Head Replaces Suryakumar: సూర్యకుమార్ యాదవ్‌కు బిగ్ షాక్.. టీ20 ర్యాంకింగ్స్‌లో నెంబర్ వన్‌గా ట్రావిస్ హెడ్..!
- Author : Gopichand
Date : 26-06-2024 - 4:26 IST
Published By : Hashtagu Telugu Desk
Head Replaces Suryakumar: T20 ప్రపంచకప్ 2024 కోసం ICC కొత్త T20 ర్యాంకింగ్‌లను విడుదల చేసింది. ఈసారి కొత్త ర్యాంకింగ్స్‌లో భారీ మార్పులు కనిపించింది. సూర్యకుమార్ యాదవ్ స్థానంలో ట్రావిస్ హెడ్ (Head Replaces Suryakumar) నంబర్ 1 బ్యాట్స్‌మెన్‌గా నిలిచాడు. ఇంగ్లండ్‌కు చెందిన ఫిల్ సాల్ట్, పాకిస్థాన్‌కు చెందిన బాబర్ ఆజం, మహ్మద్ రిజ్వాన్ స్థానాల్లో కూడా మార్పు చోటుచేసుకుంది. భారత్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆస్ట్రేలియా స్టార్ బ్యాట్స్‌మెన్ ట్రావిస్ హెడ్ అద్భుత హాఫ్ సెంచరీ సాధించారు. అతని ఇన్నింగ్స్ అతనికి ర్యాంకింగ్‌లో లాభించింది. అంతకుముందు టాప్ 10లో కూడా లేడు.
ICC T20 వరల్డ్ కప్ 2024 సెమీ-ఫైనల్ మ్యాచ్‌లకు ముందు ICC T20 బ్యాట్స్‌మెన్ తాజా ర్యాంకింగ్‌ను విడుదల చేసింది. ఇందులో ఆస్ట్రేలియా బ్యాట్స్‌మెన్ ట్రావిస్ హెడ్ నంబర్-1 బ్యాట్స్‌మన్‌గా నిలిచాడు. భారత్‌కు చెందిన సూర్యకుమార్ యాదవ్ రెండో స్థానానికి పడిపోయాడు. సూర్యకుమార్ యాదవ్, ట్రావిస్ హెడ్ మధ్య చాలా తేడా లేనప్పటికీ.. చాలా కాలం పాటు నంబర్-1 T20 బ్యాట్స్‌మన్‌గా ఉన్నాడు సూర్యకుమార్. భారత్‌తో జరిగిన సూపర్-8 మ్యాచ్‌లో ట్రావిస్ హెడ్ 76 పరుగులతో ఇన్నింగ్స్ ఆడాడు. ఇది అతనికి ర్యాంకింగ్స్‌లో లాభించింది. దీంతో హెడ్ ఏకంగా నాలుగు స్థానాలు ఎగబాకి నంబర్-1 స్థానానికి చేరుకున్నాడు. ట్రావిస్ హెడ్‌కు 844 రేటింగ్ పాయింట్లు ఉండగా, సూర్యకుమార్ యాదవ్‌కు 842 రేటింగ్ పాయింట్లు ఉన్నాయి.
Also Read: David Warner: వారసుడిని ప్రకటించిన డేవిడ్ వార్నర్.. ఎవరంటే..?
Australia's belligerent southpaw ends Suryakumar Yadav's reign at the 🔝 of Men's T20I Batting Ranking 🤩https://t.co/nAJR10IVCp
— ICC (@ICC) June 26, 2024
ఇంగ్లండ్ ఆటగాడు ఫిల్ సాల్ట్ ఒక స్థానం దిగజారి మూడో ర్యాంక్‌కు చేరుకోగా, పాక్ కెప్టెన్ బాబర్ ఆజం కూడా ర్యాంకింగ్స్‌లో ఒక స్థానం కోల్పోయి నాలుగో స్థానానికి చేరుకున్నాడు. పాకిస్థాన్ వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ మహ్మద్ రిజ్వాన్ కూడా ఒక స్థానం కోల్పోయి ఐదో స్థానానికి చేరుకున్నాడు. ఇంగ్లండ్ కెప్టెన్ జోస్ బట్లర్ ఆరో స్థానంలో కొనసాగుతున్నాడు. కాగా, భారత ఓపెనింగ్ బ్యాట్స్‌మెన్ యశస్వి జైస్వాల్ 7వ స్థానంలో కొనసాగుతున్నాడు.
We’re now on WhatsApp : Click to Join
ఐడెన్ మార్క్రామ్ 8వ స్థానంలో, బ్రాండన్ కింగ్ 9వ స్థానంలో ఉన్నారు. జాన్సన్ చార్లెస్ 10వ స్థానంలో ఉన్నాడు. టీం ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఆస్ట్రేలియాపై 92 పరుగులతో ఇన్నింగ్స్ ఆడాడు. ఈ కారణంగా అతను ర్యాంకింగ్‌లో పెద్ద ప్రయోజనం పొందాడు. రోహిత్ శర్మ 13 స్థానాలు ఎగబాకి 38వ స్థానానికి చేరుకున్నాడు. విరాట్ కోహ్లీ మూడు స్థానాలు ఎగబాకి 47వ స్థానానికి చేరుకున్నాడు. దీంతో పాటు రితురాజ్ గైక్వాడ్ ఆరు స్థానాలు దిగజారి 19వ స్థానానికి చేరుకున్నాడు.