ICC T20 Rankings: ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్ విడుదల.. టాప్ లోనే సూర్యకుమార్ యాదవ్..!
ఐసీసీ తాజాగా విడుదల చేసిన టీ20 ర్యాంకింగ్స్ (ICC T20 Rankings)లో ఇంగ్లండ్ ఆటగాడు ఫిల్ సాల్ట్ రెండో స్థానంలో నిలిచాడు. భారత్‌కు చెందిన సూర్యకుమార్ యాదవ్ మొదటి స్థానంలోనే కొనసాగుతున్నాడు.
- Author : Gopichand
Date : 28-12-2023 - 2:00 IST
Published By : Hashtagu Telugu Desk
ICC T20 Rankings: ఐసీసీ తాజాగా విడుదల చేసిన టీ20 ర్యాంకింగ్స్ (ICC T20 Rankings)లో ఇంగ్లండ్ ఆటగాడు ఫిల్ సాల్ట్ రెండో స్థానంలో నిలిచాడు. అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ICC) అన్ని ఫార్మాట్‌లకు సంబంధించిన తాజా ర్యాంకింగ్‌లను డిసెంబర్ 27 బుధవారం విడుదల చేసింది. సాల్ట్ 18 స్థానాలు ఎగబాకి టీ-20 ర్యాంకింగ్స్‌లో రెండో స్థానానికి చేరుకున్నాడు. అతని రేటింగ్ ఇప్పుడు 802కి చేరుకుంది. ఇది అతని కెరీర్‌లో అత్యధిక రేటింగ్. భారత్‌కు చెందిన సూర్యకుమార్ యాదవ్ మొదటి స్థానంలోనే కొనసాగుతున్నాడు. పాకిస్థాన్ వికెట్ కీపర్-బ్యాట్స్‌మెన్ మహ్మద్ రిజ్వాన్ మూడో స్థానంలో ఉన్నాడు. తాజా ర్యాంకింగ్స్‌లో మొదటి 5 స్థానాల్లో 2 పాక్ ఆటగాళ్లు ఆక్రమించారు. రిజ్వాన్ మూడో స్థానంలో, బాబర్ ఆజం ఐదో స్థానంలో ఉన్నారు.
We’re now on WhatsApp. Click to Join.
వెస్టిండీస్‌తో జరిగిన టీ20 సిరీస్‌లో ఇంగ్లండ్ ఓపెనర్ సాల్ట్ లాభపడ్డాడు. అయితే ఈ సిరీస్‌ను ఇంగ్లిష్ జట్టు 3-2తో కోల్పోయింది. కానీ, ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో 331 పరుగులు చేసిన తర్వాత సాల్ట్ ప్లేయర్ ఆఫ్ ది సిరీస్‌గా ఎంపికయ్యాడు. నాలుగో మ్యాచ్‌లో 119 పరుగుల ఇన్నింగ్స్ ఆడాడు. బౌలింగ్ ర్యాంకింగ్స్‌లో ఇంగ్లండ్ ఆటగాడు ఆదిల్ రషీద్ అగ్రస్థానంలో ఉన్నాడు. టాప్-10లో ఒక్క భారత బౌలర్ మాత్రమే ఉన్నాడు. రవి బిష్ణోయ్ 685 రేటింగ్ పాయింట్లతో మూడో స్థానంలో ఉన్నాడు.
ICC తాజా ర్యాంకింగ్స్‌లో ODI ఫార్మాట్‌లో నంబర్ 1 బ్యాట్స్‌మెన్ బాబర్ అజామ్ తన స్థానంలో కొనసాగుతున్నాడు. టీమిండియా ఓపెనర్ శుభ్‌మన్ గిల్ రెండో స్థానంలో ఉన్నాడు. బౌలింగ్ ర్యాంకింగ్స్‌లో దక్షిణాఫ్రికాకు చెందిన కేశవ్ మహరాజ్ అగ్రస్థానంలో ఉన్నాడు. భారత ఫాస్ట్ బౌలర్ మహ్మద్ సిరాజ్ మూడో స్థానంలో ఉన్నాడు. T-20 మాదిరిగానే ఈ ఫార్మాట్‌లో కూడా నంబర్ 1 ఆల్ రౌండర్ గా షకీబ్ అల్ హసన్ ఉన్నాడు. టెస్టుల్లో నంబర్ 1 బౌలర్ గా ఆర్ అశ్విన్, బ్యాట్స్‌మెన్ న్యూజిలాండ్‌కు చెందిన కేన్ విలియమ్సన్, నంబర్ 1 ఆల్ రౌండర్ గా రవీంద్ర జడేజా ఉన్నారు.