 3 మ్యాచ్‌ల టీ20 సిరీస్ జరగనుంది. ఈ సిరీస్‌కు సంబంధించిన షెడ్యూల్ ఇప్పటికే విడుదలైంది, తొలి టీ20 మొహాలీలో జరగనుండగా, రెండో టీ20 జనవరి 14, 17 తేదీల్లో ఇండోర్, బెంగళూరులో జరుగుతాయి. అయితే రెండో టీ20కి వేదికను మార్చవచ్చని వార్తలు వైరల్ అవుతున్నాయి.
వాస్తవానికి గ్వాలియర్‌లో కొత్తగా నిర్మించిన శంకర్‌పూర్ స్టేడియానికి రెండో T20 మ్యాచ్ వేదికను మార్చినట్లు వార్తలు వచ్చాయి. అయితే ఇప్పుడు వేదికలో ఎలాంటి మార్పు లేదని తాజా నివేదికలు పేర్కొంటున్నాయి. ఎందుకంటే గ్వాలియర్‌లో చలి తీవ్రత ఎక్కువ. సాయంత్రం వేళల్లో మంచు కురుస్తుండటంతో అక్కడ మ్యాచ్ ఆడేందుకు అవకాశం లేదు. ఈ కారణంగానే మ్యాచ్ వేదిక మార్పు నిర్ణయాన్ని పక్కనపెట్టి ఉండొచ్చని అభిప్రాయం వ్యక్తం అవుతుంది. అయితే దీనికి సంబంధించి ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.
Also Read: Ambati Rayudu: జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన అంబటి రాయుడు