HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Sports
  • >Icc Champions Trophy 25 Final To Be Played In Lahore Or Dubai

ICC Champions Trophy: దుబాయ్‌లో ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్?

ఇరు దేశాల రాజకీయ సంబంధాల కారణంగా టీమిండియా 16 సంవత్సరాలుగా పాకిస్తాన్‌లో పర్యటించలేదని మ‌న‌కు తెలిసిందే. భారత జట్టు చివరిసారిగా 2008లో పాకిస్థాన్‌లో ప‌ర్య‌టించింది.

  • Author : Gopi Date : 09-10-2024 - 7:40 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Champions Trophy Final
Champions Trophy Final

ICC Champions Trophy: 2025లో జరగనున్న ఛాంపియన్స్ ట్రోఫీ (ICC Champions Trophy)కి సంబంధించి పాకిస్థాన్ క్రికెట్ బోర్డుకు బ్యాడ్ న్యూస్ వచ్చింది. టీమ్ ఇండియా కారణంగా పాకిస్థాన్ భారీ నష్టాలను చవిచూడవచ్చు. ఈసారి పాకిస్థాన్ ఛాంపియన్స్ ట్రోఫీకి ఆతిథ్యం ఇవ్వాల్సి ఉంది. అయితే భారత జట్టు టోర్నమెంట్‌లో పాక్‌లో నిర్వ‌హిస్తే పాల్గొంటుందా లేదా అనేది ఇంకా ధృవీకరించబడలేదు. ఈసారి ఆసియా కప్ మాదిరిగా రెండు దేశాల్లో టోర్నీ నిర్వహించేందుకు పీసీబీ ఏమాత్రం సిద్ధంగా లేదు. వచ్చే ఏడాది జరిగే ఈ మెగా ఈవెంట్‌లో రోహిత్ జ‌ట్టు పాల్గొనకపోతే.. భారత్ లేకుండానే ఈ టోర్నీ ఆడతామ‌ని పాకిస్థాన్ అంటుంది. పీసీబీ కూడా బీసీసీఐని ఒప్పించాలని ఐసీసీని కోరింది.

టీమిండియా ఫైన‌ల్‌కు వెళ్తే వేదిక మార్పు!

వాస్తవానికి ‘ది టెలిగ్రాఫ్’లో ఒక నివేదిక ప్రకారం.. భారత జట్టు ఛాంపియన్స్ ట్రోఫీని ఆడటానికి అంగీకరించి, టోర్నమెంట్‌లో ఫైనల్‌లోకి ప్రవేశించినట్లయితే అప్పుడు టైటిల్ మ్యాచ్‌ను లాహోర్‌కు బదులుగా దుబాయ్‌కి మార్చవచ్చు. అంటే పీసీబీ ఫైనల్ మ్యాచ్ హోస్టింగ్‌ను కోల్పోవచ్చు. నివేదిక ప్రకారం.. టీమిండియా అన్ని మ్యాచ్‌లను పాకిస్తాన్‌కు బదులుగా వేరే వేదికకు మార్చాల్సి ఉంటుంది.

Also Read: Samantha : తెలుగు వారి ప్రేమ వల్లే ఈరోజు ఇంతగా ఎదిగాను – సమంత

అయితే దీనికి సంబంధించి ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. ఇరు దేశాల రాజకీయ సంబంధాల కారణంగా టీమిండియా 16 సంవత్సరాలుగా పాకిస్తాన్‌లో పర్యటించలేదని మ‌న‌కు తెలిసిందే. భారత జట్టు చివరిసారిగా 2008లో పాకిస్థాన్‌లో ప‌ర్య‌టించింది.

పీసీబీ మొండిగా ఉంది

అయితే ఈసారి టోర్నీని మరెక్కడా నిర్వహించేందుకు పాకిస్థాన్ క్రికెట్ బోర్డు సిద్ధంగా లేదు. తాజాగా పీసీబీ చైర్మన్ మొహ్సిన్ నఖ్వీ ప్రకటన వెలువడింది. భారత జట్టు పాకిస్థాన్‌కు రావాల్సి ఉంటుందని నఖ్వీ స్ప‌ష్టంగా చెప్పాడు. అన్ని జట్ల సమక్షంలో పాకిస్థాన్‌లో ఛాంపియన్స్ ట్రోఫీని నిర్వహించడంలో విజయం సాధిస్తామన్న నమ్మకం ఉందన్నారు. మరోవైపు టీమిండియా పాక్ వెళ్లే విషయంలో ప్రభుత్వమే తుది నిర్ణయం తీసుకుంటుందని బీసీసీఐ స్పష్టం చేసింది. ఛాంపియన్స్ ట్రోఫీ ఫిబ్రవరి 19 నుంచి ప్రారంభం కానుండగా, టోర్నీ చివరి మ్యాచ్ మార్చి 15న జరగనుంది.

 


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • BCCI
  • Champions Trophy
  • dubai
  • ICC
  • ICC Champions Trophy
  • ind vs pak
  • India vs Pakistan
  • pakisthan
  • PCB

Related News

    Latest News

    • Congress : ఖర్గేతో సీఎం రేవంత్ భేటీ.. తెలంగాణ రాజకీయాలు, ప్రభుత్వ కార్యక్రమాలపై చర్చ

    • Bengaluru : మటన్ పేరుతో బీఫ్ విక్రయం?.. బెంగళూరులో ఇద్దరు రెస్టారెంట్ యజమానుల అరెస్ట్

    • CONGRESS vs BRS : ప‌వ‌ర్ పాలిటిక్స్‌.. ఉచిత విద్యుత్‌పై రేవంత్ స‌వాల్‌కు బీఆర్ఎస్ సైలెంట్‌..?

    • IPL : ఆర్‌సీబీ అభిమానులకు ఉచిత మెట్రో ప్రయాణం.. ప్ర‌చారాన్ని ఖండిచిన బెంగళూరు మెట్రో రైల్ కార్పోరేష‌న్‌

    • Minister Komatireddy : మానవత్వం చాటుకున్న మంత్రి కోమటిరెడ్డి.. “భ‌విత ” బంగారు భ‌విష్య‌త్ కోసం అండ‌గా

    Trending News

      • fake news: లిక్కర్ కేసులో నా భార్యకు నోటీసులు రావడం అంతా అబద్ధం.. కేశినేని చిన్ని !

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd